Jump to content

నికితా మిఖల్కోవ్

వికీపీడియా నుండి
నికితా మిఖల్కోవ్
నికితా మిఖల్కోవ్ (2018)
జననం
నికితా సెర్గేవిచ్ మిఖల్కోవ్

(1945-10-21) 1945 అక్టోబరు 21 (వయసు 79)
వృత్తిసినిమా దర్శకుడు, నటుడు
క్రియాశీల సంవత్సరాలు1959–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అనస్తాసియా వెర్టిన్స్కాయ
(m. 1966⁠–⁠1971)
టటియానా మిఖల్కోవా
(m. 1973)
పిల్లలు4, అన్నా మిఖల్కోవా, నదేజ్దా మిఖల్కోవా
తల్లిదండ్రులు
  • సెర్గీ మిఖల్కోవ్ (తండ్రి)
  • నటాలియా కొంచలోవ్స్కాయ (తల్లి)
బంధువులుఆండ్రీ కొంచలోవ్స్కీ (సోదరుడు)

నికితా సెర్గేవిచ్ మిఖల్కోవ్, సోవియట్ - రష్యన్ సినిమా దర్శకుడు, నటుడు, రష్యన్ సినిమాటోగ్రాఫర్స్ యూనియన్ అధిపతి.[1] 1993, 1995, 1999లలో మూడుసార్లు రష్యన్ ఫెడరేషన్ స్టేట్ ప్రైజ్ అందుకున్నాడు.

జననం

[మార్చు]

మిఖల్కోవ్ 1945, అక్టోబరు 21న మాస్కో నగరంలో జన్మించాడు. ముత్తాత యారోస్లావ్ల్కు ఇంపీరియల్ గవర్నర్, తల్లి హౌస్ ఆఫ్ గోలిట్సిన్ యువరాణి, తండ్రి సెర్గీ మిఖల్కోవ్ బాలల సాహిత్య రచయిత.

సినిమాలు

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]
  • అండ్ ఐ గో హోమ్ (1968) (లఘు చిత్రం)
  • ఎ క్వైట్ డే డ్యూరింగ్ ది ఎండ్ ఆఫ్ వార్ (1970) (లఘు చిత్రం)
  • ఎట్ హోమ్ అమాంగ్ స్ట్రేంజర్స్ (1974)
  • ఎ స్లేవ్ ఆఫ్ లవ్ (1976)
  • వితౌట్ విట్‌నెస్ (1983)
  • డార్క్ ఐస్ (1987)
  • హిచ్-హైకింగ్ (1990)
  • క్లోజ్ టు ఈడెన్ (1992) (అకా ఉర్గా)
  • అన్నా: 6 - 18 (1993)
  • బర్న్ట్ బై ది సన్ (1994)
  • ది బార్బర్ ఆఫ్ సైబీరియా (1998)
  • 12 (2007)
  • బర్న్ట్ బై ది సన్ 2: ఎక్సోడస్ (2010)
  • బర్న్ట్ బై ది సన్ 2: ది సిటాడెల్ (2011)
  • సన్‌స్ట్రోక్ (2014)[2]

నటుడిగా

[మార్చు]
  • అడ్వెంచర్స్ ఆఫ్ క్రోష్ (1961)
  • ఐ స్టెప్ త్రూ మాస్కో (1964)
  • ఎ నెస్ట్ ఆఫ్ జెంట్రీ (1965)
  • ది రెడ్ అండ్ ది వైట్ (1967)
  • ది రెడ్ టెంట్ (1969)
  • స్టేషన్‌మాస్టర్ (1972)
  • ఎట్ హోమ్ అమాంగ్ స్ట్రేంజర్స్ (1974)
  • ఎ స్లేవ్ ఆఫ్ లవ్ (1976)
  • సైబీరియాడ్ (1978)
  • ది హౌండ్ ఆఫ్ ది బాస్కర్‌విల్లెస్ (1981)
  • ఎ పెయింటర్స్ వైఫ్ పోర్ట్రెయిట్ (1982)
  • స్టేషన్ ఫర్ టూ (1983)
  • ఎ క్రూయల్ రొమాన్స్ (1984)
  • బర్న్ట్ బై ది సన్ (1994)
  • గోగోల్ ది గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ (1996)
  • ది బార్బర్ ఆఫ్ సైబీరియా (1998)
  • ది స్టేట్ కౌన్సెలర్ (2005)
  • పర్సోనా నాన్ గ్రేటా (2005)
  • 12 (2007)
  • బర్న్ట్ బై ది సన్ 2: ఎక్సోడస్ (2010)
  • బర్న్ట్ బై ది సన్ 3: ది సిటాడెల్ (2011)

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మిఖల్కోవ్ 1967, మార్చి 6న ప్రఖ్యాత రష్యన్ నటి అనస్తాసియా వెర్టిన్స్కాయను వివాహం చేసుకున్నాడు. వారికి స్టెపాన్ అనే కుమారుడు ఉన్నాడు.

మాజీ మోడల్ టాట్యానాతో రెండవ వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఆర్టియోమ్, కుమార్తెలు అన్నా, నాడియా ఉన్నారు.

అవార్డులు

[మార్చు]

1991లో నికితా మిఖల్కోవ్ గోల్డెన్ లయన్ ఆఫ్ ది వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ని గెలుచుకున్నాడు. క్లోజ్ టు ఈడెన్ సినిమాకు ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం విభాగంలో అకాడమీ అవార్డు (1993)కి ఎంపికయ్యాడు. బర్న్ట్ బై ది సన్ అనే సినిమాకు 1995లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో అకాడమీ అవార్డు, 1994లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకున్నాడు. సినిమాటోగ్రఫీ విభాగంలో చేసిన కృషికి 2007లో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "స్పెషల్ లయన్" అందుకున్నాడు. 2007లో 12 సినిమాకు అకాడమీ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. Peter Rollberg (2016). Historical Dictionary of Russian and Soviet Cinema. US: Rowman & Littlefield. pp. 489–491. ISBN 978-1442268425.
  2. Solnechnyy udar (Sunstroke) at IMDb.com

బయటి లింకులు

[మార్చు]