నమిత ప్రమోద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నమిత ప్రమోద్
జననం (1996-09-19) 1996 సెప్టెంబరు 19 (వయసు 27)
కొట్టాయం, కేరళ, భారతదేశం
విద్యాసంస్థసెయింట్. తెరిసా కళాశాల, కొచ్చి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011 – ప్రస్తుతం

నమిత ప్రమోద్ (జననం 1996 సెప్టెంబరు 19) భారతీయ నటి. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె 2011లో ట్రాఫిక్‌ చిత్రంతో అరంగేట్రం చేసింది.[1]

ఆమె పుతియా తీరంగల్ (2012), సౌండ్ తోమా (2013), పుల్లిపులికలుమ్ అట్టింకుట్టియుమ్ (2013), విక్రమాదిత్యన్ (2014), విల్లాలి వీరన్ (2014), చంద్రేత్తన్ ఎక్కడేయ (2015), అమర్ అక్బర్ ఆంథోని (2015) ఆది కప్యారే కూటమణి (2015), రోల్ మోడల్స్ (2017), అల్ మల్లు (2020) వంటి సూపర్ హిట్ చిత్రాలలో ఆమె నటించింది.

2016లో చుట్టాలబ్బాయి, 2017లో కథలో రాజకుమారి సినిమాలతో తెలుగుప్రేక్షకులకు ఆమె దగ్గరయింది.[2][3] ఆమె భీమా జ్యువెలర్స్, ఫ్రాన్సిస్ అలుక్కాస్, రిప్పల్ టీ వంటి అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది. ఆమె ఆసియానెట్‌లో నింగల్కుమ్ ఆకం కోదీశ్వరన్ అనే రియాల్టీ షోలో పాల్గొంది. 2023లో, ఆమె కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో ఉన్న వింటేజ్ కేఫ్ సమ్మర్ టౌన్ కేఫ్‌ను స్థాపించింది.[4]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

నమిత ప్రమోద్ కొట్టాయంలో వ్యాపారవేత్త అయిన ప్రమోద్, గృహిణి అయిన ఇందులకు జన్మించింది.[5] ఆమెకు ఒక చెల్లెలు అఖితా ప్రమోద్ ఉంది.[6] ఆమె తిరువనంతపురంలోని కార్మెల్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివింది.[7] ఆమె సోషియాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని అభ్యసించేందుకు కొచ్చిలోని సెయింట్ థెరిసా కళాశాలలో చేరింది.[8]

కెరీర్[మార్చు]

ఆమె ఏడో తరగతి చదువుతున్నప్పుడే వెల్లంకన్ని మాతవు, అమ్మే దేవి, ఎంత మానస పుత్రి చిత్రాల్లో నటించడం ద్వారా సినిమా రంగంలో ప్రసిద్ధిచెందింది.[9][10] విమర్శకుల ప్రశంసలు పొందిన రాజేష్ పిళ్లై ట్రాఫిక్‌లో ఆమె తొలిసారిగా కథానాయికగా నటించింది. ఆమె ఆ తరువాత పుతియా తీరంగల్‌లో నివిన్ పౌలీ సరసన మత్స్యకార మహిళగా ప్రధాన పాత్రను పోషించింది. దాని తర్వాత దిలీప్‌తో సౌండ్ థోమా, కుంచాకో బోబన్‌తో కలిసి పుల్లిపులికలుమ్ అట్టింకుట్టియుమ్‌లో నటించింది. ఇందులో ఆమె మోహినియాట్టం నర్తకిగా నటించింది. అయితే ఆమె మోహినియాట్టంలో శిక్షణ పొందలేదు కానీ అలప్పుజాలోని శరణ్య మోహన్ డ్యాన్స్ స్కూల్‌లో నాలుగు రోజులు డ్యాన్స్ స్టెప్స్ నేర్చుకుంది. ఈ రెండు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఆమె మలయాళంలో టాప్ స్టార్ (ఫిమేల్) 2013గా ఎంపికైంది.[11]

2014లో, ఆమె మొదటిసారిగా మారిస్ కుమార్ దర్శకత్వం వహించిన తొలి తమిళ చిత్రం ఎన్ కాదల్ పుదితులో నటించింది, అయితే అది విడుదల ఆలస్యం అయింది.[12] ఆ తర్వాత లిజిన్ జోస్ లా పాయింట్‌లో ఆమె మాయ అనే ఆధునిక, నగరానికి చెందిన అమ్మాయిగా నటించింది.[13][14] లాల్ జోస్ విక్రమాదిత్యన్‌లో, ఆమె దీపిక అనే కొంకణి అమ్మాయి పాత్రను కూడా పోషించింది. దీని కోసం ఆమె కొంకణిలో కొన్ని పంక్తులు మాట్లాడవలసి వచ్చింది. ఆమె తదుపరి చిత్రం విల్లాలి వీరన్, దీనిలో ఆమె మరోసారి దిలీప్‌తో జతకట్టింది.

2014లో ఆమె చివరిగా విడుదలైన ఓర్మాయుందో ఈ ముఖం, ఇందులో ఆమె వినీత్ శ్రీనివాసన్ సరసన నటించింది. ఆమె 2015లో విడుదలైన చంద్రేత్తన్ ఈవిదేయలో ఆమె దిలీప్, అనుశ్రీతో పాటు డా.గీతాంజలి పాత్రను పోషించింది. ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌లో తన మొదటి ప్రతిపాదనను అందుకుంది.

మూలాలు[మార్చు]

  1. "എന്നെ വിട്ടുപോകാത്ത താമര, Interview – Mathrubhumi Movies". Mathrubhumi.com. 5 November 2012. Archived from the original on 7 January 2014. Retrieved 24 June 2014.
  2. Glad to debut in telugu
  3. "Namitha Pramod is Rohith's Rajakumari". thehansindia.com. 21 November 2015. Retrieved 26 November 2015.
  4. Daily, Keralakaumudi. "Namitha Pramod comes up with new venture; inaugurated together by stars, Meenakshi Dileep lights ceremonial lamp". Keralakaumudi Daily (in ఇంగ్లీష్). Retrieved 2023-02-13.
  5. "Namitha Pramod: A shooting star". Deccan Chronicle. 18 August 2013. Archived from the original on 11 July 2018. Retrieved 24 June 2014.
  6. "Namitha, into the big league". IndiaGlitz. 25 July 2012. Archived from the original on 27 July 2012. Retrieved 1 January 2013.
  7. "Role call". The Hindu. 29 September 2012. Archived from the original on 14 December 2013. Retrieved 24 June 2014.
  8. Namitha Pramod's dream of working with Prithviraj comes true Archived 8 జూలై 2014 at the Wayback Machine. Deccanchronicle.com (3 July 2014). Retrieved 14 October 2015.
  9. Namitha Pramod plays a fisherwoman | Deccan Chronicle. Web.archive.org (11 July 2012). Retrieved 14 October 2015.
  10. "സാധാരണ ജീവിതമാണ് ഇഷ്ടം". mangalam.com. 11 June 2013. Archived from the original on 3 December 2013. Retrieved 24 June 2014.
  11. "The Movies Details/Reviews: TOP 10 HIGHEST GROSSING MALAYALAM MOVIES −2013". Themoviesdetails.blogspot.in. 9 January 2014. Archived from the original on 30 October 2014. Retrieved 24 June 2014.
  12. Trailing his mentor | Deccan Chronicle Archived 14 జూలై 2014 at the Wayback Machine. Archives.deccanchronicle.com (7 March 2013). Retrieved 14 October 2015.
  13. "Namitha going glam". The Times of India. 10 December 2013. Archived from the original on 11 December 2013. Retrieved 24 June 2014.
  14. "നമിതാ പ്രമോദ്‌." mangalam.com. 14 December 2012. Archived from the original on 16 October 2014. Retrieved 24 June 2014.