నర్రా రవికుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవికుమార్ నర్రా
Narra Ravi Kumar
జననం1 సెప్టెంబరు 1963
సికిందాబాదు, భారతదేశము
వృత్తిభారత వ్యాపారవేత్త, సమాజ సేవకుడు
జీవిత భాగస్వామినర్రా విజయలక్ష్మి
పిల్లలుఆదిత్య ఋత్విక్
ఆదిత్య రోహన్
తల్లిదండ్రులుశంకరయ్య నర్రా
పురస్కారాలుపద్మశ్రీ

నర్రా రవికుమార్ (Narra Ravi Kumar) భారతదేశ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. ఆయన సికింద్రాబాదుకు చెందినవారు. ఆయన దళితుల అభ్యున్నతికి కృషిచేస్తున్న వ్యక్తిగా సుపరిచితులు. ఆయనకు భారతదేశ నాల్గవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు.

జీవిత విశేషాలు[మార్చు]

నర్రా రవికుమార్ సెప్టెంబరు 1 1963 న సాధారణ ఆర్థిక పరిస్థితి గల తాపీమేస్త్రి అయిన స్వర్గీయ శంకరయ్యకు జన్మించారు.[1][2] ఆయన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదుకు జంట నగరమైన సికింద్రాబాదులో మురికివాడలో నివసించేవారు.[3] రవికుమార్ బి.యస్సీ డిగ్రీని పొంది న్యాయవిద్యలో కూడా పట్టభద్రుడైనాడు. తరువాత ఆయన ఎల్.ఎల్.ఎం మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆయన జర్నలిజంలో, పబ్లిక్ రిలేషన్స్ లలో డిప్లొమాలు కూడా పొందారు.[1][2]

పద్మశ్రీ అవార్డు గ్రహీత నర్రా రవికుమార్ బహుముఖ మూర్తిమత్వం కలిగియుండేవారు. ఆయన వెనుకబడిన నేపథ్యంలో జన్మించినప్పటికీ దళిత సాధికారికతకు అద్ధం పట్టే విధంగా గుర్తింపు పొందారు.

ఆయన మురికివాడలోని జన్మించాడు. ఆయన తండ్రి రోజువారీ తాపీపని చేసేవారు. తల్లి పనిమనిషిగా ఉండేవారు. రవి తన విద్యాభివృద్ధికోసం దృష్టిమరల్చి న్యాయశాస్త్రంలో డిగ్రీని, పోస్టుగ్రాడ్యుయేషన్ డిగ్రీ, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ లలో డిప్లొమాలను పొందారు. ఆయన తన లక్ష్యాన్ని చేరుకొనుటకు వ్యాపార రంగంలో ప్రవేశించారు.

వ్యాపారవేత్తగా[మార్చు]

రవి ఇన్‌ఫ్రా రంగంలో అడుగుపెట్టారు. ఆయన శాంతి చక్ర అసోసియేట్స్, ఆదిత్య కమ్యూనికేషన్‌ సంస్థలో చేరి నిర్మాణ పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో నివాస యూనిట్లను తయారుచేయుట, అపార్టుమెంటులో గృహనిర్మాణాలు మొదలైన పనులు చేపడుతున్నారు.

అవార్డులు, గుర్తింపులు[మార్చు]

ఆయనకు 2014 లో పద్మశ్రీ పురస్కారం లభించింది.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Election Commission of India". Election Commission of India. 2004. Archived from the original on 2016-03-03. Retrieved September 28, 2014.
  2. 2.0 2.1 "Shanti Chakra International Foundation". Shanti Chakra International Foundation. 2014. Archived from the original on 2016-05-28. Retrieved September 28, 2014.
  3. "About". Personal web site. 2014. Retrieved September 28, 2014.[permanent dead link]
  4. "Padma Awards Announced". Circular. Press Information Bureau, Government of India. January 25, 2014. Archived from the original on 2019-05-17. Retrieved 2022-04-07.

ఇతర లింకులు[మార్చు]