నల్లాన్ శ్రీ రామ చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లాన్ చక్రవర్తుల శ్రీ రామ చక్రవర్తి
శ్రీ రామ చక్రవర్తి
తెలుగు రచయిత
జాతీయతభారతదేశము
వృత్తివిశ్రాంత ఒజ్జ
పురస్కారాలుసి.నా.రే సాహిత్య పునస్కారం

నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి 01.04.1959లో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. తల్లి రుక్మిణమ్మ, తండ్రి సంగీత సాహిత్య కళానిధి నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు. స్వగ్రామం విజయవాడ.

ముద్రితలు[మార్చు]

1. దృక్కులు (పద్య సంకలనం - 2002)

2. రెండు దరుల నడుమ (వచన కవిత - 2003)

3. బాలల కొలువు (దీర్ఘ కవిత - 2006)

4. కాలం సాక్షిగా (కప్లెట్)

5. కవనంతో సవనం (పద్య ఖండికలు - 2009)

6. నానీ పంచశతి (నానీలు)

7. నా భావ సుందరి (పద్య కావ్యం)

8. వెన్నెల వాగు (వచన కవితలు)

9. నాలో ప్రపంచం (ప్రపంచ పదులు)

10. సత్య ప్రభ (పద్య కావ్యం)

11. ఆమని వలచిన తోట (గజల్)

12. వెన్నెల వాగు (రాగపక్షం)

13. వెన్నెల వాగు (విరాగపక్షం)

అముద్రితాలు[మార్చు]

1. భద్రధామ శతకం (పద్యాలు)

2. నానోలు

3. హైకూలు

4. వ్యంజకాలు

5. నీతి పద్యాలు 1000 దాకా

6. సమస్యాపూరణలు.

7. విమర్శ వ్యాసాలు.

8. రుబాయీలు

9. మినీ కవితలు

పట్టున్న రచనా ప్రక్రియలు[మార్చు]

1. పద్యం

2. వచనకవిత

3. కప్లెట్స్

4. ప్రపంచపదులు

5. నానీలు

6. గేయాలు

7. నానోలు

8. వ్యంజకాలు

9. దీర్ఘకవిత

10. హైకూలు

11. వ్యాసాలు

12. సమీక్షలు

13. పీఠికలు

14. రుబాయీలు

15. గజల్స్

16. లఘుకవితలు

17. కథలు

18. దీర్ఘకవిత

19. యక్షగానాలు

20. నాటికలు

పురస్కారాలు[మార్చు]

డా. మాడుగుల వారి నేతృత్వంలో అధికారభాషాసంఘం వారి సత్కారం. ప్రసంగప్రవీణ బిరుదు. నవరసకవి చక్రవర్తి బిరుదు.

ప్రముఖుల ప్రశంసలు:[మార్చు]

డా. సినారె గారు,[1] డా. N. గోపి గారు, కంది శంకరయ్య గారు. పింగళి వెంకట కృష్ణారావు గారు. డా. చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారు డా. కావూరి పాపయ్య శాస్త్రి గారు. మాల్యశ్రీ గారు.

ఇతరసాహితీ కళాసేవలు:[మార్చు]

అనేక సాహితీ సంస్థలలో భాగస్వామ్యం. భద్రగిరి ధ్రువకోకిల సాహిత్య బృందం ద్వారా వర్ధిష్ణువులకు సాహిత్య శిక్షణ. కృష్ణమాచార్యకళాపీఠం వివిధ బాధ్యతల్లో సంగీతసాహిత్య సేవ.

రేడియో/టీవీ కార్యక్రమాలు[మార్చు]

రేడియోలో, టీవీలో రచనలు లలితగీతాలు ప్రసారం. రేడియోలో అనేక సాహిత్య ప్రసంగాలు. రేడియో కవిసమ్మేళనాల నిర్వహణ, పాల్గొనడం. రేడియోలో భద్రాచలం శ్రీరామనవమి/ ముక్కోటి ఉత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాలు.

స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు:[మార్చు]

తండ్రిగారు కృష్ణమాచార్యులు గారు. పోతన, త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య.

నచ్చినకవి/రచయిత:[మార్చు]

చేమకూర వెంకటకవి, పోతన, జాషువా, మా నాయనగారు, డా. సినారె కొడవటిగంటి

కొత్త రచయితలకు సూచనలు[మార్చు]

బాగా అధ్యయనం చెయ్యాలి. భాషపైనా పద్యాలు వ్రాస్తే ఛందస్సుపైనా వ్యాకరణమూ, అలంకారమూ, ఔచిత్యమూ, రసమూ మున్నగు అంశాల్లో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. బిరుదులూ సత్కారాల వెంపర్లాట అసలు పనికిరాదు. కవిత్వమే గొప్పది కవికంటే!!

ప్రస్తుత భాషా సాహిత్యాలపై అభిప్రాయం: ఇప్పుడు వ్రాసేవారి రాశి బాగా పెరిగింది. వాసి నాసిగా ఉంది. కవిత్వం అన్న నిర్వచనానికి సరిపడా ఇప్పటివారు వ్రాయలేకపోతున్నారు. అవార్డులు, బిరుదులూ, సర్టిఫికెట్ల రంధి పెరిగింది. సాహిత్య బృందాల పేరుతో ఏమీ రానివాళ్లకు బిరుదులు ఇస్తూ సన్మానాలు చేస్తూ భాషకూ సాహిత్యానికీ చాలా అపచారమూ అపకారమూ చేస్తున్నారు. యువత అధ్యయనం లేకుండా వ్రాసేస్తున్నారు. కొద్దిమంది మాత్రమే కొంత బాగా వ్రాస్తున్నారు. నేటి స్థితి అంత బాగా లేదనిపిస్తుంది.

మన ప్రాంతంలో మిక్కిలి బాధాకరం ఏమిటంటే భాషపై సాహిత్యంపై పెద్ద అవగాహనలేనివాళ్ళు ప్రయోగాలు అనో కొత్త ఛందస్సులు కనిపెట్టాము అనో అడ్డగోలుగా ప్రచారం చేసుకుంటున్నారు. పైగా దాన్ని ప్రమోట్ చేసుకోడానికి తమ దానిలోనే పోటీలు పెట్టి సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. వాటికై అందరూ ఎగబడుతున్నారు. శతకవి సమ్మేళనాలూ, సహస్ర కవి సమ్మేళనాల పేరిట చాలా అపకారం జరుగుతున్నది. కవిత్వం కాక వ్యక్తులు వెలుగులోకి వచ్చే కాలం దాపురించింది.

బయటి లింకులు[మార్చు]

  1. https://r.search.yahoo.com/_ylt=Awr48t30DbplGgQAtTpXNyoA;_ylu=Y29sbwNncTEEcG9zAzIEdnRpZAMEc2VjA3Ny/RV=2/RE=1707901685/RO=10/RU=https%3a%2f%2fwww.youtube.com%2fwatch%3fv%3dIxLrBD_Fggg/RK=2/RS=97OqeGjIZh5k3mJq2nn2JmmJ8n0-[permanent dead link]

మూలాలు[మార్చు]

  1. <"సంపుటి 3 సంచిక 4 అక్టోబర్ – డిసెంబర్ 2023 - ప్రకాశిక" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-12-29. Retrieved 2024-01-31.
  2. https://www.prakasika.org/read-in-pdf/%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8b%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b8%e0%b1%86%e0%b0%82%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-2023/
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :0 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు