నల్లేరు
నల్లేరు | |
---|---|
నల్లేరు మొక్క. | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | సిస్సస్
|
Species: | సి. క్వాడ్రాంగ్యులారిస్
|
Binomial name | |
సిస్సస్ క్వాడ్రాంగ్యులారిస్ |
నల్లేరు (లాటిన్ Cissus quadrangularis) ద్రాక్ష కుటుంబానికి చెందిన తీగ మొక్క. ఇది సాధారణముగా పశువులకు మేతగా ఉపయోగిస్తారు. భారత, శ్రీలంక ప్రాంతానికి చెందిన ఈ మొక్క ఆఫ్రికా, అరేబియా, ఆగ్నేయాసియాలలో కూడా కనిపిస్తుంది. ఇది బ్రెజిల్, అమెరికా సంయుక్త రాష్ట్రాల దక్షిణ ప్రాంతానికి ఎగుమతి చేయబడింది. తెలుగుదేశంలో "నల్లేరుమీద బండినడక" అనే సామెత వాడుకలో ఉంది । సామెత మాత్రమే కాక, పల్లెల్లో పూర్వం బాలింతలను కాన్పు అయిన తరువాత ఊరికి తీసుకొని వెళ్ళే సందర్భంలో, అటువంటి ఇతర సందర్భాలలో బండి కదిలి ఊరి పొలిమేరలోకి రాగానే బండి చక్రాలకింద నల్లేరు కాడలువేస్తారు, బండి ఆ కాడలమీదుగా పోతే శుభప్రదమని విశ్వాసం. ఈ సంప్రదాయం దాదాపు 50 ఏళ్ళ క్రితం వరకు వాడుకలో ఉంది.
లక్షణాలు
[మార్చు]- రసయుతమైన చతుర్థకోణయుత కాండంతో నులితీగ సహాయంతో ఎగబ్రాకే పొద.
- అండాకారంలో గాని, మూత్రపిండాకారంలో గాని ఉన్న సరళ పత్రాలు.
- నిశ్చితగుచ్ఛాలలో అమరి ఉన్న లేత గోధుమ రంగు పుష్పాలు.
- ఎరుపు రంగు మృదు ఫలాలు.
వైద్యంలో
[మార్చు]నల్లేరు భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతున్నది. నల్లేరును ఆయుర్వేద వైద్యంలో విరిగిన ఎముకలు త్వరగా కట్టుకోవడానికి, ఉపయోగిస్తారు. దగ్గు, కోరింత దగ్గు, శ్లేష్మము తగ్గటానికి నల్లేరును రొట్టె , తేనె, వడియాలలో కలిపి వాడుతారు. సిద్ధ వైద్య విధానంలో నల్లేరు విరిగిన ఎముకలను తిరిగి అతికించడానికి ఉపయోగించబడుతుంది, అందుకే దీనికి అస్థిసంహారక (ఎముకలను రక్షించేది) అనే పేరువచ్చింది. బంగ్లాదేశ్ లోని గారో తెగ వారు నల్లేరును విరిగిన ఎముకలను కట్టడానికి ఉపయోగిస్తారు.[1]
బయటి లింకులు
[మార్చు]- పర్డ్యూ విశ్వవిద్యాలయపు వెబ్సైట్లో నల్లేరు గురించి
- నల్లేరు గురించి Archived 2006-10-14 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- ↑ Mia, Md. Manzur-ul-Kadir; Kadir, Mohammad Fahim; Hossan, Md. Shahadat; Rahmatullah, Mohammed (Jan–Apr 2009). "Medicinal plants of the Garo tribe inhabiting the Madhupur forest region of Bangladesh". American-Eurasian Journal of Sustainable Agriculture. 3 (2): 165–171.[permanent dead link]