Jump to content

నల్ల పరంధాములు

వికీపీడియా నుండి

వస్త్ర శాస్త్రవేత్తగా, చేనేత వస్త్ర పరిశోధకుడిగా పేరుపొందిన నల్ల పరంధాములు (Nalla Parandhamulu) కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందినవాడు. అగిపెట్టెలో సైతం ఇమిడిపోయే 5 గజాల చీరలను మగ్గంపై నేసిన ఘనతను పొంది పలువురి ప్రశంసలు అందుకున్నడు. 2000 ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా అట్లాంటాలో 335 గజాల బ్యానర్ తయారుచేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి తెలిపిండు. 1987 నుంచే మగ్గంపై దుస్తుల తయారీకి కొత్త ఒరవడి సృష్టిస్తున్నడు. 1990లోనే అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టుచేరెను తయారుచేసిండు. 1995లో ఉంగరం నుంచి దూరిపోయే సన్నని చీరను నేసిండు. ఎలాంటి కుట్లు లేకుండా దుస్తులు తయారుచేసి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఎన్టీ రామారావులకు బహుకరించిండు.[1] వస్త్ర తయారీలో ఎన్నో ప్రయోగాలు చేసి పలువురి నుంచి ప్రశంసలతో పాటు పలు అవార్డులు గెలుచుకున్నడు.

మూలాలు

[మార్చు]
  1. శతవసంతాల కరీంనగర్ (190-2005) మానేరు టైమ్స్ ప్రచురణ, పేజీ 89

యితర లింకులు

[మార్చు]