Jump to content

భాగవతం - తొమ్మిదవ స్కంధము

వికీపీడియా నుండి
(నవమ స్కంధము నుండి దారిమార్పు చెందింది)
భాగవతం
స్కంధములు
ప్రధమ స్కంధము
ద్వితీయ స్కంధము
తృతీయ స్కంధము
చతుర్ధ స్కంధము
పంచమ స్కంధము
షష్టమ స్కంధము
సప్తమ స్కంధము
అష్టమ స్కంధము
నవమ స్కంధము
దశమ స్కంధము
ఏకాదశ స్కంధము
ద్వాదశ స్కంధము
**********************
కృష్ణుడు
దశావతారములు
హిందూధర్మశాస్త్రాలు
రామాయణం
మహాభారతం
పురాణాలు
వేదవ్యాసుడు
ఆంధ్ర మహాభాగవతము
బమ్మెర పోతన

ఇందులో రామాయణము కూడా ఒక భాగము, ఆ రామాయణము నుండి కొన్ని పద్యాలు చూడండి.

శ్రీ రామచరిత్ర

మత్తేభము:

అమరేంద్రాశకుబూర్ణచంద్రుడుదితుండైనట్లునారాయణాం

శమునం బుట్టె మదాంధ రావణశిరస్సంఘాతసంఛేదన

క్రమణోద్దాముడు రాము డాగరితకు గౌసల్యకున్ నన్ను తా

సమనైర్మల్య కతుల్య కంచితజనుస్సంసారసాఫల్యకున్.

తూర్పుదిక్కుకు నిండుచంద్రుండు ఉదయించినట్లుగా పొగడదగినదీ, పరిశుద్ధురాలూ, సంసారసాఫల్యాన్ని పొందినదీ, సాటిలేనిసాధ్వి అయినా కౌసల్యకు, గర్వాంధుడైన రావణుని తలలను ఖండించుటలో గడిదేరిన శ్రీ రాముడు నారాయణాంశతో జన్మించాడు.

మత్తేభము:

సవరక్షార్థము దండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడరా

నవలీలం దునుమాడె రాము డదయిండై బాలుడై కుంతల

చ్చవిసంపజితహాటకం గపటభాషావిఫురన్నాటకన్

జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకమ్ దాటకన్.

  • బాలుడైన ఆ రాముడు తండ్రి పంపగా యాగాన్ని కాపాడ్డానికి విశ్వామిత్రునివెంట వెళ్ళాడు. వెళ్ళి బంగారు రంగు జుట్టు కలదీ, కవటపు మాటలతో కూడిన నటనకలిగినదీ సూర్యుడి గుఱ్రాలకంటె వడిగా పరుగులెత్తేదీ, చేత డాలుకలిగినదీ అయిన తాటక అనే రాక్షసిని ఏ మాత్రం దయతలచక అవలీలగా నేలకూల్చాడు.

కందము:

గారామున గౌశికమఖ

మా రాముడు గాచి దైత్యు నధికు సుబాహున్

ఘోరాజిద్రుంచి తోలెను

మారీచున్నీచు గపటమంజులరోచున్

  • ఆ రాముడు బలవంతుడైన సుబాహుణ్ణి ఘోరయుద్ధంలో చంపి కపటమైన వేషాన్ని ధరించిన మారీచుణ్ణి తరిమికొట్టి విశ్వామిత్రుడి యాగాన్ని కాపాడాడు.

మత్తేభము:

ఒక మున్నూఱు గదల్చి తెచ్చిన లలాటో గ్రాక్షుచాపంబు బా

లకరీంద్రంబు సులీలమై జెఱుకు గోలం ద్రుంచు చందంబునన్

సకలోర్వీశులు జూడగా విఱిచె దోశ్శక్తిన్ విదేహక్షమా

ఒకగేహంబున సీతకై గుణమణి వ్రస్ఫీతకై లీలతోన్

కందము:

భూతలనాథుడు రాముడు

ప్రీతుండై పెళ్ళి యాడె బృథుగుణమణి సం

ఘాతన్ భాగ్యోపేతన్

సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్

  • లోకనాయకుడైన రాముడు గొప్ప గుణవంతురాలూ, అదృష్టవంతురాలూ, చంద్రుణ్ణి అతిశయించిన ముఖకాంతి కలదైన సీతను ప్రీతితో పెండ్లాడినాడు.

కందము:

రాముడు నిజబాహుబల

స్థేమంబున భంగపఱిచె దీర్ఘకుఠారో

ద్దామున్ విదళీకృతనృప

భామున్ రణరంగభీము భార్గవరామున్.

  • ఆ రాముడు గండ్రగొడ్డలికలిగిన గండరగండడు, రాజుల తేజస్సును పటాపంచలు చేసినవాడు, రణరంగంలో వరవీరభయంకరుడు అయిన పరశురాముణ్ణి భంగపరచాడు.

కందము:

దశరథుడు మున్ను గైకకు

వశుడై తానిచ్చి నట్టి వరముకతన వా

గ్దశ చెడక యడవి కనిచెను

దశముఖముఖకమలతుహినధామున్ రామున్.

  • దశరథుడు మునుపు కైకకు ఇచ్చిన వరాలకు కట్టుబడి మాట తప్పక రావణునిముఖకమలాలకు చంద్రుడైన రామచంద్రుణ్ణి అడవికి పంపాడు.

కందము:

జనకుడు పనిచిన మేలని

జనకజయును లక్ష్మణుండు సంసేవింపన్

జనపతి రాముడు విడిచెను

జనపాలారాధ్య ద్విషదసాధ్య నయోధ్యన్

  • తండ్రి ఆజ్ఞ తలదాల్చి ఆ రామ చంద్రుడు సీతాలక్ష్మణులు తన్ను సేవిస్తుండగా రాజులచే పూజింపబడేది, శత్రురాజులకు అసాద్యమైనదీ ఐన అయోధ్యను వదలి వెళ్ళాడు.

కందము:

భరతున్ నిజపదసేవా

నిరతున్ రాజ్యమున నునిచి నృపమణి యెక్కెన్

సురుచిరరుచి పరిభావిత

గురుగోత్రాచలము జిత్రకూటాచలమున్

  • ఆ రాజ శ్రేష్టుడు నిజచరణసేవానిరతుడైన భరతుణ్ణి రాజ్యంలో నిలిపాడు. పిమ్మట సుందరమైన కాంతులతో కులపర్వతాలను మించిన చిత్రకూటపర్వతంమీద కాలుపెట్టాడు.

ఉత్పలమాల:

పుణుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా

రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా

వణ్యము గౌతమీ విమల వ్:కణ పర్యటన ప్రభూత సా

ద్బుణ్య్అము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణయమున్.

  • పుణ్యాత్ముడైన రామచంద్రుడు ఆ విధంగా వెళ్ళి ఋషులకు శరణ్యమూ, పురివిప్పి ఆడే నెమ్మళ్ళతో చూడముచ్చటైనది, పవిత్ర గోదావరీజలాలతొ భాసించేదీ, గొప్పచెట్లతో పొదరిండ్లతో కూడినదీ ఐన దండకారణ్యం అంతటా సంతోషంతో సందర్శించాడు.

సీసము (పద్యం):

ఆ వనంబున రాము డనుజ సమేతుడై

సతితోడ నొక పర్ణశాల నుండ

రావణు చెల్లెలు రతిగోరి వచ్చిన

మొగి లక్ష్మణుడు దాని ముక్కు గోయ

నది విని ఖరదూషణాదులు పదునాల్గు

వేవురురా రామవిభుడు కలన

బాణానలంబున భస్మంబు గావింప

జనకనందన మేని చక్కదనము

తేటగీతి:

విని దశగ్రీవు డంగజ వివశు డగుచు

నర్థి బంచిన జసిడిఱ్రి యై నటించు

నీచు మారీచు రాముడు నెఱి వధించె

నంతలో సీత గొనిపోయె నసురవిభుడు

  • ఆ అడవిలో రాముడు తమ్ముదితో, భార్యతో ఒక కుటీరంలో ఉండగా రావణుని చెల్లెలైన శూర్పణఖ రాముణ్ణి కామించి వచ్చింది.

అప్పుడు లక్ష్మణుడు దాని ముక్కు కోశాడు. అది విని దండెత్తివచ్చి ఖరదూషణాదులను పద్నాలుగు వేలమందిని రాముడు తన భాణాగ్నితో భస్మం చేశాడు. సీత చక్కదనాన్ని విని మన్మథ పరవశుడైన రావణుడు పంపగా బంగారులేడిగా కపటవేషాన్ని ధరించి వచ్చిన నీచుడైన మారీచుణ్ణి రాముడు వచించాడు. ఆ సమయంలో రావణుడు సీతను అపహరించుకొని పోయాడు.

ఉత్పలమాల:

ఆ యసురేశ్వరుండు వడి సంబరవీధి నిలాతనూజ న

న్యాయము సేసి నిష్కరుణుడై కొనిపోవగ నడ్డమైన ఘో

రాయతహేతి ద్రుంచె నసహాయత రామునరే ద్రకార్యద

త్తాయువు బక్షవేగపరివేగపరిహాసితవాయువు న జ్జటాయువున్.

  • ఆ విధంగా రావణుడు అన్యాయంగా, ఏ మాత్రం దయలేకుండా ఆకాశమార్గంలో సీతాదేవిని గొనిపోయేటప్పుడు రామకార్యంకోసం ప్రసాదింపబడ్డ ఆయుర్థాయంకలవాడు, వాయువేగాన్ని మించిన వేగం కలవాడు ఐన జటాయువు అడ్డుపడ్డాడు.

అప్పుడు రావణుడు నిస్సహాయుడైన జటాయువును కంఠోంమైన ఆయుధంతో ఖండించాడు.

వచనము:

పిమ్మట ఆ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి సీతను వెదుకుతూ వచ్చి తన కార్యానికై ప్రాణాలను కోల్పోయిన జటాయువుకు పరలోకక్రియలు చేసి ఋశ్యముకానికి వెళ్ళాడు.

కందము:

నిగ్రహము నీకు వల దిక

నగ్రజు వాలిన్ వథింతు నని నియమముతో

నగ్రేసరుగా నేలెను

సుగ్రీవున్ చరణఘాతచూర్ణగ్రావున్.

  • ఇత నీకి నిర్బంధం అక్కరలేదు. మీ అన్న వాలిని వధిస్తాను అని అభయమిచ్చి పాదాలరాపిడిచేతనే బండలను పొడిచేసే సుగ్రీవుణ్ణి ఆత్మీయులలో అగ్రేసరుణ్ణిగా చేసుకొన్నాడు శ్రీ రాముడు.

వచనము:

లీలన్ రామవిభుండొక

కోలం గూలంగ నేసె గురు నయశాలిన్

శీలిన్ సేవిత శూలిన్

మాలిన్ వాలిన్ దశాస్యమానోన్మాలిన్

  • శ్రీ రాముడు ఒకే బాణంతో గొప్పనీతిశాలీ, ఈశ్వరుణ్ణి సేవించే వాడూ, రావణుని గర్వాన్ని హరించిన వాడూ ఐన వాలిని కూల్చివేశాడు.

కందము:

ఇలమీద సీత వెదకగ

నలఘుడు రాఘవుడు పనిచె హనుమంతు సతి

చ్ఛలవంతున్ మతిమంతున్,

బలవంతున్ శౌర్యవంతు బ్రాబవవమ్తున్.

  • గొప్పవాడైన రాముడు సీతను వెదకడానికి మహామహిమాన్వితుడూ, బుద్ధిమంతుడూ, బలవంతుడూ, శౌర్యవంతుడూ, సుగుణవంతుడూ ఐన హనుమంతుణ్ణి నియోగించాడు.

కందము:

అలవాటు కలిమి మారుతి

లలితామిత లాఘవమున లంఘించెను శై

వలినీగణసంబంధిన్

జలపూరిత ధరణి గగన సంధిన్ గంధిన్

  • ఆ హనుమంతుడు నదులకు బంధువూ, భూమికి ఆకాశానికీ గల వ్యవధానాన్ని నీటితో నింపినదీ ఐన సముద్రాన్ని అలవాటు మేఋఅకు అత్యంతలాఘవంతో దాటాడు.