భాగవతం - పన్నెండవ స్కంధము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాగవతం
స్కంధములు
ప్రధమ స్కంధము
ద్వితీయ స్కంధము
తృతీయ స్కంధము
చతుర్ధ స్కంధము
పంచమ స్కంధము
షష్టమ స్కంధము
సప్తమ స్కంధము
అష్టమ స్కంధము
నవమ స్కంధము
దశమ స్కంధము
ఏకాదశ స్కంధము
ద్వాదశ స్కంధము
**********************
కృష్ణుడు
దశావతారములు
హిందూధర్మశాస్త్రాలు
రామాయణం
మహాభారతం
పురాణాలు
వేదవ్యాసుడు
ఆంధ్ర మహాభాగవతము
బమ్మెర పోతన

ద్వాదశ స్కంధము చివరి స్కంధము, కాని ఇక్కడ మంచి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

శుకయోగి పరిక్షిత్తునకు భావికాలగతులను చెప్పుట, యుగధర్మ ప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము, పరిక్షిత్తు మృతిచెందుట, జనమేజయుడు సర్ప యాగము చేయుట, వేద వ్యాసుడు పురాణములు, వేదములు ప్రచారము చేయుట, మార్కండేయోపఖ్యానము, చైత్రాది మాసంబుల సంచెరించెడు ద్వాదశాదిత్యుల క్రమంము తెలుపుటతో భాగవతము ముగుస్తుంది.

బృహద్రధుడు అనే రాజుకు పురంజయుడు పుడతాడు. అతనికి శునకుడనే అమాత్యుడుంటారు. అతడు పురంజయుని సంహరించి తానే గద్దెనెక్కి రాజ్యం పరిపాలిస్తుంటాడు. అతనికి కొంతకాలానికి ఒక కొడుకు పుడతాడు. వాడికి ప్రద్యోతుడని పేరు పెట్టి రాజ్యం కట్టబెడతాడు.

ప్రద్యోతునికి విశాఖరూపుడు, అతనికి నందివర్దనుడు పుడతాడు. ఈ రాజు లైదుగురు నూటముప్పైయ్యెనిమిది సంవత్సరాలు భూమిని పరిపాలించి వృద్ది చెందుతారు. ఆ తరువాత శిశునాగుడు అనే రాజు జన్మిస్తాడు. అతనికి కాకవర్ణుడు కొడుకవుతాడు. ఆ కాకవర్ణుని కొడుకు క్షేమవర్ణుడు.

క్షేమవర్ణ మహారాజుకు క్షేత్రఙ్నుడు పుత్రుడు. అతనికి విధిసారుడు, అతనికి అజాతశత్రువు, అతనికి దర్బకుడు, అతనికి అజయుడు, అతనికి నందివర్దనుడు, అతనికి మహానంది ఉదయిస్తారు. శిశునాగులు అన్న పేరుతో ప్రసిద్దులయిన యీ పదిమంది మహారాజులు కలికాలంలో మూడు వందల అరవైయేళ్ళు అవిచ్ఛిన్నంగా అవనీ పాలన చేస్తారు.

ఆ పిమ్మట మహానందికి శూద్రవనిత కడుపున మహాపద్ముడు పుడతాడు. అతడు మహాబలవంతు డవుతాడు. అయినప్పటికీ, అతనితో క్షత్రియ వంశం అంతరించిపోతుంది. ఆ సమయంలో రాజులు శూద్రప్రాయులైపోతారు;ధర్మహీనులైపోతారు. మహాపద్మునికి సుమాల్యుడు మొదలైన తనయులు ఎనమండుగురు కలుగుతారు. వంద సంవత్సరాల పాటు వారి పరిపలన సాగుతుంది. ఆ పిమ్మట కార్ముకుడు మొదలయిన రాజులు తొమ్మండుగురు పుడతారు. వారికి నవనందు లని వ్యవహారము. ఆ నవనందులకు ఒక అవనీసుర శ్రేష్టుడు అంతరింపజేస్తాడు. నందులు లేకపోవడంచేత కొంతకాలంపాటు మౌర్యులు పరిపాలన చేస్తారు.

ముందు చెప్పిన అవనీసురశ్రేష్టుడు చంద్రగుప్తునికి అభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునికి వారిసారుడు ఆవిర్బవిస్తాడు. క్రమంగా వారిసారుని కొడుకు అశోకవర్దనుడు, అతని తనయుడు సుయశస్సు, వాని సుతుడు సంయుతుడు, అతని నందనుడు శాలిశూకుడు, వాని పుత్రుడు సోమశర్ముడు, వాని తనూభవుడు శతధన్వుడు, వాని కొమరుడు బృహద్రథుడు వరుసగా రాజు లవుతారు.

మౌర్యునితో కలసి ఆ పదిమంది రాజులు మొత్తం మేద నూటముప్పయ్యేడు సంవత్సరాలు నిరాఘాటంగా రాజ్యపాలన చేస్తారు.

ఆ సమయములో బృహద్రథుని సైన్యాధినేత శుంగవంశజుడయిన పుష్యమిత్రుడు అతనిని చంపి రాజ్యాన్ని అపహరిస్తాడు. అతనికి అగ్నిమిత్రుడు పుట్టి రాజవుతాడు, అతని తరువాత సుజ్యేష్టుడు, వసుమిత్రుడు, భద్రకుడు, పుళిందుడు, ఘోషుడు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి వరసగా తమ తండ్రినుంచి సంక్రమించిన రాజ్యాన్ని తాము గ్రహించి పరిపాలిస్తారు. పైని చెప్పిన పదిమంది శుంగులు నూటపన్నెండు సంవత్సరాలు రాచరికం నిలుపుకుంటారు. శుంగవంశజులలో చివరివా డయిన దేవభూతిని కణ్వమంత్రి అయిన వసుదేవుడు వధించి తానే రాజ్యాధిపతి అవుతాడు. అతనికి భూమిత్రుడనే పుత్రుడు కలుగుతాడు. ఆ మహానుభావునికి నారాయణుడనే కొడుకుపుడతాడు. కణ్వ వంశస్థులు మొత్తంమీద మూడువందల నలభైఅయిదు సంవత్సరాలు ప్రభువులై పరిపాలన చేస్తారు.

అటుపిమ్మటి విషయం విను. కణ్వ వంశంలో సుశర్ముడనే రాజు పుడతాడు. కాని, అతనికి బృత్యుడయిన ఆంధ్రజాతీయుడు వృషలుడనేవాడు అతనిని వధిస్తాడు. అధర్మ మార్గంలో సంచరిస్తూ ఆ రాజ్యాన్ని అవక్రవిక్రమంతో పరిపాలిస్తాడు. అతని తరువాత అతని తమ్ముడు కృష్ణుడు రాజవుతాడు. ఆ తరువాత శామ్తకర్ణుడు, పౌర్ణమానుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, హాలేయుడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీష సేతుడు, సునందనుడు, వృకుడు, జటావుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కందుడు, యఙ్నశీలుడు, శ్రుతస్కందుడు, యఙ్నశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అనే రాజులు పైతృకంగా వచ్చిన రాజ్యసంపదను క్రమంగా అనుభవిస్తారు. వారందరూ పరిపాలించిన కాలం నాలుగు వందలయేభై ఆరు సంవత్సరాలు.

ఆ తరువాత నాభీరవంశంజులేడుగురు, గర్దభవంశజులు పదిమంది, కంకవంశజులు పదహారుగురు భూభారాన్ని ధరించి పరిపాలిస్తారు.

ఆ తరువాత ఎనిమిది మంది యవనులు, పదునలుగురు బర్బరులు ప్రభువులవుతారు.

ఆ పిమ్మట గురుండులు పదముగ్గురు, మౌనులు పదకొండుమంది గర్వంతో కన్నూ మిన్నూ కానకుండా పందొమ్మిదివందల తొమ్మిది సంవత్సరాలు పరిపాలన సాగిస్తారు. ఆ పిమ్మట మౌనవంశంలో పుట్టిన పదకొండుమంది మూడు వందల సంవత్సరాల పాటు మత్సరగ్రస్తులై పరిపాలన సాగిస్తారు. అదే సమయంలో కైలికిలులు అనే యవనులు అవనీపాలకులవుతారు. ఆ తరువాత భూతనందుడు, నవభంగిరుడు, శిశునందుడు, అతని తమ్ముడయిన యశోనందుడు, ప్రవీరకుడు అనేవారు వీరులై నూటారు సంవత్సరాలు పాలకు లవుతారు. ఆ రాజులకు పదముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఆరుగురు బాహ్లికదేశానికి అధిపతులవుతారు. మిగిలిన యేడుగురు కోసలదేశానికి అధిపతులవుతారు.

అప్పుడు వైడూర్యపతులు నిషధదేశానికి అదీశ్వరు లవుతారు. పురంజయుడు మగధదేశప్రభువుగా ప్రభవిస్తాఉ. పుళిందులూ, యుదువంశస్థులూ, మద్రదేశీయులూ అయిన హీనజాతి జనులు బ్రహ్మ ఙ్నానహీనులూ, హరిభక్తివిహీనులూ కాగా వారికి ధర్మాన్ని ఉపదేశించి నారాయణుని పట్ల భక్తి తాత్పర్యం కలుగజేస్తాడు. శక్తి శౌర్యసమన్వితు లయిన క్షత్రియుల నుంచి ప్రయోగ వరకు గల భూమిని పరిపాలిస్తాడు.

శూద్ర ప్రాయులైన రాజులు, వ్రాత్యులునాస్తికులు అయిన బ్రాహ్మణులు సౌరాష్ట్రమూ, అవంతీ, అభీరమూ, అర్బుదమూ, మాళవమూ అనే దేశాలకు అధిపతు లవుతారు. సింధుతీరంలోనూ, చంద్రభగ పరిసరాలలోనూ, కాశ్మీరదేశంలోనూ మ్లేచ్చాకారు లయిన రాజులు పరిపాలన చేస్తారు. వారికి తెలివితేటలుండవు; ధర్మమూ, సత్యమూ, దయాఉండవు. క్రోధమాత్సర్యాలతో పెచ్చరిల్లి స్త్రీలనూ, బాలకులనూ, గోవులనూ, బ్రాహ్మణులనూ వధించడానికి వెనుదీయరు. పరధనాసక్తి అల్పాయువులూ, అల్పబలులూ అవుతారు. శ్రీ విష్ణు పాదపద్మమకరందంలోని రుచి వారికి తెలియదు. ఒకరి పట్ల ఒకరు వైరం పెంచుకొని యుద్ధాలకు సిద్దపడి ప్రాణాలు కోల్పోతారు. ఆ సమయంలో ప్రజలు కూడా వారి వేషభాషలనూ, శీలవృత్తులనూ అనుసరిస్తారు.