తేటగీతి
స్వరూపం
| పద్య విశేషాలు |
|---|
| వృత్తాలు |
| ఉత్పలమాల, చంపకమాల |
| మత్తేభం, శార్దూలం |
| తరళం, తరలము |
| తరలి, మాలిని |
| మత్తకోకిల |
| స్రగ్ధర, మహాస్రగ్ధర |
| ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
| లయగ్రాహి, లయవిభాతి |
| జాతులు |
| కందం, ద్విపద |
| తరువోజ |
| అక్కరలు |
| ఉప జాతులు |
| తేటగీతి |
| ఆటవెలది |
| సీసము |
తేటగీతి
[మార్చు]ఉదాహరణ 1:
[మార్చు]విని దశగ్రీవు డంగజ వివశు డగుచు
నర్థి బంచిన బసిడిఱ్రి యై నటించు
నీచు మారీచు రాముడు నెఱి వధించె
నంతలో సీత గొనిపోయె నసురవిభుడు
లక్షణాలు
[మార్చు]ఆ.
"సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకరద్వయంబు తేటగీతి"
- అప్పకవీయము
- పాదాలు: 4
- ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం + రెండు ఇంద్ర గణాలు + రెండు సూర్యగణాలు ఉంటాయి
యతి
[మార్చు]- ఒకటోవ గణం మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరం యతి
- ప్రాసయతి చెల్లును
- ప్రాసయతి చెల్లించిన పద్యాన్ని అంతరాక్కరగా పిలుస్తారు. అయితే అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.
ప్రాస
[మార్చు]- ప్రాస నియమం లేదు
ఉదాహరణ 2:
[మార్చు]అఖిలరూపముల్ దనరూపమైన వాడు
నాదిమధ్యాంతములు లేక యడరువాడు
భక్తజనముల దీనుల పాలివాడు
వినడె చూడడె తలపడె వేగ రాడె;
మూలాలు
[మార్చు]ఇది మహా పండితులు రచించినది