స్రగ్ధర
Jump to navigation
Jump to search
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
స్రగ్ధర
[మార్చు]కూలున్ గుఱ్ఱంబులేనుంగులు ధరఁ గెడయుం గుప్పలై; నుగ్గునూచై
వ్రాలున్దేరుల్ హతంబై వడిఁబడు సుభటవ్రాతముల్; శోణితంబుల్
గ్రోలున్, మాంసంబు నంజుంగొఱకు, నెముకలన్గుంపులై సోలుచున్ భే
తాలక్రవ్యాదభూతోత్కరములు; జతలై తాళముల్ దట్టి యాడున్.
గణ విభజన
[మార్చు]UUU | UIU | UII | III | IUU | IUU | IUU |
మ | ర | భ | న | య | య | య |
తెల్లంబై | శైలవి | శ్రాంతిని | మునియ | తినిందే | జరిల్లు | న్ధృఢంబై |
లక్షణములు
[మార్చు]• | పాదాలు: | నాలుగు |
• | 21 | |
• | ప్రతిపాదంలోని గణాలు: | మ, ర, భ, న ,య, య, య |
• | యతి : | ప్రతిపాదంలోనూ 8వ, 15వ అక్షరములు |
• | ప్రాస: | పాటించవలెను |
• | ప్రాస: యతి | ప్రాస యతి చెల్లదు |
ఉదాహరణ 1:
[మార్చు]పోతన తెలుగు భాగవతంలో వాడిన స్రగ్ధర వృత్త పద్యాల సంఖ్య: 3
పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయ)/ప్రద్యుమ్న వివాహంబు|(భా-10.2-883-స్రగ్ద.)
కూలున్ గుఱ్ఱంబు లేనుంగులు ధరఁ గెడయుం గుప్పలై; నుగ్గునూచై
వ్రాలు న్దేరుల్ హతంబై వడిఁబడు సుభటవ్రాతముల్; శోణితంబుల్
గ్రోలున్, మాంసంబు నంజుం గొఱకు, నెముకల న్గుంపులై సోలుచు న్బే
తాల క్రవ్యాద భూతోత్కరములు; జతలై తాళముల్ దట్టియాడున్.