ఇంద్రవజ్రము
Jump to navigation
Jump to search
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
ఇంద్రవజ్రము
[మార్చు]పదునొకండవ త్రిష్టుస్ఛంధంబునందుఇంద్రవజ్రయను వృత్తము
సామర్థలీలన్ తతజ ద్విగంబుల్
భూమింధ్ర విశ్రాంతుల బొంది యొప్పున్
ప్రేమంబుతో నైందవ బింబ వక్తృన్
హేమాంబురుం బాడుదు రింద్రవజ్రన్.
గణ విభజన
[మార్చు]UUI | UUI | IUI | UU |
త | త | జ | గా |
సామర్థ | లీలన్ త | తజద్వి | గంబుల్ |
లక్షణములు
[మార్చు]• | పాదాలు: | నాలుగు |
• | 11 | |
• | ప్రతిపాదంలోని గణాలు: | త, త, జ, గా |
• | యతి : | ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము |
• | ప్రాస: | పాటించవలెను |
• | ప్రాస: యతి | చెల్లదు |
ఉదాహరణ 1:
[మార్చు]పోతన తెలుగు భాగవతంలో వాడిన ఇంద్రవజ్రము వృత్త పద్యాల సంఖ్య: 4
(భా-10.1-690-ఇ.)
నీయాన; యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నంద డింకన్;
నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁగోలెన్
మా యీశు ప్రాణంబులు మాకు నీవే.”