లయగ్రాహి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

లయగ్రాహి ఛందస్సులో వృత్తం రకానికి చెందిన పద్యం. [1][2]

ఉదాహరణ పద్యాలు

[మార్చు]

ఉదాహరణ 1

[మార్చు]

ఎందు నిల నేజనులకుం దలఁపరాని తప మంది కొని చేసిరొకొ నందుఁడు యశోదా
సుందరియుఁ బూర్ణనిధిఁ బొందిరి కడు న్దొరసి పొందగును ముప్పు తఱి నందనునిగా శ్రీ
మందిరుని నంచు నిటు లందముగఁ బ్రాసములు గ్రందుకొని చెప్పు మునిబృందము లయగ్రా
హిం దనర సబ్భజసలుందగ నకారమును బొంద నిరుచోట్లను బిఱుం దభయ లొందన్.

ఉదాహరణ 2

[మార్చు]

పోతన తెలుగు భాగవతంలో వాడిన లయగ్రాహి వృత్త పద్యాల సంఖ్య:4

పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము/వృత్రాసుర వృత్తాంతము|(భా-6-385-లగ్రా.)

కూలిరి వియచ్చరలు; సోలిరి దిశాధిపులు; వ్రాలి రమరవ్రజము; దూలి రురగేంద్రుల్;
ప్రేలిరి మరుత్తు; లెదజాలిగొని రాశ్వినులు; కాలుడిగి రుద్రు లవలీలబడి రార్తిన్;
వ్రేలిరి దినేశ్వరులు; కీలెడలినట్లు సురజాలములు పెన్నిదుర పాలగుచు ధారా
భీల గతితోడఁ దమ కేలి ధనువు ల్విడిచి నేలఁబడి మూర్ఛలను దేలిరి మహాత్మా!

కొప్పరపు కవులు చెప్పిన "నల్లి" పై పద్యం

[మార్చు]

మల్లెలును మొల్లలును జల్లినను శయ్యపయి నల్లియొకఁడుండ సుఖమెల్లయును బాడం
చెల్లరు వచింతు రటు లెల్లిదము సేయఁదగ    దల్ల కుసుమాంబకుని భల్ల మదియందున్
వల్లభుఁడు కాంత ముదమల్లుకొన సెజ్జఁగనఁ  బెల్లెగసి నిద్ర తనువెల్ల మఱపింపన్
ఝల్లుమనఁగుట్టి రతి నుల్లములు దన్పి భళి  వల్లెయని వారి నుతులల్లపుడే గంటన్

గణ విభజన

[మార్చు]

ఏకోనచచ్వారింశన్మాత్రా గర్భితంబుఁ ద్రింశదక్షరంబు నైన లయగ్రాహి

లయగ్రాహి వృత్త పాదము నందు గణవిభజన
UII IUI IIU III UII IUI IIU III UII IUU
ఎందుని లనేజ నులకుం దలఁప రానిత పమంది కొనిచే సిరొకొ నందుఁడు యశోదా

లక్షణములు

[మార్చు]
లయగ్రాహి వృత్త పద్యాల లక్షణములు
పాదాలు: నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు.
30
ప్రతిపాదంలోని గణాలు: భ, జ, స, న, భ , జ, స, న, భ, య
యతి :
ప్రాస నియమం: పాటించవలెను
యతి మైత్రి: యతి స్థానములు – 2వ, 10వ, 18వ, 26వ అక్షరములు.

మూలాలు

[మార్చు]
  1. మిరియాల), Dileep Miriyala(దిలీపు. "లయగ్రాహి — తెలుగు ఛందస్సులు". chandam.apphb.com. Archived from the original on 2021-04-16. Retrieved 2021-04-16.
  2. సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "లయగ్రాహి : ఛందోపరిచయము : వ్యాకరణము : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Archived from the original on 2021-04-16. Retrieved 2021-04-16.
"https://te.wikipedia.org/w/index.php?title=లయగ్రాహి&oldid=3782988" నుండి వెలికితీశారు