Jump to content

మత్తకోకిల

వికీపీడియా నుండి
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

మత్తకోకిల

[మార్చు]
సత్తయౌ రసజాభరల్ భవసంఖ్య విశ్రమ మొప్పినన్
మత్తకోకిల వృత్తమౌన సమానరంగనృపాలకా.

ఉదాహరణ 1

[మార్చు]

రాజభూషణ నిత్యసత్య సరస్వతీవిలసన్ముఖాం

భోజ రాజమనోజ భూజనపూజ్యమాన మహాయశో

రాజహంస పయోజినీవనరమ్య దిఙ్ముఖ విక్రమో

ద్వేజితాహిత విష్ణుసన్నిభ విష్ణువర్ధనభూపతీ

లక్షణములు

[మార్చు]
  • పాదాలు : నాలుగు
  • ప్రతి పాదంలోని గణాలు : ర స జ జ భ ర
  • యతి : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
  • ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు
  • మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
  • తాన తానన తాన తానన తాన తానన తాన తా

ఉదాహరణ 2

[మార్చు]

అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్‌

ధన్యులై వినఁ బాంచజన్యము దారితాఖిల జంతు చై

తన్యము¦ భువనైకమాన్యము దారుణస్వన భీత రా

జన్యమున్‌ బరిమూర్ఛితాఖిలశత్రు దానవసైన్యమున్

గ్రహించగలరు

[మార్చు]

మత్త కోకిల గణాలు రాసి చూస్తే అది యెంత "symmetric"గా ఉందో అర్థమవుతుంది. కొంచెం నేర్పుగా రాస్తే ఈ వృత్తంలో "palindromes" రాయ వచ్చు!

మూస:వృత్తములు

మూలాలు

[మార్చు]