తరువోజ
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
తరువోజ తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
చరిత్ర
[మార్చు]తరువోజ ఛందోరీతి అత్యంత ప్రాచీనమైన తెలుగు పద్య ఛందోరీతుల్లో ఒకటి. ప్రాఙ్నన్నయ యుగముగా పేర్కొనే 9వ శతాబ్ది నాటి పండరంగని నెల్లూరి శాసనంలోని పద్యం తరువోజ ఛందస్సులో ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు.[1]
లక్షణములు
[మార్చు]- పద్యమునకు నాలుగు పాదములుండును.
- పాదమునకు మూడు ఇంద్ర గణములు, ఆ పైన ఒక సూర్య గణము, మళ్ళీ మూడు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము ఉండవలెను.
యతి
[మార్చు]పాదములోని మొదటి అక్షరమునకు మూడు చోట్ల యతి ఉండవలెను.
పాదాది అక్షరమునకు పాదంలోని మూడవ, ఐదవ, ఏడవ గణముల మొదటి అక్షరముతో యతి నియమమున్నది.
ప్రాస
[మార్చు]రెండవ అక్షరమున ప్రాస నుంచవలెను.
గమనిక
[మార్చు]ఒక్కొక్క తరువోజ పాదము రెండు ద్విపద పద్యపాదములు కలసిన రీతిలో (అనగా ఒక ద్విపద పద్యము వలె) ఉంటుంది. ఒకే ఒక భేదమేమిటంటే ప్రతి పాదంలో మూడు చోట్ల యతి కలుస్తుంది - అంటే ద్విపద పద్యములోని రెండు పాదములకూ సాధారణంగా ఉండే యతి కాక పాదాల మొదటి అక్షరములకు కూడా యతి నుంచవలెను. అప్పుడు మొదటి అక్షరముతోనే రెండు పాదములకు మొత్తమూ యతి చెల్లించినట్టు అవుతుంది.
ఉదాహరణ
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ప్రభాకరశాస్త్రి, వేటూరి (2009). సింహావలోకనము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం.