మహాస్రగ్ధర
స్వరూపం
| పద్య విశేషాలు |
|---|
| వృత్తాలు |
| ఉత్పలమాల, చంపకమాల |
| మత్తేభం, శార్దూలం |
| తరళం, తరలము |
| తరలి, మాలిని |
| మత్తకోకిల |
| స్రగ్ధర, మహాస్రగ్ధర |
| ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
| లయగ్రాహి, లయవిభాతి |
| జాతులు |
| కందం, ద్విపద |
| తరువోజ |
| అక్కరలు |
| ఉప జాతులు |
| తేటగీతి |
| ఆటవెలది |
| సీసము |
మహాస్రగ్ధర
[మార్చు]
కొలిచెం బ్రోత్సాహ వృత్తిం గుతల గగనముల్గూడ రెం డంఘ్రులం దా
బలిఁ బాతాళంబు చేరం బనిచె గడమకై బాపురే వామనుం డ
స్ఖలితాటో పాఢ్యుఁ డంచుం గరిగిరివిరమాకారిమారన్సతానో
జ్జ్వ లసోద్యద్రేఫయుగ్మాశ్రయ గురుల మహాస్రగ్ధరం జెప్ప నొప్పున్.
గణ విభజన
[మార్చు]| IIU | UUI | UUI | III | IIU | UIU | UIU | U |
| స | త | త | న | స | ర | ర | గ |
| కొలిచెం | బ్రోత్సాహ | వృత్తింగు | తలగ | గనము | ల్గూడరెం | డంఘ్రులం | దా |
లక్షణములు
[మార్చు]| • | పాదాలు: | నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు. |
| • | 22 | |
| • | ప్రతిపాదంలోని గణాలు: | స త త న స ర ర గ |
| • | యతి : | ప్రతిపాదంలోనూ 9వ, 16వ వ అక్షరములు |
| • | ప్రాస: | పాటించవలెను |
| • | ప్రాస: యతి | చెల్లదు |
ఉదాహరణ 1
[మార్చు]పోతన తెలుగు భాగవతంలో వాడిన మహాస్రగ్ధర వృత్త పద్యాల సంఖ్య: 2
పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయ)/బలరాముని తీర్థయాత్ర|భా 10.2-940-మస్ర.)
కనియెం దాలాంకుఁ డుద్యత్కట చటుల నటత్కాల దండాభ శూలున్
జన రక్తాసిక్త తాలున్సమధిక సమరోత్సాహ లోలుం గఠోరా
శని తుల్యోదగ్ర దంష్ట్రా జనిత శిఖక ణాచ్ఛాది తాశాంతరాళున్
హననవ్యాపార శీలున్నతి దృఢ ఘన మస్తాస్థి మాలుం గరాళున్.