నవరస తరంగిణి
నవరస తరంగిణి ఒక విశిష్టమైన తెలుగు గ్రంథం. దీనిని విజయనగర వాస్తవ్యులగు ఆదిభట్ల నారాయణదాసు గారు సంస్కృత మహాకవి, నాటక కర్త కాళిదాసు రచనలనుండి, ఆంగ్లభాషలో ప్రసిద్ధ నాటక రచయిత షేక్స్‌పియర్ రచనలనుండి నవరసాలను వర్ణించే ఖండికలను తెలుగులోకి అనువదించారు.
ముద్రణలు
[మార్చు]ఇది 1922 సంవత్సరంలో తొలిసారిగా దాసభారతి వారిచే ముద్రించబడింది. ఇది మరళ 1979లో రెండవసారి శ్రీమతి కఱ్ఱా శ్యామలాదేవి ముద్రించారు. ద్వితీయ ముద్రణకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, నారాయణదాసు శతజయంతి కమిటీ, రోటరీ క్లబ్ వార్లు ఆర్థిక సహాయం చేశారు.
అంకితం
[మార్చు]ఈ గ్రంథాన్ని విజయనగరాన్ని పరిపాలించిన పూసపాటి అలక నారాయణ గజపతి రాజు గారికి అంకితమిచ్చారు. మహారాజుగారికి కాళిదాసు, షేక్స్పియర్ కవుల పద్యాలంటే ప్రేమ కాబట్టి తానీ బృహత్కార్యాన్ని చేపట్టినట్లు తెలియజేశారు. ఆ సందర్భంలో చెప్పిన పద్యాలు :
గీ|| శ్రీ విజయరామగజపతి జ్యేష్ఠపుత్ర |
వీరలలితా కుమారీ కుమారశూర |
ధీరసుకుమార విద్యావతీ కళత్ర |
రాజకులముఖ్య యలక నారాయణాఖ్య ||
గీ|| కాళిదాస షేక్స్పియరుల కవిలపయి |
బ్రేమపడెదవుగాన నర్పించినాడ |
ఈకృతిన్ద్యతోడ నంగీకరించు |
మలక నారాయణగజేంద్ర యదిపచంద్ర ||
విషయసూచిక
[మార్చు]- వీరరసము ... 3-60
- శాంతరసము ... 61-126
- కరుణరసము ... 127-220
- శృంగారరసము ... 221-266
- హాస్యరసము ... 267-304
- అద్భుతరసము ... 305-464
- రౌద్రరసము ... 465-492
- బీభత్సరసము ... 493-504
- భయానకరసము ... 505-560
- షేక్స్పియరుని నాటకముల సంగ్రహము ... 561-688
అనువదించిన నాటకాలు
[మార్చు]ఈ గ్రంథంలో విలియం షేక్‌స్పియర్ రచించిన కొన్ని గ్రంథాలలోని పద్యాలను కవి అచ్చతెలుగులోకి అనువదించారు: