నవీన్-ఉల్-హక్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | నవీన్-ఉల్-హక్ మురీద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ | 1999 సెప్టెంబరు 23|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.86 మీ. (6 అ. 1 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 39) | 2016 సెప్టెంబరు 25 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2021 జనవరి 26 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 40) | 2019 సెప్టెంబరు 21 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 మార్చి 26 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 11 March 2023 |
నవీన్-ఉల్-హక్ మురీద్ (జననం 1999 సెప్టెంబరు 23) ఒక ఆఫ్ఘన్ క్రికెట్ ఆటగాడు. అతను 2016 సెప్టెంబరులో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు.[1]
దేశీయ, T20 ఫ్రాంచైజీ కెరీర్
[మార్చు]2018 మార్చి 7 న నవీన్ , 2018 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో కాబూల్ రీజియన్ తరపున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు.[2]
2018 సెప్టెంబరులో, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో నవీన్ నంగర్హర్ జట్టులో ఎంపికయ్యాడు.[3] 2019 నవంబరులో, అతను 2019–20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సిల్హెట్ థండర్ కోసం ఆడేందుకు ఎంపికయ్యాడు. [4] 2020 జూలైలో, అతను 2020 కరీబియన్ ప్రీమియర్ లీగ్ కోసం గయానా అమెజాన్ వారియర్స్ జట్టులో ఎంపికయ్యాడు. [5] [6] 2020 అక్టోబరులో, లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం క్యాండీ టస్కర్స్ అతన్ని తీసుకుంది[7]
2021 ఫిబ్రవరిలో, ఇంగ్లండ్‌లో 2021 T20 బ్లాస్టు టోర్నమెంట్‌కు ముందు నవీన్ లీసెస్టర్‌షైర్ ఫాక్స్‌కు సంతకం చేసాడు. [8] 2021 అక్టోబరులో, ఇంగ్లాండ్‌లో 2022 వేసవికి లీసెస్టర్‌షైర్, అతని చేత రాజీనామా చేయించింది. [9] 2022 జూన్లో, వోర్సెస్టర్‌షైర్ ర్యాపిడ్స్‌తో జరిగిన T20 బ్లాస్టు మ్యాచ్‌లో, అతను తన నాలుగు ఓవర్లలో 5/11తో ట్వంటీ 20 క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్ల పంటను సాధించాడు. [10] ఆ తర్వాతి నెలలో, అతను లంక ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ కోసం కొలంబో స్టార్స్‌కు సంతకం చేశాడు. [11] 2022 డిసెంబరులో, 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతనిని కొనుగోలు చేసింది.
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2019 ఆగస్టులో, 2019–20 బంగ్లాదేశ్ ముక్కోణపు సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టుకు నవీన్ ఎంపికయ్యాడు. [12] [13] అతను 2019 సెప్టెంబరు 21న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి T20I ఆడాడు. [14] 2021 సెప్టెంబరులో, అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. [15]
నవీన్ 2017 డిజర్ట్ T20 ఛాలెంజ్‌లో 2017 జనవరి 19న నమీబియాపై ఆఫ్ఘనిస్తాన్ తరపున ట్వంటీ20 (T20) రంగప్రవేశం చేశాడు. [16]
2017 డిసెంబరులో నవీన్, 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [17]
2016 సెప్టెంబరు 25న బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ తరపున నవీన్ తన వన్డే ఇంటర్నేషనల్ రంగప్రవేశం చేశాడు [18] దానికి ముందు అతను, 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో భాగంగా ఉన్నాడు. [19] 2016 డిసెంబరులో, అతను 2016 అండర్-19 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు కెప్టెన్‌గా చేసాడు. [20]
మూలాలు
[మార్చు]- ↑ "Naveen-ul-Haq". ESPN Cricinfo. Retrieved 25 September 2016.
- ↑ "5th Match, Alokozay Ahmad Shah Abdali 4-day Tournament at Kunar, Mar 7-10 2018". ESPN Cricinfo. Retrieved 10 March 2018.
- ↑ "Afghanistan Premier League 2018 – All you need to know from the player draft". CricTracker. 10 September 2018. Retrieved 10 September 2018.
- ↑ "BPL draft: Tamim Iqbal to team up with coach Mohammad Salahuddin for Dhaka". ESPN Cricinfo. Retrieved 18 November 2019.
- ↑ "Nabi, Lamichhane, Dunk earn big in CPL 2020 draft". ESPN Cricinfo. Retrieved 6 July 2020.
- ↑ "Teams Selected for Hero CPL 2020". Cricket West Indies. Retrieved 6 July 2020.
- ↑ "Chris Gayle, Andre Russell and Shahid Afridi among big names taken at LPL draft". ESPN Cricinfo. Retrieved 22 October 2020.
- ↑ "Naveen-ul-Haq: Leicestershire Foxes sign Afghanistan paceman". BBC Sport. Retrieved 12 February 2021.
- ↑ "Naveen-ul-Haq returns to Leicestershire for 2022 season". ESPN Cricinfo. Retrieved 26 October 2021.
- ↑ "Five-star Naveen-ul-Haq keeps Foxes in the hunt". ESPN Cricinfo. Retrieved 5 June 2022.
- ↑ "LPL 2022 draft: Kandy Falcons sign Hasaranga; Rajapaksa to turn out for Dambulla Giants". ESPN Cricinfo. Retrieved 6 July 2022.
- ↑ "Afghanistan squads announced for Bangladesh Test and Triangular Series in September". Afghan Cricket Board. Archived from the original on 20 ఆగస్టు 2019. Retrieved 20 August 2019.
- ↑ "Rashid Khan to lead new-look Afghanistan in Bangladesh Test". ESPN Cricinfo. Retrieved 20 August 2019.
- ↑ "6th Match (N), Bangladesh Twenty20 Tri-Series at Chattogram, Sep 21 2019". ESPN Cricinfo. Retrieved 21 September 2019.
- ↑ "Rashid Khan steps down as Afghanistan captain over team selection". Cricbuzz. Retrieved 9 September 2021.
- ↑ "Desert T20 Challenge, 11th Match, Group A: Afghanistan v Namibia at Dubai (DSC), Jan 19, 2017". ESPN Cricinfo. Retrieved 19 January 2017.
- ↑ "Mujeeb Zadran in Afghanistan squad for Under-19 World Cup". ESPN Cricinfo. Retrieved 7 December 2017.
- ↑ "Afghanistan tour of Bangladesh, 1st ODI: Bangladesh v Afghanistan at Dhaka, Sep 25, 2016". ESPN Cricinfo. Retrieved 25 September 2016.
- ↑ "All 16 squads confirmed for ICC U19 Cricket World Cup 2016". International Cricket Council. Archived from the original on 28 January 2016. Retrieved 9 January 2016.
- ↑ "Afghanistan Under-19s Squad". ESPN Cricinfo. Retrieved 18 December 2016.