నసుమ్ అహ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నసుమ్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1994-12-05) 1994 డిసెంబరు 5 (వయసు 29)
సిల్హెట్, బంగ్లాదేశ్
ఎత్తు6 అ. (183 cమీ.)[1]
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుLeft-arm orthodox spin
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 138)2022 జూలై 10 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2023 మార్చి 23 - ఐర్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 69)2021 మార్చి 28 - న్యూజీలాండ్ తో
చివరి T20I2023 మార్చి 31 - ఐర్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ T20I ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 14 20 37
చేసిన పరుగులు 8 447 196
బ్యాటింగు సగటు 4.00 19.43 7.25
100s/50s 0/0 0/2 0/0
అత్యధిక స్కోరు 3* 85 31
వేసిన బంతులు 270 4,499 1,764
వికెట్లు 18 75 45
బౌలింగు సగటు 15.55 32.06 29.06
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1 0
అత్యుత్తమ బౌలింగు 4/10 7/97 5/49
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 8/– 9/–
మూలం: Cricinfo, 13 March 2023

నసుమ్ అహ్మద్ (జననం 1994 డిసెంబరు 5) బంగ్లాదేశ్ క్రికెటరు. అతను దేశీయ క్రికెట్‌లో సిల్హెట్ డివిజన్ తరపున ఆడుతున్నాడు. 2021 మార్చిలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.[2]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

నసుమ్ అహ్మద్ 1994 డిసెంబరు 5న సిల్హెట్‌ ప్రాంతం లోని జలాలాబాద్‌లో బెంగాలీ ముస్లిం తల్లిదండ్రులకు జన్మించాడు. అతని తాత, 1958లో సునమ్‌గంజ్ జిల్లా, డెరాయ్‌ లోని మర్దాపూర్ గ్రామం నుండి సిల్హెట్‌కు వలస వెళ్ళాడు. [3]

కెరీర్

[మార్చు]

2019 నవంబరులో, 2019–20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో చటోగ్రామ్ ఛాలెంజర్స్ తరపున ఆడేందుకు నసుమ్ ఎంపికయ్యాడు. [4]

2020 మార్చిలో, జింబాబ్వేతో సిరీస్ కోసం బంగ్లాదేశ్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టుకు నసుమ్ ఎంపికయ్యాడు. [5] 2021 జనవరిలో, వెస్టిండీస్‌తో జరిగే వన్ డే ఇంటర్నేషనల్ (వన్‌డే) సిరీస్‌కు ప్రాథమిక జట్టులో ఎంపికైన నలుగురు కొత్త ఆటగాళ్లలో అతనొకడు. [6] 2021 ఫిబ్రవరిలో, న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌ కోసం ఎంపికయ్యాడు. [7] బంగ్లాదేశ్ తరపున 2021 మార్చి 28న న్యూజిలాండ్‌పై తన T20I రంగప్రవేశం చేసాడు. [8]

2021 ఆగస్టు 3 న ఆస్ట్రేలియాతో జరిగిన T20 మ్యాచ్‌లో, నసుమ్ 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి, బంగ్లాదేశ్ మొదటిసారి T20లో ఆస్ట్రేలియాపై విజయం సాధించడంలో తోడ్పడ్డాడు. [9] [10]

2021 సెప్టెంబరు 8న, న్యూజిలాండ్‌తో జరిగిన T20 మ్యాచ్‌లో, నసుమ్ 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌తో మొదటిసారి T20 సిరీస్‌ను గెలుచుకోవడంలో అది సహాయపడింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. [11] అదే నెలలో నసుమ్, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. [12]

2022 ఫిబ్రవరిలో నసుమ్, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టుకు ఎంపికయ్యాడు. [13] 2022 మార్చిలో, దక్షిణాఫ్రికాతో జరిగే వన్‌డే సిరీస్ కోసం కూడా ఎంపికయ్యాడు. [14] 2022 మేలో, వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం, మళ్లీ వన్‌డే జట్టుకు ఎంపికయ్యాడు.[15] 2022 జూలై 10న వెస్టిండీస్‌పై తన తొలి వన్‌డే ఆడాడు.[16]

మూలాలు

[మార్చు]
  1. Faiz Ahmed, Syed (8 September 2021). "Nasum's confidence from Mirpur must be translated into T20 WC". Dhaka Tribune. The six-feet tall బౌలరు [...]
  2. "Nasum Ahmed". ESPN Cricinfo. Retrieved 13 August 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "নিষেধাজ্ঞা নিয়ে মুখ খুললেন নাসুম" [Nasum opens up about ban]. Somoy TV (in Bengali). 17 August 2021.
  4. "BPL draft: Tamim Iqbal to team up with coach Mohammad Salahuddin for Dhaka". ESPN Cricinfo. Retrieved 18 November 2019.
  5. "Bangladesh T20 squad: Mushfiqur Rahim back, Nasum Ahmed breaks in". ESPN Cricinfo. Retrieved 5 March 2020.
  6. "No place for Mashrafe against West Indies". The Daily Star. Retrieved 4 January 2021.
  7. "Bangladesh leave out Taijul Islam for New Zealand tour". ESPN Cricinfo. Retrieved 19 February 2021.
  8. "1st T20I, Hamilton, Mar 28 2021, Bangladesh tour of New Zealand". ESPN Cricinfo. Retrieved 28 March 2021.
  9. "Bangladesh vs Australia: Nasum Ahmed shines as Tigers register first win over visitors in T20Is - Firstcricket News, Firstpost". Firstpost. Retrieved 3 August 2021.
  10. Desk, India com Sports (3 August 2021). "Live Bangladesh vs Australia Match 1st T20I Score : Live Updates From Dhaka". India News, Breaking News | India.com (in ఇంగ్లీష్). Retrieved 3 August 2021.
  11. "Bangladesh Beat New Zealand By 6 Wickets To Seal T20 series Win | Cricket News". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 8 September 2021.
  12. "No surprises as Bangladesh name Mahmudullah-led squad for T20 World Cup". ESPN Cricinfo. Retrieved 9 September 2021.
  13. "Ebadot gets ODI call-up as Bangladesh name four uncapped players for Afghanistan series". ESPN Cricinfo. Retrieved 14 February 2022.
  14. "Shakib Al Hasan, Tamim Iqbal back in Bangladesh Test squad". ESPN Cricinfo. Retrieved 3 March 2022.
  15. "Anamul Haque recalled for WI white-ball series; Mustafizur Rahman back in Test squad". ESPN Cricinfo. Retrieved 22 May 2022.
  16. "1st ODI, Providence, July 10, 2022, Bangladesh tour of West Indies". ESPN Cricinfo. Retrieved 10 July 2022.