ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
ఈ సీరీస్‌లో భాగం |
బౌలింగు పద్ధతులు |
---|
లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్, క్రికెట్‌లో ఎడమ చేతి వేళ్ళతో వేసే స్పిన్ బౌలింగు విధానం. [1] దీన్ని లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ అని, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్ బౌలింగ్ అనీ కూడా పిలుస్తారు. ఎడమ చేతి బౌలరు, తన వేళ్ళతో బంతిని కుడి నుండి ఎడమకు (బౌలర్ కోణం నుండి) స్పిన్ చేస్తూ బౌలింగు చేస్తాడు.
లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్ బౌలర్లు సాధారణంగా బంతిని గాలిలో డ్రిఫ్ట్ చేస్తూ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ల మీదికి వెళ్ళేలా, పిచ్‌పై పడిన తర్వాత బ్యాట్స్‌మన్ నుండి దూరంగా, ఆఫ్-స్టంప్ వైపు పోయేలా వేస్తారు. గాలిలో డ్రిఫ్ట్ అవడం, టర్న్ అవడం దాడి చేసే టెక్నిక్‌లు.[2]
ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ బౌలరు ప్రధాన వైవిధ్యాలు టాప్ స్పిన్నర్ (ఇది తక్కువగా తిరుగుతుంది, పైకి బౌన్స్ అవుతుంది), ఆర్మ్ బాల్ (ఇది అస్సలు తిరగదు, బౌలర్ చేతి కదిలే దిశలో కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ మీదికి డ్రిఫ్ట్ అవుతుంది; దీన్ని 'ఫ్లోటర్' అని కూడా అంటారు), ఎడమ చేతి స్పిన్నర్ వేసే దూస్రా (ఇది రెండో వైపుకు తిరుగుతుంది).
ప్రముఖ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్ బౌలర్లు
[మార్చు]ఎడమ చేతి సంప్రదాయ స్పిన్ బౌలింగ్ కళలో గణనీయ విజయాన్ని సాధించిన బౌలర్ల జాబితాను కింద చూడవచ్చు.
- రంగనా హెరాత్ - 433 టెస్టు వికెట్లు (టెస్టుల్లో ఎడమచేతి స్పిన్నర్ తీసిన అత్యధిక వికెట్లు) 74 వన్డే వికెట్లు, 18 టి20I వికెట్లు
- సనత్ జయసూర్య – 98 టెస్టు వికెట్లు, 323 వన్డే వికెట్లు (వన్‌డేలలో ఎడమ చేతి స్పిన్నర్ తీసిన అత్యధిక వికెట్లు), 19 టి20I వికెట్లు
- డేనియల్ వెట్టోరి - 362 టెస్టు వికెట్లు, 305 వన్డే వికెట్లు
- డెరెక్ అండర్‌వుడ్ - 297 టెస్టు వికెట్లు
- రవీంద్ర జడేజా - 268 టెస్టు వికెట్లు, 191 వన్డే వికెట్లు
- బిషన్ సింగ్ బేడీ - 266 టెస్టు వికెట్లు
- షకీబ్ అల్ హసన్ – 231 టెస్టు వికెట్లు, 136 టి20I వికెట్లు ( పురుషుల టి20I లలో ఏ బౌలర్‌కైనా అత్యధికం),[3] 301 వన్‌డే వికెట్లు
- రవిశాస్త్రి - 151 టెస్టు వికెట్లు
- కేశవ్ మహారాజ్ - 158 టెస్టు వికెట్లు
- ఆష్లే గైల్స్ - 143 టెస్టు వికెట్లు
- తైజుల్ ఇస్లాం - 166 టెస్టు వికెట్లు
- జెస్ జోనాసెన్ - 135 వన్‌డే వికెట్లు, 91 T20 వికెట్లు
- సోఫీ ఎక్లెస్టోన్ - 97 టి20I వికెట్లు
- అజాజ్ పటేల్ - ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ఏకైక ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్నర్
- మాంటీ పనేసర్ - 167 టెస్టు వికెట్లు
- అష్టన్ అగర్ - 11వ నంబర్ బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక టెస్టు స్కోరు రికార్డు
మూలాలు
[మార్చు]- ↑ "How to bowl left-arm spin". News.bbc.co.uk. 30 October 2003. Retrieved 21 June 2019.
- ↑ "MasterClass: Left arm spin bowling with Nadeem". YouTube. 17 October 2013. Archived from the original on 10 ఆగస్టు 2017. Retrieved 21 June 2019.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Records / Twenty20 Internationals / Bowling records / Most wickets in career". ESPNcricinfo. Retrieved 30 March 2023.