నాంజిల్ నళిని
నాంజిల్ నళిని | |
---|---|
జననం | తుక్కలే, కన్యాకుమారి జిల్లా, తమిళనాడు |
వృత్తి | నటి |
నాంజిల్ నళిని ఒక భారతీయ నటి.[1][2] ఆమె 12 సంవత్సరాల వయస్సులో బాలనటిగా రంగస్థలంపై అడుగు పెట్టింది. ఆ తరువాత, తన 50 సంవత్సరాల కెరీర్ లో వందకు పైగా తమిళ సినిమాలతో పాటు, పలు టెలివిజన్ ధారావాహికల్లో నటించింది. 1978లో ఆమెను కలైమామణి పురస్కారం వరించింది.[3]
ఆమె చెన్నై వేళచ్చేరిలో నివసించేది. తను సినిమాలతో బిజీగా ఉంటూనే 'రేవతి ఫైన్ ఆర్ట్స్' అనే తన సొంత నాటక బృందాన్ని ప్రారంభించింది. ఇందులో ఆమె కుమార్తె నాంజిల్ రేవతి కూడా ఉండేది.[4]
కెరీర్
[మార్చు]రంగస్థలం
[మార్చు]నాంజిల్ నళిని కన్యాకుమారి జిల్లా తుక్కలేలో జన్మించింది.[5] అయితే, నటనపై మక్కువతో ఆమె తిరునెల్వేలి పట్టణానికి చేరుకుంది, అక్కడ ఆమె 12 సంవత్సరాల వయస్సులో ఒక నాటక బృందంలో చేరింది. ఆమె 'నల్వర్' అనే నాటకంలో తల్లి పాత్రతో అరంగేట్రం చేసింది.[6] తరువాత ఆమె టి. కె. షణ్ముగం, ఎస్. ఎస్. రాజేంద్రన్, మేజర్ సుందరరాజన్, 'వైరం నాటక సభ' వంటి ప్రముఖ తమిళ నాటక కళాకారుల నాటక బృందాలలో నటించింది.[7]
సినిమా, టెలివిజన్
[మార్చు]ఆమె రంగస్థల అనుభవం తమిళ సినిమాకు పనికి వచ్చింది. చెన్నై చేరిన ఆమెకు 1968లో శివాజీ గణేశన్ నటించిన ఎంగా ఊర్ రాజా ఒక చిన్న పాత్ర దక్కింది. ఆమె శివాజీ గణేశన్ నటించిన తంగా పాఠక్కం (1974), అన్నన్ ఒరు కోయిల్ (1977), తీర్పు (1982) వంటి చిత్రాలలో కూడా నటించింది. ఆమె కమల్ హాసన్ కలిసి ఆడు పులి అట్టం (1977), రజనీకాంత్ తో ధర్మ యుద్ధం (1979), సత్యరాజ్ తో రిక్షా మామా (1992) వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది.
కళల రంగంలో ఆమె చేసిన కృషికి గాను 1978లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. ఆమె ఎవిఎం అవార్డు, అరింగర్ అన్నా, కలైంగర్, సెల్వి జయలలిత పురస్కారం వంటి ఇతర ప్రసిద్ధ తమిళ చలనచిత్ర అవార్డులను కూడా అందుకుంది.[8]
తరువాతి సంవత్సరాల్లో, ఆమె అళగి, వల్లి, మంధీర వాసల్, సూలం, కృష్ణదాసి, అచ్చం మేడమ్ నానం, బృందావనం వంటి కొన్ని ప్రసిద్ధ తమిళ టీవీ సీరియల్స్ లోనూ నటించింది.
మరణం
[మార్చు]ఆమె 76 సంవత్సరాల వయసులో 2020 జనవరి 19న చెన్నైలో మరణించింది.[9]
మూలాలు
[మార్చు]- ↑ Kumar, S.R. Ashok (2020-01-30). "Nanjil Nalini's lifelong commitment to acting". The Hindu. Retrieved 2020-08-17.
- ↑ "Nanjil Nalini died". tamil.news18.com. Archived from the original on 2020-08-06. Retrieved 2020-08-17.
- ↑ "Nanjil Nalini died". tamil.news18.com. Archived from the original on 2020-08-06. Retrieved 2020-08-17.
- ↑ "Your favorite newspapers and magazines". 2016-09-02. Retrieved 2020-08-17 – via PressReader.
- ↑ Kumar, S.R. Ashok (2020-01-30). "Nanjil Nalini's lifelong commitment to acting". The Hindu. Retrieved 2020-08-17.
- ↑ "திரைப்பட மற்றும் சின்னத்திரை நடிகை நாஞ்சில் நளினி மரணம்!". tamil.news18.com. Archived from the original on 2020-08-06. Retrieved 2020-08-17.