నాకో సరస్సు
నాకో సరస్సు | |
---|---|
ప్రదేశం | కిన్నౌర్ జిల్లా |
అక్షాంశ,రేఖాంశాలు | 31°52′47″N 78°37′39″E / 31.879639°N 78.627632°E |
రకం | ఎత్తైన మంచినీటి సరస్సు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల ఎత్తు | 3,662 m (12,010 ft) |
మూలాలు | Himachal Pradesh Tourism Dep. |
నాకో సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో గల పూహ్ అనే ప్రాంతంలో ఉండే ఒక లోతైన సరస్సు. ఇది నాకో గ్రామానికి సరిహద్దు భాగంలో ఉండటం వల్ల గ్రామంలోని కొంత భాగం సరస్సులో కలిసిపోయింది.
భౌగోళికం
[మార్చు]ఈ సరస్సు సముద్ర మట్టానికి సుమారు 3,662 మీటర్ల (12,014 అడుగులు) ఎత్తులో ఉంది. సరస్సు చుట్టూ విల్లో, పోప్లర్ చెట్లు ఉన్నాయి. సరస్సు దగ్గర నాలుగు బౌద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రదేశానికి సమీపంలో పద్మసంభవ అనే సాధువు ఆశ్రమం ఉంది.
నమ్మకాలు
[మార్చు]ఈ సరస్సు నుండి అనేక మైళ్ళ దూరంలో తాషిగాంగ్ అనే గ్రామం ఉంది, దాని చుట్టూ అనేక గుహలు ఉన్నాయి. ఇక్కడ గురు పద్మసంభవ అనే సాధువు ధ్యానం చేసి తన అనుచరులకు ఉపన్యాసం ఇచ్చారని ప్రజలు నమ్ముతారు.
పురాణాలు
[మార్చు]ఈ సరస్సుకు సమీపంలో ఒక జలపాతం ఉంది, ఇది యక్షుల స్వర్గపు రాజ్యం అని పురాణాలు చెబుతున్నాయి. అక్కడి గుహల్లో ఇప్పటికీ ఈ యక్షిణులు లేదా ఇతర దేవతల ప్రత్యక్ష పాదముద్రలు ఉన్నాయి. పర్యాటకులు లద్ధాక్, స్పితి లోయ వంటి ప్రదేశాల నుండి ఈ సరస్సు పరిసరాలను చూడటానికి విహారయాత్రగా వస్తారు.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "himachaltourism.gov.in". Archived from the original on 24 March 2010. Retrieved 12 April 2020.