నాగమణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిచయం

[మార్చు]
దస్త్రం:క్లోరొఫేన్ రాళ్ళు .jpg
క్లోరొఫేన్ రాళ్ళు

నాగమణి [Nagamani (Cobra Pearl) ] అనగా హిందూ పురాణాల ప్రకారం నాగుపాము (King Cobra) తల పై ఆభరణంగా ఉండే ఒక మణి. ఈ మణి గురించి అగ్ని పురాణము, వాయు పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం, బ్రహ్మ పురాణము, మత్స్య పురాణం, మహా భారతము, గరుడ పురాణం వంటి గ్రంథాలలో ప్రస్తావించబడింది. పూర్వం నుండి నాగమణి అత్యంత విలువైన మణి అని, మంత్ర శక్తులు ఉన్నాయని హిందువుల గట్టి నమ్మకం ఇప్పటికీ ఉంది.

పూర్వం అటవీతెగల్లో నాగుపాములను, పులి చర్మాలను ధరించిన వ్యక్తిని చాలా శక్తిమంతుడిగా భావించేవారు. వేదకాలంలో మొట్టమొదటి సారిగా 'మహా శివుడు' ఆకారం రూపొందిస్తున్నప్పుడు శివుడి చేతులను, తలను నాగుపాముల చిత్రాలతో అలంకరించాడు. మణి అనేది మహిమ గల వస్తువుగా పూర్వం భావించబడేది. నాగుపాముని మహిమగల జీవి చేయడం కోసం దాని తలపై మణి అనే దాన్ని చిత్రీకరించాడు మానవుడు. కనుక మనిషి హృదయంలో నేటికీ శివుడు మహా శక్తివంతుడైన దేవుడయ్యాడు, నాగుపామును మనిషి ఆరాధించసాగాడు.

దేవుడికి దూరమై, ఆధ్యాత్మిక జీవనానికి దూరమై కేవలం శారీరక సుఖం కోసం డబ్బు సంపాదనే ద్యేయంగా పెట్టుకున్న నేటి మానవులు నాగుపాముకు నిజంగా మణి వుంటుందేమో నని, దాన్ని అమ్మి సొమ్ము చేసుకుని లక్షలు, కోట్లు సంపాదించుకోవచ్చని భ్రమపడుతున్నాడు. నదీ పరీవాహక ప్రాంతాలలో లేదా ఖనిజాలుండే ప్రాంతాలలో ఉండే క్లోరోఫేన్ (Chlorophane) అను ఒక రకమైన Fluorite ఖనిజముంటుంది. చాలా రంగుల్లో దొరికే ఈ ఖనిజానికి స్వయంగా ప్రకాశించే గుణం ఉంటుంది. రాత్రి సమయాల్లో నాగుపాములు వీటి వద్దకు చేరి, వీటి వెలుగును ఆధారంగా చేసుకుని పురుగులను, చిన్నచిన్న జంతువులను తింటాయి. వీటినే నాగుపాములు వదిలేసిన నాగమణులని చెప్పి మోసగించేవారు ఉన్నారు. కొంతమంది అయితే రహస్యంగా నాగుపామును చంపి, తల చీరి ఈ ఖనిజాన్ని అందులో పెట్టి ఇతరులకు చూపించేవారు లేకపోలేదు. మనుష్యులకు, ఇతర జంతువులకు కిడ్నీలలో, గాల్ బ్లాడర్ లో రాళ్ళు, ఏర్పడ్డట్టుగా పాము తలలో కూడా ఏర్పడతాయని అయితే అవి రత్నాలుగా ఏర్పడతాయని మరి కొంతమంది అంటారు. వాస్తవంగా నాగుపాముకి తలమీద కాని లోపల గాని మణి ఉండదు.

లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నాగమణి&oldid=4010812" నుండి వెలికితీశారు