నాజర్ మొహమ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాజర్ మొహమ్మద్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ5 March 1921
లాహోర్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ1996 జూలై 12(1996-07-12) (వయసు 75)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి
బంధువులుఫిరోజ్ నిజామి (సోదరుడు)
ముదస్సర్ నాజర్ (కొడుకు)
మహ్మద్ ఇలియాస్ (మేనల్లుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 10)1952 అక్టోబరు 16 - ఇండియా తో
చివరి టెస్టు1952 డిసెంబరు 12 - ఇండియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 5 45
చేసిన పరుగులు 277 2,739
బ్యాటింగు సగటు 39.57 41.50
100లు/50లు 1/1 8/9
అత్యధిక స్కోరు 124* 175
వేసిన బంతులు 12 486
వికెట్లు 0 5
బౌలింగు సగటు 51.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/3
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 40/–
మూలం: Cricinfo, 2019 మార్చి 11

నాజర్ మొహమ్మద్ (1921, మార్చి 5 - 1996, జూలై 12) పాకిస్తానీ క్రికెటర్. 1952లో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. లాహోర్‌లోని ఇస్లామియా కాలేజీలో చదువుకున్నాడు.[1]

జననం[మార్చు]

నాజర్ మొహమ్మద్ 1921, మార్చి 5న పాకిస్తాన్, పంజాబ్ లోని, లాహోర్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1952-53లో ఢిల్లీలో టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ కోసం వేసిన మొదటి బంతిని ఆడాడు.[3] ఆ తర్వాతి మ్యాచ్‌లో దేశం మొదటి టెస్ట్ సెంచరీ సాధించాడు. లక్నోలో ఒక మ్యాటింగ్ వికెట్‌పై, ఎనిమిది గంటల 35 నిమిషాల్లో 124 పరుగులతో నాటౌట్‌గా ఉంటూ ఇన్నింగ్స్ విజయాన్ని నెలకొల్పాడు.[4] ఒక టెస్ట్ మ్యాచ్ మొత్తం మైదానంలో ఉన్న మొదటి ఆటగాడిగా నిలిచాడు. తన ఆఖరి టెస్ట్‌లో 55, 47 పరుగులు చేసాడు. ఇతని కుమారుడు ముదస్సర్ నాజర్ 76 టెస్టులు ఆడాడు.[5]

మరణం[మార్చు]

నాజర్ మొహమ్మద్ 1996, జూలై 12న పాకిస్తాన్, పంజాబ్ లోని, లాహోర్ లో మరణించాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Nazar Mohammad Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  2. "Nazar Mohammad Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  3. "IND vs PAK, Pakistan tour of India 1952/53, 1st Test at Delhi, October 16 - 18, 1952 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  4. "IND vs PAK, Pakistan tour of India 1952/53, 2nd Test at Lucknow, October 23 - 26, 1952 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  5. "Mohammad Ilyas". CricketArchive. Retrieved 2023-09-13.
  6. "Nazar Mohammad Profile and Biography". pakistan.crictotal.com. Retrieved 2023-09-16.

బాహ్య లింకులు[మార్చు]