ముదస్సర్ నాజర్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | 1956 ఏప్రిల్ 6|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | నాజర్ మొహమ్మద్ (తండ్రి) ఫిరోజ్ నిజామి (మామ) మహ్మద్ ఇలియాస్ (బంధువు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 76) | 1976 డిసెంబరు 24 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1989 ఏప్రిల్ 24 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 21) | 1977 డిసెంబరు 23 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1989 మార్చి 14 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2017 నవంబరు 10 |
ముదస్సర్ నాజర్ (జననం 1956, ఏప్రిల్ 6) పాకిస్తానీ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. పాకిస్తాన్ తరపున టెస్ట్ క్రికెట్, పాకిస్తాన్, ఇంగ్లండ్‌లలో లీగ్ క్రికెట్‌లో ఆడాడు. పాకిస్తాన్ తరపున 76 టెస్టులు, 122 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత 1993, 2001లో పాకిస్తాన్‌కు, కెన్యా, అనేక ఇతర జట్లకు కోచ్‌గా పనిచేశాడు.
ప్రస్తుతం, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ క్వాలండర్స్ ఫ్రాంచైజీ క్రికెట్ జట్టుకు సలహాదారుగా నియమించబడ్డాడు.
జననం
[మార్చు]ముదస్సర్ నాజర్ 1956, ఏప్రిల్ 6న పంజాబ్‌లోని లాహోర్‌లో జన్మించాడు.
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]ముదస్సర్ 1976, డిసెంబరు 24న అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ తరపున అరంగేట్రం చేశాడు. తన తండ్రి, టెస్ట్ క్రికెటర్ నాజర్ మహ్మద్ మాదిరిగా పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేవాడు. ముదస్సర్ ఇంగ్లాండ్‌లోని బోల్టన్‌లో నివసిస్తున్నాడు. పాకిస్తాన్‌లోని అనేక ప్రముఖ లీగ్ జట్ల కోసం ఆడాడు. 1989, ఫిబ్రవరి 28న ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అయితే 1993 వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. తన తండ్రి తర్వాత 1982-83 సిరీస్‌లో భారత్‌తో జరిగిన ఐదవ టెస్టులో ఓపెనర్‌గా బ్యాట్‌ని మోసిన రెండవ పాకిస్థానీగా నిలిచాడు.
1982-83లో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో భారత్ జరిగిన మ్యాచ్ లో జావేద్ మియాందాద్‌తో కలిసి 3వ వికెట్‌తో 451 పరుగుల టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.[1] టెస్ట్ మ్యాచ్ సెంచరీతో పాటు నిమిషాల పరంగా (557) రికార్డును కూడా కలిగి ఉన్నాడు.[2]
1980ల మధ్యలో, ముదస్సర్ పాకిస్థాన్ ఆటగాళ్ళ సంఘం ప్రతినిధి అయ్యాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ గురించి చేసిన విమర్శలు తనను పాకిస్థాన్ వైపు నుండి తప్పించడానికి దారితీశాయని పేర్కొన్నాడు.[3]
కోచింగ్ కెరీర్
[మార్చు]క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, పాకిస్థాన్‌కు జాతీయ కోచ్‌గా నియమించబడ్డాడు.
2003లో కెన్యా క్రికెట్ అసోసియేషన్ నైరోబీలోని అకాడమీకి ప్రధాన కోచ్‌గా నియమించింది. 2004 జనవరిలో ప్రారంభమయ్యే రెండేళ్ళ కాంట్రాక్టుతో[4] కెన్యా క్రికెట్ అసోసియేషన్తో విభేదాల మధ్య, ఆండీ మోల్స్ రాజీనామా తర్వాత 2005 జనవరిలో కెన్యా జాతీయ క్రికెట్ జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు.[5]
2021 జనవరిలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు జాతీయ సెలెక్టర్‌గా, నేషనల్ అకాడమీ ప్రోగ్రామ్ హెడ్‌గా నియమించింది.[6] 2021 ఏసిసి అండర్-19 ఆసియా కప్, 2022 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ అండర్-19 క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు.[7]
2023 మార్చిలో రాబిన్ సింగ్‌ను తొలగించిన తర్వాత తాత్కాలిక ప్రాతిపదికన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ముదస్సర్ బాధ్యతలు స్వీకరించాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Wisden – The Indians in Pakistan, 1982–83". Wisden. ESPNcricinfo. Retrieved 2023-09-13.
- ↑ "Records | Test matches | Batting records | Slowest hundreds | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-09-13.
- ↑ "The way I see it", Cricket Life, ed. Imran Khan, October 1989, p. 22.
- ↑ "Differences to harm cricket: Mudassar". Dawn. 21 November 2003. Retrieved 2023-09-13.
- ↑ "Nazar returns to coach Kenyan team". IOL. 6 April 2005. Retrieved 2023-09-13.
- ↑ "Emirates Cricket Board appoints Mudassar Nazar as Selector and Head of National Academy Program". Emirates Cricket Board. 24 January 2021. Retrieved 2023-09-13.
- ↑ "UAE Under-19 ready to test their mettle against the best in the continent". Gulf News. 22 December 2021. Retrieved 2023-09-13.
- ↑ Radley, Paul (21 March 2023). "Robin Singh's term as UAE coach ends, Mudassar Nazar takes temporary charge". The National. Abu Dhabi. Retrieved 2023-09-13.