Jump to content

నానక్ సింగ్

వికీపీడియా నుండి
నానక్ సింగ్
పుట్టిన తేదీ, స్థలం(1897-07-04)1897 జూలై 4
చక్ హమీద్, జీలం జిల్లా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)
మరణం1971 డిసెంబరు 28(1971-12-28) (వయసు 74)
పంజాబ్
వృత్తినాటక రచయిత, కవి, నవలా రచయిత
జాతీయతఇండియన్
జీవిత భాగస్వామిరాజ్ కౌర్
సంతానంకుల్వంత్ సింగ్ సూరి (కొడుకు)
కుల్బీర్ సింగ్ సూరి (కొడుకు)
కన్వాల్జిత్ సింగ్ సూరి (కొడుకు)
కర్తార్ సింగ్ సూరి (కొడుకు)
కుల్దీప్ సింగ్ సూరి (కొడుకు)
పుష్పిందర్ కౌర్ (కుమార్తె)

నానక్ సింగ్ (4 జూలై 1897 – 28 డిసెంబరు 1971) ప్రముఖ పంజాబీ కవి, గీత రచయిత, నవలాకారుడు. ఆయన అసలు పేరు హన్స్ రాజ్. ఆయన భారత స్వతంత్రోద్యమంలో విప్లవ సాహిత్యం రాశారనే ఆరోపణ తెచ్చి అరెస్టు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆయన ఎన్నో నవలలు రాశారు.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

పాకిస్థాన్ లోని ఝేలమ్ జిల్లాలో పేద పంజాబీ హిందూ కుటుంబంలో  జన్మించారు. ఆయన అసలు పేరు  హన్స్ రాజ్. సిక్కుగా మారాకా  నానక్ సింగ్ అని పేరు మార్చుకున్నారు. పేదరికం వల్ల ఆయన పెద్దగా చదువుకోలేకపోయారు. కానీ చిన్నప్పుడే రచనలు చేయడం మొదలు పెట్టారు ఆయన. భక్తి గీతాలు, గురుద్వా రీఫార్మ్ ఉద్యమానికి సిక్కులను ప్రేరేపించడానికి కూడా గీతాలు రాశారు నానక్. 1918లో అతన మొదటి పుస్తకం సత్ గురు మహిమాను ముద్రించారు.

జాతీయోధ్యమంలో కృషి

[మార్చు]

13 ఏప్రిల్ 1919న జలియన్ వాలాబాగ్ దురంతం జరిగినప్పుడు నానక్  అక్కడే ఉన్నారు. ఆ కాల్పుల్లో తన ఇద్దరు స్నేహితులు  మరణించారు. ఆ చేదు అనుభవంతో ఆయన ఖూనీ వైశాఖి అనే కవితా సంకలనం రాశారు.  ఈ పుస్తకాన్ని విప్లవ సాహిత్యంగా ముద్రవేసి,  దానిని నిషేధించింది బ్రిటీష్ ప్రభుత్వం.

అకాలీ ఉద్యమంలో చేరి స్వాతంత్ర్యోద్యమానికి ఎంతో కృషి చేశారు నానక్ సింగ్. అకలీ పత్రికలకు ఎడిటర్ గా చేశారు. ఇది గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను బంధించి లాహోర్ లోని బోర్స్ టల్ జైలుకు పంపించింది. శాంతియుత నిరసనలు తెలుపుతున్న సిక్కులను అణిచివేస్తున్న ప్రభుత్వం గురించి జఖ్మీ దిల్ అనే కవితా సంకలనం రాశారు ఆయన. జనవరి 1923లో ప్రచురించిన ఆ పుస్తకాన్ని రెండు వారాలు దాటక ముందే ప్రభుత్వం నిషేధించింది.

ఆయన జైలులో ఉన్నప్పుడు నవలలు రాసేవారు. గురుముఖి లిపిలో దాదాపు 40,000 పేజీలు రాశారు. 1960లో పంజాబీ సాహిత్యం లోనే అత్యంత విలువైన పురస్కారాన్ని అందుకున్నారు ఆయన. ఆయన రాసిన చారిత్రిక నవల ఇక్ మైన్ దో తల్వారన్ (1959) కు 1962లో సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు నానక్.

సాహిత్యం

[మార్చు]

నానక్ సింగ్ రాసిన నవలలు, కథలు, నాటకాలు, అనువాద నవలల జాబితా:

  1. ఆస్తక్ నాస్తక్
  2. అదం ఖోర్
  3. అధ్-ఖైరియా ఫుల్
  4. అగ్గ్ దీ ఖేద్
  5. ఎన్-సైట్ జఖమ్
  6. బి.ఎ పాస్
  7. బంజర్
  8. భూఆ
  9. చర్హదీ కాలా
  10. ఛలవా
  11. చిత్రకార్
  12. చిట్టా లహు
  13. చోద్ చనన్
  14. ధుండ్లే పర్ఛవన్
  15. దుర్ కినరా
  16. ఫౌలది ఫూల్
  17. ఫ్రాన్స్ దా దాకు
  18. గగన్ దమమా బజియా
  19. గంగజాలీ విచ్ షరబ్
  20. గరీబ్ దీ దునియా
  21. హంజౌన్ దే హర్
  22. ఇక్ మైన్ దో తల్వరన్
  23. జీవన్ సంగ్రామ్
  24. కగ్తన్ దీ బేరీ
  25. కాల్ చక్కర్
  26. కటి హోయే పతంగ్
  27. కల్లో
  28. ఖూన్ దే సోహిలే
  29. కోయీ హరియా బూత్ రహియో రీ
  30. లమ్మా పైండా
  31. లవ్ మ్యారేజ్
  32. మంఝ్దార్
  33. మత్రేయీ మాన్
  34. మేరీ దునియా
  35. మేరియన్ సదైవి యాదన్
  36. మిద్ధే హోయే ఫూల్
  37. మిట్ఠా మౌహ్రా
  38. నసూర్
  39. పాప్ దీ ఖట్టీ
  40. పరస్చిత్
  41. పథర్ దే ఖంబ్
  42. పథర్ కంబా
  43. పట్జర్ దే పంచీ
  44. పవితర్ పాపీ
  45. పియార్ దా దేవతా
  46. పియార్ ది దునియా
  47. ప్రేమ్ సంగీత్
  48. పూజారీ
  49. రబ్ ఆప్నే అస్లీ రూప్ విచ్
  50. రజనీ
  51. సార్హ్ సతీ
  52. సంగమ్
  53. సరాపైన్ రూహన్
  54. సూలన్ దీ సెజ్
  55. సుమన్ కంతా
  56. సునెహ్రీ జిల్ద్
  57. సుప్నైన్ ది కబర్
  58. స్వర్గ్ తే ఉస్దే వారిస్
  59. తాష్ దీ ఆదత్
  60. తస్వీర్ దే దోవన్ పాసే
  61. థండైన్ ఛవన్
  62. తుట్టే ఖంభ్
  63. తుట్టీ వీనా
  64. వడ్డా డాక్టర్ తే హోర్ కహనియన్
  65. వర్ నహీన్ సరప్
  66. విశ్వాస్ ఘాట్

గౌరవం

[మార్చు]

1997లో ఆయన శతజయంతుత్సవాలను జరిపారు. నానక్ సింగ్ గౌరవార్ధం 1988లో అప్పటి ప్రధాని ఇందెర్ కుమార్ గుజ్రల్ ఆయనపై పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.[1]

References

[మార్చు]
  1. "Nanak Singh". Sikh-heritage.co.uk. Retrieved 2012-11-30.