అక్షాంశ రేఖాంశాలు: 17°22′N 78°28′E / 17.367°N 78.467°E / 17.367; 78.467

నానాజీపూర్ జ‌ల‌పాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నానాజీపూర్ జలపాతం
నానాజీపూర్ జ‌ల‌పాతం is located in Telangana
నానాజీపూర్ జ‌ల‌పాతం
ప్రదేశంనానాజ్‌పూర్, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
అక్షాంశరేఖాంశాలు17°22′N 78°28′E / 17.367°N 78.467°E / 17.367; 78.467
రకంజలపాతం

నానాజీపూర్ జ‌ల‌పాతం తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, నానాజ్‌పూర్ గ్రామ సమీపంలో ఉన్న జలపాతం. సికింద్రాబాద్ నుంచి 43 కిలోమీట‌ర్లు, శంషాబాద్ బ‌స్టాప్ నుంచి 15 కిలోమీట‌ర్ల దూరంలో ఈ జలపాతం ఉంది.[1]

జలపాత వివరాలు

[మార్చు]

పాలమాకుల్ చెరువు నిండి అక్కడి నుండి హిమయాత్ సాగర్‌కు వెళ్తున్న వర్షపు నీళ్ళు నానాజీపూర్ గ్రామంలో చిన్నపాటి జలపాతంగా ఏర్పడ్డాయి.[2] గ్రామంలో జలపాతం ఏర్పడినందువల్ల పంట పొలాలకు నీరు అందడంతోపాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయి. సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో జలపాతానికి వెళితే చూడడానికి అందంగా ఉంటుంది. వర్షాకాలంలో మాత్రమే జాలువారే ఈ జలపాతం దగ్గర కొంతమంది చేపలు కూడా పడుతుంటారు.

ప్రత్యేకతలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో 17వ శ‌తాబ్దంలో నిర్మించబడిన అమ్మ‌ప‌ల్లి సీతారామ‌చంద్రస్వామి దేవాల‌యం కూడా ఉంది. ఈ దేవాలయం ఆంజనేయుడు లేడు. ఆంజ‌నేయుడు లేని అతికొద్ది దేవాల‌యాల్లో ఇదీ ఒక‌టని చెబుతుంటారు. ఈ దేవాలయంలో కళ్యాణి చాళుక్యుల కాలంనాటి శాసనాలు ఉన్నాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, టూరిజం (6 August 2021). "Nanajipur waterfalls : హైద‌రాబాద్‌కు చేరువ‌లో అద్భుత‌మైన జ‌ల‌పాతం". Namasthe Telangana. Archived from the original on 10 September 2021. Retrieved 21 October 2021.
  2. "వీడియో: వరదలతో హైదరాబాద్‌లో జలపాతం.. చిన్నా పెద్దా వరదనీటిలో దూకి కేరింతలు". Samayam Telugu. Archived from the original on 2021-10-21. Retrieved 2021-10-21.
  3. Telangana Today, Telangana (5 August 2021). "Telangana's Nanajipur waterfalls, a new tourist attraction". Archived from the original on 6 August 2021. Retrieved 21 October 2021.