Jump to content

నానో పదార్దములు

వికీపీడియా నుండి

నానో- (ఆంగ్లం: Nano-) అనగా ఒక యూనిట్ లోని బిలియన్ భాగము. పదార్దం యొక్క పరిమాణం 1 నుండి 100 నానో మీటర్ మద్యలో అనగా నానో స్థాయిలో వుంటే ఆ పదార్దాలను నానో పదార్దాలు లేక నానో కణములు అంటారు. నానో పదార్థాలు వాటి సమూహ పదార్థాల కంటే ప్రత్యేకమైన భౌతిక, రసాయన గుణాలను కలిగిఉంటాయి. ఉదాహరణకు, నానో బంగారు కణాలు బంగారు వర్ణంలో కాకుండా ఎర్రని వర్ణం కలిగి ఉంటాయి. ప్రస్తుతం అనేక రకాల నానో పదార్దాలను విభిన్న పరిమాణాలతో, ఆకారాలలో తయారు చేస్తున్నారు. అవి గ్రాఫేన్‌, నానో గొట్టాలు, నానో ఫైబర్స్, నానో తీగలు, నానో కణాలు మొదలైనవి.

నానో పదార్థాలను తయారుచేయు పద్దతులు

[మార్చు]

నానో పదార్దాలను స్థూల స్థాయి నుండి నానోస్థాయి వరకు, సూక్ష్మ స్థాయి నుండి నానోస్థాయి వరకు అను రెండు విధాలుగా తయరు చేయవచ్చు.

స్థూల స్థాయి నుండి నానోస్థాయి వరకు

[మార్చు]

ఈ విధానములో మైక్రాన్‌ పరిమాణంలో వున్న కణాలతో ప్రారంభించి, నానో పరిమాణంలో ఉండే కణాలను రూపొందిస్తారు. అనేక పద్ధతుల ద్వారా నానో పదార్దాలను తయారు చేస్తారు. ఈ పద్ధతిలో నానో పదార్దాలను రుపొందించడానికి స్థూల స్థాయిలో వున్న పదార్దాలను కోయుట, చెక్కుట, పోతపోయుట వంటి ప్రక్రియలను అవలంబిస్తారు. ఈ పద్ధతికి కొన్ని పరిమితులు ఉన్నాయి.

సూక్ష్మ స్థాయి నుండి నానోస్థాయి వరకు

[మార్చు]

ఈ విధానములో మూడి పదార్దాలను పరమాణు స్థాయి లేక అణువు స్థాయి నుండి జాగ్రత్తగా వృద్దిపరుస్తూ నానో స్థాయికి చేరుస్తారు. ఈ పద్ధతిలో నానో పదార్దాలను రూపొందించడానికి విద్యుద్విశ్లేషణముతో నిక్షిప్తము చేసే విధానాన్ని వినియోగిస్తారు. ఈ విధానాన్ని అధో-ఉర్ద్వ నానో కృత్రిమ విధానం అనికూడా అంటారు. ఒక విధానములో ఏర్పడిన నానో పదార్దాలు విజాతీయంగా ఉంటూయి. వివిధ పరిమణాలలో కణాలు ఏర్పడుట వల్ల వీటిలో మలినాలు వుండవచ్చు. మరొక విధానములో ఏర్పడిన నానో పదార్దాలు సజాతీయంగా ఉండి శుద్ధంగా వుండవచ్చు.

నానో పదార్ధాల ఉపయోగాలు

[మార్చు]

ప్రస్తుత కాలంలో నానో పదార్థాలను వైద్యరంగములో, విద్యుత్ పరికరాల తయారీలో, పర్యావరణ పరిరక్షణకూ ఉపయోగిస్తున్నారు.

  • వైద్యరంగములో సూక్ష్మజీవుల సంహారకాలుగా, మందులను శరీరంలో ప్రవేశపెట్తడంలోనూ కరకాలుగా ఉపయోగిస్తున్నారు.
  • విద్యుత్ రంగములో పాక్షిక విద్యుత్ వాహకాలుగా, బయో సెన్సర్లుగా ఉపయోగిస్తున్నారు.
  • పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీటిని శుద్ధిచేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

వివిధ రకాల నానో పదార్ధాలు

[మార్చు]
  • గ్రాపీన్‌
  • నానో గొట్టాలు
  • నానో ఫైబర్స్
  • నానో తీగలు
  • నానో కణాలు