నారాయణ్ దాస్ నారంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నారాయణ్‌దాస్‌ కిషన్‌దాస్‌ నారంగ్‌ (1946 జూలై 27 - 2022 ఏప్రిల్ 19) తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య మండ‌లి (Telugu Film Chamber of Commerce) అధ్య‌క్షుడు (2019 - 2022).[1] ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్ అధినేత. సినిమా నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గాను సుపరిచితుడు. సుమారు 650కు పైగా సినిమాలకు ఆయన ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్ చేశారు.

ఆయన పూర్వీకులది పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ ప్రాంతం. దేశ విభజన జరిగిన తర్వాత ఇండియా వచ్చారు. ముంబైలో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత 1950లలో హైదరాబాదు వచ్చారు. కన్యలాల్ నారంగ్, లీలావతి నారంగ్ దంపతులకు నారాయణ్ దాస్ నారంగ్ జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. నారాయణ్ దాస్ కి భార్య సునీత, ముగ్గురు సంతానం. వారు సునీల్ నారంగ్, భరత్, మోనా.

76 ఏళ్ళ నారాయణ్ దాస్ నారంగ్ తీవ్ర అస్వస్థతతో 2022 ఏప్రిల్ 19న హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.[2] మరణ సమయానికి నాగార్జునతో 'ఘోస్ట్', ధనుశ్‌తో ‘సార్’ సినిమాతో పాటు సుమారు పది సినిమాల వరకూ నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా గతంలో తన శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో లవ్ స్టొరీ, లక్ష్య తదితర సినిమాలను నిర్మించారు.

మూలాలు

[మార్చు]
  1. "ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ కన్నుమూత". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-19. Archived from the original on 2022-04-19. Retrieved 2022-04-19.
  2. telugu, NT News (2022-04-19). "Narayan das Narang | టాలీవుడ్‌లో విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత నారాయ‌ణ్ దాస్ నారంగ్ కన్నుమూత‌". Namasthe Telangana. Retrieved 2022-04-19.