Jump to content

నారీ నారీ నడుమ మురారి

వికీపీడియా నుండి
(నారి నారి నడుమ మురారి నుండి దారిమార్పు చెందింది)
నారీ నారీ నడుమ మురారి
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాణం కె.మురారి
రచన జంధ్యాల
తారాగణం నందమూరి బాలకృష్ణ,
శోభన,
నిరోషా,
శారద,
కైకాల సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,
రమాప్రభ
సంగీతం కె.వి.మహదేవన్
ఛాయాగ్రహణం విన్సెంట్
నిర్మాణ సంస్థ యువచిత్ర ఆర్ట్స్
విడుదల తేదీ 27, ఏప్రిల్ 1990
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నారి నారి నడుమ మురారి ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1990 లో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఆర్థికంగా విజయవంతం అయిన చిత్రము. ఇందులో బాలకృష్ణ, శోభన, నిరోషా ప్రధాన పాత్రలు పోషించారు.

"నక్కబొక్కలపాడు" గ్రామంలో శేషారత్నం (శారద) బాగా తలపొగరున్న ధనిక యువతి. ఆమె భర్త జానకిరామయ్య (సత్యనారాయణ) భార్య మాటకు లోబడి నడుచుకొంటుంటాడు. వారికిద్దరు ఆడపిల్లలు - శోభ (శోభన), నీరు (నిరోష). జానకిరామయ్య తల్లిగా అంజలీదేవి నటించింది. జానకిరామయ్య మేనల్లుడు వెంకటేశ్వరరావు (నందమూరి బాలకృష్ణ) ఈ సినిమా హీరో. తన కూతుళ్ళలో ఒకరిని మేనల్లుడికిచ్చి పెళ్ళి చేయాలని జానకిరామయ్య కోరిక. భర్తవైపు బంధువులంటే ఇష్టంలేని శేషారత్నం అందుకు అస్సలు ఒప్పుకోదు.

మేనమామ కోరిక ప్రకారం అతని కూతుళ్ళలో ఒకరిని ఆకర్షించాలని వెంకటేశ్వరరావు నక్కబొక్కలపాడుకు వస్తాడు. అయితే ఇద్దరూ బావను ప్రేమించడం మొదలుపెడతారు. తరువాత జరిగే పరిణామాలే ఈ సినిమా కథాంశం.

తారాగణం

[మార్చు]
  • నందమూరి బాలకృష్ణ
  • నిరోషా
  • శోభన
  • శారద
  • సత్యనారాయణ
  • అల్లు రామలింగయ్య
  • చిట్టిబాబు
  • అనంత్
  • అనంతరాజ్
  • రమాప్రభ
  • తనికెళ్ల భరణి
  • బాబూ మోహన్
  • చిడతల అప్పారావు
  • పొట్టి ప్రసాద్
  • వంకాయల సత్యనారాయణ
  • అంజలీ దేవి
  • శ్రీలక్ష్మి
  • మమత
  • కల్పనారాయ్ .

పాటలు

[మార్చు]
  • ఇరువురు భామల కౌగిలిలో - బాలు, సుశీల. రచన: ఆచార్య ఆత్రేయ.
  • ఏం వాన తరుముతున్నది - బాలు, సుశీల , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఇళయరాజా స్వరపరచిన పాట ఆధారంగా)
  • మనసులోని మర్మమునుతెలుసుకో - బాలు, సుశీల , రచన: త్యాగరాయ కీర్తన.
  • పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి - బాలు, సుశీల, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి.
  • దుత్తలాగున్నావె రత్తమ్మత్తా - బాలు , రచన: వేటూరి సుందర రామమూర్తి.
  • వయసు సొగసు కలిసిన వేళ - బాలు, సుశీల, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి.

చిత్ర విశేషాలు

[మార్చు]
  • యువచిత్ర పతాకం పై నిర్మాత మురారి బాలకృష్ణ హీరో గా నిర్మించిన రెండవ చిత్రం.(తొలి చిత్రం సీతారామ కళ్యాణం).
  • నారీనారీ నడుమ మురారి చిత్రానికి వెంకటేశ్వర మహాత్యం సినిమా కొంత ఆధారంగా కనిపిస్తుంది.
  • చిత్రంలో కథానాయకుని పేరు కూడా వెంకటేశ్వర రావే కావటం గమనార్హం. చిత్రంలో ఒకపాట, ఒక సన్నివేశం లో పాత చిత్రం తాలూకూ క్లిప్పింగ్స్ కనిపిస్తాయి.
  • కె.వి. మహదేవన్ సంగీతంలో పాటలన్నీ హయిగొలిపేవే.(ఏంగాలో తరుముతున్నదీ, వయసూ సొగసూ కలిసిన వేళ, ఇరువురి భామలా కౌగిలిలో మొదలైనవి).
  • చిత్రంలోని హాస్యం (సెపరేటు ట్రాకు-చిట్టిబాబు, అనంత్, మమతలతో) సరిగా పండలేదు.
  • షూటింగు, తమిళనాడులోని వేలచ్చేరి ప్రాంతంలోని చిరంజీవి గెస్ట్ హౌస్ లో జరిగింది. తమిళనాడులోని గోపిచెట్టిపాళయం వద్ద ఔట్ డౌర్ జరిగింది.
  • నక్కబొక్కలపాడు అనే పేరు, దొంగరాముడు సినిమాలో అక్కినేని ఊరు పేరు.