నాలెడ్జ్ వాల్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమస్త సమాచారాన్ని ఒక చోట నిక్షిప్తం చేసేందుకు ఇంటర్నెట్ అన్వేషణ సాధనం గూగుల్ సిద్ధమైంది. వెబ్ ప్రపంచంలో ఉన్న మానవ విజ్ఞానాన్ని అంతటినీ ఒక చోటకు తీసుకొచ్చేందుకు నాలెడ్జ్ వాల్ట్ అనే అతిపెద్ద విజ్ఞాన భాండాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలను నాలెడ్జ్ వాల్ట్ అందుబాటులో ఉంచుతుంది. ఈ డేటాను మనుషులతో పాటు సంబంధిత యంత్రాలు కూడా గుర్తించవచ్చు. గూగుల్ వద్ద ప్రస్తుతమున్న విజ్ఞానకోశం పేరు "నాలెడ్జ్ గ్రాఫ్". దీనిలో డేటాను పొందుపరచడం మనుషులకు మాత్రమే వీలవుతుంది. ఈ నేపథ్యంలో దానంతట అదే సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగల ప్రక్రియను చేపట్టాలని గూగుల్ నిర్ణయించి ఒక అల్ గారిథం సాయంతో వెబ్ లో ఉన్న డేటాను వినియోగించుకొని వీలైన రూపంలోకి మార్చుకోగల "నాలెడ్జ్ వాల్ట్" ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతానికి ఈ భాండాగారంలోకి 160 కోట్ల వివరాలు వచ్చాయని "న్యూ సైంటిస్ట్" పత్రిక తెలియజేసింది. 24-08-2014 న న్యూయార్క్ లో ప్రారంభమైన నాలుగు రోజుల సదస్సు "కాన్ఫరెన్స్ ఆన్ నాలెడ్జ్ డిస్కవరీ అండ్ డేటా మైనింగ్" లో గూగుల్ పరిశోధకుడు కెవిన్ ముర్ఫీ, ఆయన సహచరులు ఈ భాండాగారంపై ఒక పత్రాన్ని సమర్పించనున్నారు.

మూలాలు[మార్చు]

  • ఈనాడు దినపత్రిక - 25-08-2014 - (సమస్త సమాచారం ఒకే చోట *'విజ్ఞాన భాండాగారం' ఏర్పాటు చేస్తున్న గూగుల్, *ఆటోమాటిక్‌గా సమాచారం నిక్షిప్తం)