నావిగేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1728 సైక్లోపీడియా నుండి భౌగోళిక, హైడ్రోగ్రఫీ, నావిగేషన్ పట్టిక

నావిగేషన్ అంటే ఎవరైనా ఎక్కడ ఉన్నారో, మరొక ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతులు. హద్దురాళ్ళు కనిపించేటప్పుడు వెళ్ళవలసిన చోటు తెలుసుకోవడం చాలా సులభం కనుక, ఈ పదం తరచుగా వెళ్ళవలసిన చోటు తెలుసుకోవడానికి సులభంకాని ఓడలు లేదా విమానాల వాడక పద్ధతులకు పరిమితం చేయబడింది. నావిగేషన్ అనే పదం 15 వ శతాబ్దంలో "ఓడ" అని అర్ధమునిచ్చే లాటిన్ పదం నావిస్ నుండి, ఇతర ఇండో-యూరోపియన్ భాషల నుండి కనుగొనబడింది. నావిగేషన్ అక్షరాలా "నౌకాయాన ప్రావీణ్యం యొక్క కళ", కానీ 'ఒకరి మార్గాన్ని కనుగొనటానికి' కూడా ఉపయోగించబడుతుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌ (GPS) దీనికి ప్రధాన సాధనం.

అంతరిక్షయానంలో నావిగేషన్

[మార్చు]

ఆధునిక కాలంలో అంతరిక్షయానంలో నావిగేషన్ కొరకు కానోపస్ నక్షత్రాన్ని ఉపయోగిస్తున్నారు. అనుకూలమైన కోణీయదూరం, ఉజ్వలమైన కాంతి కలిగి ఉండటం వలన ఈ నక్షత్రం స్పేస్ నావిగేషన్ కు బాగా ప్రసిద్ధి పొందింది.