నాస్తికులు-ఆస్తికులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాస్తికులు-ఆస్తికులు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన పుస్తకం.

ఆస్తి అయిన జ్ఞానధనమును బట్టి జ్ఞానమున్న వానిని నాస్తికుడు అనీ, జ్ఞానధనము లేనివానిని ఆస్తికుడు అనీ పూర్వము సంబోధించెడువారను క్రొత్త విషయమును తెలియజేస్తూ నిజమైన నాస్తిక ఆస్తికులను తెలియజేయాలంటే మన మెదడుకు పదును పెట్టాలి.

ఈ గ్రంథములో యోగీశ్వరులు సంధించిన " మీరు ఆస్తికులా-నాస్తికులా? " మరియు " మీరు హేతువాదులా-అహేతువాదులా " అను ప్రశ్నలు వాటి వివరణ ఈ గ్రంథమును మరింత సునిశితముగా అర్థము చేసుకొనునట్లు చేయును. అంతేగాకుండా అందరూ ఉపయోగించు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అను పదము యొక్క అర్థమే పూర్తి అసమంజసమని చెప్పుట ఆలోచించదగ్గ విషయం. శరీరంలో పనిచేయు ఆత్మశక్తిని విద్యుశ్చక్తిగా పోలుస్తూ దేవుని ఉనికిని హేతువాదులు సైతం ఖండించలేని విధముగా వివరించిన విధానము ఈ గ్రంథమును తప్పక చదివించి నాస్తికులకు ఆస్తికులకు హేతువాదులకు సరియైన అర్థము తెలుసుకొనునట్లు చేయును.