ప్రబోధానంద యోగీశ్వరులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రబోధానంద యోగీశ్వరులు
This is a photo of Sri Sri Sri Acharya Prabodhananda Yogeeswarulu
ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
జననం ప్రబోధానంద యోగీశ్వరులు
April 5th,1950
వృత్తి రచయిత
ప్రసిద్ధులు శతాధిక గ్రంథ కర్త. ప్రబోధా సేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక, ఖుదాఇస్లామిక్ స్పిరిచ్యువల్ సొసైటీ, సువార్త క్రైస్తవ సంఘం, రావణబ్రహ్మ ద్రావిడ బ్రాహ్మణ సంఘం మరియు ద్రావిడ శ్రేష్ఠి సంఘం ల మూల కర్త.
శీర్షిక ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
మతం ఇందు
వెబ్ సైటు www.thraithashakam.org

ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, అర్ధ శతాధిక గ్రంథకర్త .వీరు చిన్నపొడమల గ్రామం, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లాలో ప్రబోధాశ్రమము, శ్రీకృష్ణమందిరము, ఇందూ జ్ఞాన వేదికను స్థాపించి తద్వారా వారి రచనల్ని, ప్రసంగాలను ప్రచారము చేస్తున్నారు. సమాజమునకు దైవ జ్ఞానాన్ని అందిస్తున్నారు.ఇందూ జ్ఞాన వేదిక జ్ఞానాన్ని మతాలకతీతంగా విశ్వవ్యాప్తంగా అందరికీ అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న సంస్థ. కుల, మత రహిత సమాజ నిర్మాణమునకు, మనుషులందరికీ దేవుడు ఒక్కడేనని పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత, పరిశుద్ధ బైబిల్, పవిత్ర ఖురాన్ లలో వున్న దైవజ్ఞానము ఒక్కటేనని యోగీశ్వరుల సిద్ధాంతము, అదే త్రైతసిద్ధాంతము అని వీరి అభిప్రాయము.


త్రైత సిద్ధాంత భగవద్గీత[మార్చు]

త్రైత సిద్ధాంత భగవద్గీత....578 శ్లోకముల వచన గ్రంథము. సృష్ఠి ఆదిలో దేవునిచే చెప్పబడిన స్వచ్ఛమైన దైవజ్ఞానము ఈనాడు త్రైత సిద్ధాంత భగవద్గీతగా మనకు లభించడము గొప్ప అదృష్టము. భగవద్గీత నిజార్థము, పరమాత్మ, ఆత్మ, జీవాత్మలనబడు మూడు ఆత్మల సవివరము సులభశైలిలో కొద్దిపాటి చదువు కల్గినవారు సైతము చాలా సునాయాసముగా అర్థము చేసుకొను విధముగా తీర్చి దిద్దబడింది. పూర్తి శాస్త్రబద్దమై, ఎటువంటి హేతువాద ప్రశ్నకైనా సరియైన సమాధానము లభించు ఏకైక గ్రంథ రాజము త్రైత సిద్ధాంత భగవద్గీత.

సూచన: త్రైత సిద్ధాంత భగవద్గీతా పాఠకులు ముందుమాటను తప్పనిసరిగా చదువుట వలన అతిముఖ్యమైన విషయములు బోధపడగలవు.

మానవాళికి అత్యంత అవసరమైన సమాచారముతో కూడుకొనియున్న ప్రప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. ఈ గ్రంథము లోని సాంఖ్యయోగము విజ్ఞాన శాస్త్రవేత్తలకే పెను సవాలు విసరగలదు అంటే అతిశయోక్తి కాదు. సామాన్య శాస్త్రములకందని జ్ఞానము విజ్ఞాన సహితముగా ఈ గ్రంథమునందు పొందుపరచడము జరిగింది. త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథములో వివిధ యోగములైన కర్మ, బ్రహ్మయోగముల గూర్చి ఎంతో వివరముగా మరియు ఏ పాండిత్యము లేని పామరులకు కూడా సులభముగా అర్థమవులాగున రచించడము జరిగింది.ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత - అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతములను అధిగమించి, సృష్టిలోని మూడు ఆత్మలు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలను ఆధారము చేసుకుని రచింపబడిన మహాశక్తివంతమైన గ్రంథరాజమే ఈ బ్రహ్మవిద్యాశాస్త్రమైన త్రైత సిద్ధాంత భగవద్గీత.

భగవద్గీత ఒక మత గ్రంథము కాదు. ప్రపంచ మానవ ధర్మాన్ని తెలియజేసే ఒక సంపుటము. ఈ సృష్టిలో ప్రతి మానవునికి భగవద్గీత ఒక మంచి దైవ మార్గమును నిర్దేశించు గురువులాంటిది. త్రైత సిద్ధాంత భగవద్గీత ముగ్గురు పురుషులైన క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అనగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గురించి ఎంతో గొప్పగా వివరించడము జరిగింది. త్రైత సిద్ధాంత భగవద్గీతలో 17 అధ్యాయములు ఉన్నాయి. ఇతర భగవద్గీతల యందు గమనించితే 18 అధ్యాయములు ఉన్నాయి. మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగము ఇక్కడ చెప్పడము జరుగలేదు. ఎందుకు అనగా భగవద్గీత యందు భగవంతుడు చెప్పిన ధర్మాలను గూర్చి మాత్రమే చెప్పవలసి ఉండును. అందుచేత త్రైత సిద్ధాంత భగవద్గీత, సాంఖ్య యోగము నుండి ప్రారంభించడము జరిగింది.

"రాజ విద్యా రాజ గుహ్య యోగము" 8వ అధ్యాయములో భగవంతుడు చెప్పిన రహస్యమైన జ్ఞానమును ఎంతో సరళముగా మరియు ఎంతో వివరముతో వ్రాయడము జరిగింది. బ్రహ్మ విద్య అతి రహస్యమైనదని, ఇంత రహస్యమైన జ్ఞానమును అనుభవ పూర్వకముగా మరియు విజ్ఞాన పూర్వకముగా త్రైత సిద్ధాంత భగవద్గీతలో తెలియడము వలన, మానవుడు కర్మల నుండి విముక్తుడై మోక్షము పొందవలెనను ఉద్దేశముతో వ్రాయడము జరిగింది. పరమాత్మ అణువణువునా అన్నింటి యందూ లోపలా మరియు బయట వ్యాపించి ఉన్నాడు అని, ఆత్మ శరీరము అంతా వ్యాపించి ఉన్నాడు అని, జీవాత్మ ఒక చోట భ్రూమధ్య స్థానములో సూది మోపునంత జాగాలో ఉన్నాడు అని, పరమాత్మ లేని వస్తువు కాని, జీవ రాశి కాని ఈ జగత్తులో లేదు అని ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారా తెలియబడుతుంది.

భూమి మీద గల జీవరాసులలో మనిషి అన్నింటికంటే ఎక్కువ బుద్ధి బలము కలవాడు అని, ఈ నాటి మానవుని బుద్ధికి ఆధ్యాత్మిక విషయములలో పూర్తి స్థాయి అవగాహన లేకుండా పోవుచున్నదని, మానవునికి అతి ముఖ్యమైన శాస్త్రము మరియు యోగశాస్త్రము అయిన "భగవద్గీత" అని దీనిని ప్రతి ఒక్కరు తెలుసుకోవలెనని తెలుపుచున్నది. బ్రహ్మ విద్యా శాస్త్రమైన భగవద్గీత జన్మ రాహిత్యమును గూర్చి తెలుపుతుంది. ఇటువంటి కాలములో కూడా గీత అంటే ఏమిటి? గీతా సారాంశమేమిటి ? అని యోచించు వారు కలరు. అలా యోచించు వారికి ఇంతవరకు ఉన్న గీతలలోని భావములలో ఎన్నో లోపములు కనిపించగా, వాటిలోని సత్యమెంత అని అన్వేషించువారికి త్రైత సిద్ధాంత భగవద్గీత ఒక చక్కని సమాధానములు ఇవ్వగల గొప్ప గ్రంథముగా నిలువగలుగుతూ మరియు ఈ గ్రంథము చదువు వారికి దైవ జ్ఞానములో ఒక్క ప్రశ్న కూడా మిగులకుండా సమాధానమును ఇవ్వగల స్తోమత కలిగి ఉంది.

ఆధ్యాత్మిక ప్రశ్నలు - జవాబులు[మార్చు]

1030 ఆధ్యాత్మిక ప్రశ్నలకు జవాబులు గల గ్రంథం. 'ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు' శ్రీశ్రీశ్రీ ఆచార్యప్రబోధానంద యోగీశ్వరులు ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు, జవాబులు గురించి అన్వేషిస్తున్న మానవుల గురించి రచించిన తెలుగు గ్రంథం. ఇది మహా వివరణాత్మకమైనది. ఆధ్యాత్మికము అను పదమునకు శాస్త్రబద్ధమైన అర్థము దొరకక, ఆధ్యాత్మికత చిరునామాకై వెదకి విసిగి వేసారిన జిజ్ఞాసులకు ఎట్టకేలకు లభించు స్వచ్ఛమైన ఆధ్యాత్మిక నిధియే ఈ గ్రంథము. ఆత్మను అధ్యయనము చేయడమే ఆధ్యాత్మికము అన్న సంగతి యోగీశ్వరుల వారి రచనలు చదివిన వారికి మాత్రమే అర్ధము అవుతుంది. వారు సమాజానికి ఎదురాడని దైవ జ్ఞానాన్ని అంటే జవాబు లేని ప్రశ్న అంటూ లేని జ్ఞానాన్ని అందిస్తున్నారు.

ప్రశ్నలు అడుగరాదను నియమమును విధించు, ఆచరించు స్వామీజీలు, పీఠాధిపతులు, భగవానులు రోజుకొకరు చొప్పున పుట్టుకొస్తున్న ఈ సమాజములో ఆధ్యాత్మిక రంగమునకు సంబంధించిన ఎటువంటి ప్రశ్నకైనా సమాధానము చెప్పగల్గిన, ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవలసిన గ్రంథమే ఆధ్యాత్మిక ప్రశ్నలు` జవాబులు.ఈ గ్రంథం లో 1886 నుండి 2006 వరకు ఎంతో మంది ఆధ్యాత్మికులు, యోగీశ్వరుల వారిని అడిగిన 388 ప్రశ్నలు పొందుపరచబడ్డాయి.ఆ ప్రశ్నలకు యోగీశ్వరుల వారు జవాబులు ఇవ్వడమే కాకుండా, వారే స్వయముగా తయారు చేసిన 642 ప్రశ్నలకు జవాబులు కూడ ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి.

ఈ గ్రంథము పాఠకులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడమేకాక, వారి ఊహకు అందని ప్రశ్నలను సృష్టిస్తూ, సంధిస్తూ నిజమైన ఆధ్యాత్మిక ప్రశ్నలకు నిర్వచనమిస్తూ, ఒకే ఒక్క వాక్యములో జవాబును మరియు దానికి తగిన వివరము ఇవ్వడము ఈ గ్రంథము యొక్క ప్రత్యేక ఆకర్షణ. ఈ గ్రంథములో మొదటి భాగమున ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలు, రెండవ భాగమున రచయిత యోగీశ్వరుల యొక్క సంచలనాత్మక ప్రశ్నలు, జవాబులు కలవు. ఈ గ్రంథము పరిపూర్ణముగా అవగాహన చేసుకొన్న పాఠకులు నిజమైన ఆధ్యాత్మికవేత్తలుగా మారగలరనునది అక్షర సత్యము.

ఈ గ్రంథములో ముఖ్యముగా ఎంతో మంది తమ జీవితములో తమ మదిలో మెదిలిన ప్రశ్నలకు సమధానము ఎక్కడా దొరకక పొయినటువంటి వారిలో కొందరు జ్ఞాన జిజ్ఞాసులు అడిగిన ఆధ్యాత్మిక ప్రశ్నలకు ఎంతో వివరముగా సమాధానము ఇక్కడ తెలియబడుతుంది. ఈ గ్రంథములో మనకు ముందు చెప్పునది ఏమనగా "హేతువాదము" అంటే ప్రశ్నలు అడగడము అని, అలాగే వాటికి సమాధానము చెప్పడమును "ప్రతివాధము" అని తెలియబడుతుంది. ఈ గ్రంథము చదువు పాఠకులు తనను ఇతరులు అడుగు ఎలాంటి ఆధ్యాత్మిక ప్రశ్నకయిన సమాధానము చెప్పు స్తోమతను పొందగలుగుతారు.

ధర్మము - అధర్మము[మార్చు]

మనిషి శరీరములో ఆరు మంచి గుణములు. ఆరు చెడు గుణములు ఉన్నాయి. చెడు గుణముల వలన జరుగు కార్యముల ఫలితముగా పాపము వచ్చుచుండును. అలాగే మంచి గుణముల వలన జరుగు కార్యములకు ఫలితముగా పుణ్యము వచ్చుచుండును. ఈ విధముగా మంచి,చెడు గుణముల వలన వచ్చు పాప-పుణ్యములు మనిషి తలయందు చేరి తర్వాత జన్మలో కష్ట-సుఖముల రూపములో అనుభవమునకు వచ్చును. మనిషి తలలో గుణచక్రములో చెడు గుణములు ఆరు వరసగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అనునవి ఉన్నాయి. అలాగే మంచి గుణములు వరసగా దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమ అనునవి ఉన్నాయి. మంచి గుణములతో జరపబడు కార్యములకు, దేవుని ధర్మములకు గల వ్యత్యాసము ప్రపంచములో తెలియకుండా పోయింది. అలాగే చెడు గుణములతో జరపబడు కార్యములకు, అధర్మములకు తేడా తెలియకుండా పోయింది. నీతి-అవినీతి, న్యాయము-అన్యాయము ప్రపంచ సంబంధము, అవి జీవుల కర్మ ప్రకారము అనుభవానికి వస్తాయి. జ్ఞానము, ధర్మము పరమాత్మ సంబంధము. వేదాధ్యయనము, యజ్ఞములు, తపస్సులు, దానములు తిరిగి జన్మకు తీసుకుపోతాయని అవి మోక్ష మార్గమునకు వ్యతిరేకమని ఉధ్బోధించారు.దేవుని చేరు ధర్మ మార్గములు బ్రహ్మ యోగము, కర్మ యోగము, భక్తి యోగము మాత్రమే నని ఈ గ్రంథములో తెలియచేసారు.

ఒక పదార్ధాన్ని గుర్తించుటకు (తెలియుటకు), దానికి వుండే శాశ్వత స్వభావమును ధర్మం అనవచ్చును. ఏదైనా కనిపించే లేక కనిపించని వాటిని గుర్తించుటకు వాటి ధర్మములను తెలియుట తప్పనిసరి. శాశ్వతమైన ధర్మములను తెలియుట వలన వాటిని గుర్తించవచ్చు. మార్చి చెప్పబడ్డ అధర్మముల వలన వాటిని గుర్తించడంలో పొరపాటు జరుగును. అయితే విశ్వంలో భౌతిక, అభౌతికాలలో - అభౌతికం ఎక్కువ శాతం వుండగా, అన్నింటికన్నా ముఖ్యమైన వాడు, పెద్ద అయిన దేవుని ధర్మములను ఈ గ్రంథం ద్వారా రచయిత తెలియ చేసారు."దేవుని జ్ఞానము దేవునికి తప్ప, ఏ ఇతర మానవులకు తెలియదు" [1] అన్న దైవ గ్రంథ వాక్య ప్రకారము దేవున్ని ఎవరూ చూడలేరు కనుక ఎవరికీ ఆయన ధర్మములు తెలియవు. కనుక విశ్వమంతా అణువణువునా వ్యాపించి వున్న దేవుడు తన ధర్మములను తెలియచేయుటకు మానవరూపం ధరించి అనగా భగవంతునిగా వచ్చి దైవ ధర్మములను తెలియచేయును. ఆ విధముగా భగవంతుడు మూడుమార్లు వచ్చి ధర్మములను తెలిపితే, అప్పటికి దానిని దేవుని జన్మగా పరిగణించ వచ్చని ఈ గ్రంథంలో తెలిపారు. దేవుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా జన్మించి భగవద్గీత రూపంలో, తర్వాత కలియుగములో ప్రభువుగా జన్మించి సువార్తల రూపంలో దైవ ధర్మములను తెలియచేశారు. ఇంకొకమారు భగవంతుని రాకతో దేవుని జన్మ పరిపూర్ణము అగును.[2][3][4] ఆ రాక ఈ సమయంలో జరిగి ధర్మసంస్థాపన పరిపూర్ణము అగును అని రచయిత అభిప్రాయము.

ఈనాటి సమకాలీన సమాజములో దైవ ధర్మములు ఏవో సరిగ్గా తెలియకపోవడము వలన, ఏవైతే అధర్మములు అని దేవుడు భగవద్గీతలో తెలిపారో వాటినే దైవ మార్గములుగా ఎంతో మంది గురువులు ప్రజలకు బోధించి వారిని అజ్ఞాన మార్గములో నడిపిస్తున్నారని రచయిత వారి బోధలను ఈ గ్రంథం ద్వారా ఖండించడం జరిగింది. భగవద్గీతలో భగవంతుడు తెల్పిన 4 అధర్మములు [5] ఏవనగా వేదాధ్యయనం, తపస్సులు, దానములు, బాహ్యయజ్ఞములు. వీటి ఆచరణ వల్ల మోక్షం లభించదు. మానవునికి కర్మ ఉంటే జన్మ ఉంది. పై అధర్మ ఆచరణ వల్ల పుణ్య కర్మ లభించును. దీని వల్ల జీవుడు మరల మరల జన్మించవలసి వచ్చి మోక్షమునకు అనగా దేవునకు దూరమైపోవును. కలియుగములో మతము అను మరొక అధర్మము[6] తయారు అయ్యి మనుషులను దేవునికి దూరము చేస్తోంది అన్న రచయిత అభిప్రాయము, వాస్తవము కూడా.

దేవున్ని తెలియదగు ధర్మములు మూడు ఉన్నాయి. అవి కర్మ యోగము[7], బ్రహ్మ యోగము[8], భక్తి యోగము[9]. వీటి గూర్చి అర్థమయినచో అవి అధర్మ ఆచరణ కంటే సులభ సాధ్యమైనవి[10]. బ్రహ్మ, కర్మ, భక్తి యోగాలు ఆచరించుట వల్ల జ్ఞాన శక్తి లభించి, కర్మలు దహించి వేయబడి[11] జీవుడు ఆఖరీమరణం పొంది మోక్షము పొందునని రచయిత భగవద్గీత ఆధారముగా తెలియచేయడమైనది. స్థూల, సూక్ష్మ శరీరముల వివరము, మూడు ఆత్మల వివరము తెలిసిన వారు మాత్రమే యోగమాచరించగలరనీ, మోక్షము పొందడానికి ఈ మూడు యోగములలో ఏ యోగమైనా అనుసరణీయమనీ[12] రచయిత తెలిపారు.

ధర్మాచరణ వల్ల మోక్షం కలుగుతుంది. అధర్మాచరణ వల్ల పుణ్యం, మరియు ధర్మ వ్యతిరేక కార్యముల వల్ల భయంకరమైన పాపము లభించును. దేవుని పరిపాలన యంత్రాంగము అయిన గ్రహములు, మహాభూతములు ధర్మ వ్యతిరేకులను శిక్షించుననీ[13][14] ఈ గ్రంథములో వివరణ ఉంది.

ఇందుత్వము ను కాపాడుదాం[మార్చు]

దేవుడు సృష్ట్యాదిలోనే చెప్పిన తన ధర్మము ఇందూ ధర్మము. ఇందుత్వమనగా దైవత్వము. ఏ మతములోనున్న వాడైనా ఇందుత్వమును తెలుసుకొని ఇందువుగా బ్రతికితే చనిపోయిన తర్వాత ఇందుత్వము లోనికి (దైవత్వము) చేరిపోగలరు.మన దేశంనకు ఇందూదేశమని పేరు.దేవుని జ్ఞానమునకు దూరం చేసేవి మతాలకు,కులాలు.సృష్టిలో దేవుడు మనుషులందరిని ఒకే విదంగా సృష్టించాడు.కాని మనుషులు మాత్రం దేవుని ఒక మతమునకు పరిమితము చేసి ఒకే విదముగా చూడలేకపోతున్నారు.దైవ జ్ఞానము మీద శ్రద్ధ కలిగి దానిని తెలుసుకుంటున్న వారు ఏమతములో ఉన్నా ఇందూవులే.దేవుడు సృష్ట్యాదిలోనే చెప్పిన తన ధర్మము ఇందూ ధర్మము. భూమిమీద ఎన్ని మతములు వచ్చినా మొదట సృష్ఠిని తయారు చేసిన దేవుడు మారడు. అట్లే అతని ఇందూ ధర్మమూ మారదు. ఈ గ్రంథములో ఇందుత్వము అను పదమునకు అర్థము తెలియచేయుచూ, ద్వాపర యుగము చివరలో భగవద్గీత ద్వారా భగవంతుడు తెలియజేసిన ధర్మమునే మిగిలిన మత గ్రంథములలో చెప్పబడినవనీ అందువలన, ఇందుత్వమనగా దైవత్వమనీ, ఈ గ్రంథము చదివిన తరువాత ఏ మతములోనున్న వాడైనా ఇందుత్వమును తెలుసుకొని ఇందువుగా బ్రతికితే చనిపోయిన తర్వాత ఇందుత్వము లోనికి (దైవత్వము) చేరిపోగలరనీ తెలియగలదు.

దేహి భాషలందు తెలుగు లెస్స అన్న విషయము ఈ గ్రంథం చదవడం ద్వారా తెలుస్తుంది. తెలుగు ఇప్పటి భాష కాదు, కృత యుగము నాడే ఈ భాష వున్నది అని, ఆనాడే భారతదేశములోని వారంతా తెలుగు మాట్లాడే వారని,"తెలుగు బాష" పుట్టుక, తెలుగు భాష యొక్క గొప్పతనము ఆధ్యాత్మిక రీతిలో గ్రంథకర్త సంచలనాత్మకంగా వివరింఛారు. పూర్వపు మన దేశ చరిత్రను,మన దేశంనకు ఇందూదేశమని పేరు ఎప్పటి నుంచి ఎలా వచ్చినది, అసలు ఇందూ అనే పదానికి హిందూ అనే పదమునకు ఉన్న తేడాను, సూర్యవంశం, చంద్రవంశం అంటే ఎమిటి? మరియు వారి జీవన విధానం ఎలా ఉండేది అనెది ఈగ్రంధంలో వివరించబదినది. ఈ గ్రంథములో ముఖ్యముగా దేవునికి, అతని జ్ఞానమునకు మాత్రమే విలువనిస్తూ దేవుని జ్ఞానమునకు దూరం చేసే మతాలకు,కులాలుకు ఏమాత్రం ప్రాదాన్యతనివ్వకుండా, సృష్టిలో దేవుడు మనుషులందరిని ఒకే విదంగా సృష్టించాడని,కాని మనుషులు మాత్రం దేవుని ఒక మతమునకు పరిమితము చేసి ఒకే విదముగా చూడలేకపోతున్నారని, దానికి కారణం మనిషికి దేవుని "ధర్మాలకు,అధర్మాలకు" తేడా తెలియక పోవడమేనని తెలిపినది. ప్రస్తుత పరిస్థితులలో మత మార్పిడి చాలా పెరిగిపోయింధని దానికి కారణం ఎవరి మతములోని దేవుని జ్ఞానము,దర్మాలు వారికి అర్ధముకాలేదని పలు ఉదాహరణలతో ఈ గ్రంథంలో వివరించబదినది. నేటి సమాజంలో ముఖ్యముగా మూడు మతాలున్నాయని అందులో హిందూ మతములోనే ఒకరి సిద్దాంతాలు ఆచరణలపై మరొక సిద్దాంతపరులకు విబిన్న అబిప్రాయాలు ఉండడం వలన హిందూవులు ఒకరి పై మరోకరు హింసకు పాల్పడుతున్నారని దీని మూలముగానే హిందూ మతము క్షిణించి పోతున్నదని "గ్రందకర్త ఆచార్యప్రబోధానంద యోగీశ్వర్లు" వారు వివరించడం జరిగింది.

సమాజములో మనుషులకు దేవుని జ్ఞానము తెలియక గుణాలలో చిక్కుకుని ఘోరమైన కర్మలను అనుభవిస్తున్నారని, ప్రజలకు గుణాలనుండి కర్మల నుండి బయటపడి చేరు మోక్షమార్గానికి ఒక కథను ఉదాహరణగా చేసి,ఆకథలో కూడా ఎంతో గోప్పదైన దైవ రహస్యమును తెలియజేసి,మూడు మతముల ప్రజలు ఒకే దేవుని అంశకలవారని చెప్పిన విధానం సంచలనాత్మకంగా,విప్లవాత్మకముగా ఉంటుందని పాఠకులు గుర్తించగలరు. అంతేకాకుండా మేము జ్ఞానులము,పరమాత్మ సంతతిగా ఉన్నామని తెల్పేందుకు గుర్తుగా వారి పేరుకు ముందుగా "ఇందూశ్రీ" అనెడి పదమును ఉంచుకొనెడివారని కాలక్రమేణ దాని అర్దం ఎవరికి తెలియకుండా పోయిందని,అదే విధముగా మానవుడు ఎన్నో విషయాలలో దేవునిని మరచిపోతున్నాడని గ్రంథకర్త ఆచార్యప్రబోధానంద యోగీశ్వర్లు వారు గుర్తు చేసారు.చివరిగా ఎవరైతే దైవ జ్ఞానము మీద శ్రద్ధ కలిగి దానిని తెలుసుకుంటున్నారో వారు ఏమతములో ఉన్నా ఇందూవులేనని ఈ గ్రంథం తెలియజెప్పినది. ఈ గ్రంథము చివరిలో ‘‘గ్రహించుకొనువారికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేము’’ అను వాక్యము ఆలోచింపదగినది.

దయ్యాలు - భూతాల యదార్థసంఘటనలు[మార్చు]

దయ్యాలు వాస్తవము.ఒక మనిషి శరీరములో అవలీలగ చేరగలవు.ఒక దయ్యము మనిషి శరీరములో చేరి కష్టాలపాలు చేసినపుడు ఆ కష్టాలనుండి బయటపడుటకు బయటి చట్టాలు పనికిరావు.స్వచ్ఛమైన దైవజ్ఞానము ఒక్కటే పరిష్కారము." అకాల మరణము" పొందినవాడు మాత్రమే సూక్ష్మంగా దయ్యముగా బ్రతకవలసి వస్తుంది.దేవతలు జంతు బలి ఎందుకు కోరుతారో మరియు దేవతల వద్ద ఉంచిన నైవేద్యం రూచిని ఎందుకు కోల్పోతుందో తెలియజేసారు. స్థూల,సూక్ష్మ శరీరముల వివరమును జీవుడు స్థులశరీరం విడిచిన తరువాత సూక్ష్మ శరీరంతో అనుభవించు అనుభూతులను మరియు జీవన శైలిని ఈ గ్రంథం వివరించింది.కనిపించని పాలన ఉంది.కనిపించని ప్రభుత్వంనకు రాజు{ప్రభువు} దేవుడు. పాలకులు మహాభూతాలు,స్వల్పభూతాలు,ఉపభూతములు,గ్రహములు.అవి ధనిక పేద భేదములు లేకుండా స్వచ్ఛమైన పాలనతో స్వర్గ సుఖములను,నరకబాధలను జీవులకు అనుభవింపచేయుచున్నవి. స్వర్గ,నరక లోకములు ఎక్కడో లేవు.అవి భూమి పైనే ఉన్నాయి.ఇతర జీవరాశులు కుడా అకాల మరణాన్ని పోందడంవలన సూక్షాలుగా{దయ్యములుగా}బ్రతుకుచున్నవి.అవి మానువుని శరీరంలో ప్రవేశించినపుడు మనిషి అదే జంతువువలే ప్రవర్తిస్తాడు. మనిషికి వచ్చే కొన్ని రకములైన నొప్పులు మందులతో నయంకాకపోవుటకు కారణం అవి దయ్యముల వలన వచ్చినవి. మేఘములు భూతములని అవి దేవుని పరిపలనలో బాగమని మరియు మేఘములు వర్షపు నీటితో పాటు జీవులను[కప్పలు,చేపలుమొదలగునవి] విడిచిపెట్టుటకు గల కారణంను,మేఘములు చేయు అద్భుతమైన కార్యములను తెలియజేయడమైనది. ఖగోళంలో ఉన్న గ్రహాలు భూమి పై రోగములను వ్యాపింప చేయుచున్నవి.భూమి పై ప్రకృతి వైపరిత్యాలకు భూతములు, గ్రహాములకు సంబంధమున్నది.

త్రైత సిద్ధాంతము[మార్చు]

త్రైతము అనగా మూడు. సృష్టి ఆది నుండి సర్వ జీవరాశులలో పరమాత్మ మూడు ఆత్మలుగా ఉన్నాడని, ఆ మూడు ఆత్మల వివరమును సిధ్ధాంత పరముగా వివరించునదే ఈ త్రైత సిధ్ధాంతం[15]. నీవు అయిన జీవునికి పరమాత్మ అయిన దేవునికి మద్యవర్తిగా ఉండి శరీరాన్ని ఆడించున్న శక్తి ఆత్మ.పరమాత్మ అణువణువునా విశ్వమంతా అన్నింటి యందూ లోపలా మరియు బయట వ్యాపించి ఉన్నాడు, ఆత్మ శరీరము అంతా వ్యాపించి ఉన్నాడు, జీవాత్మ శరీరములో ఒక చోట భ్రూమధ్య స్థానములో సూది మోపునంత జాగాలో ఉన్నాడు, పరమాత్మ లేని వస్తువు కాని, జీవ రాశి కాని ఈ జగత్తులో లేదు.అద్వైతం,విశిష్టాద్వైతం,ద్వైతం లాగానే త్రైత సిధ్ధాంతం పరమాత్మ జ్ఞానాన్ని తెల్పుతున్నది. వైష్ణవుల నిలువునామములు, శైవుల మూడు అడ్డనామములు, ద్వైతుల బొట్టు, త్రైతుల బ్రహ్మ,కాల,కర్మ, చక్రముల సమాచారము, సర్వ జీవరాశుల నుదిటి భాగంలో సూక్ష్మంగా ఉన్న బ్రహ్మ,కాల,కర్మ,గుణ చక్రముల అమరికను,జీవునికి వాటికి గల సంబంధాన్ని వివరించింది. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అను మూడు ఆత్మల విధానమే త్రైతము.ఈ విధానమే భగవద్గీత, బైబిలు మరియు ఖురానులలో కలదని వివరించబడింది.త్రైత సిద్ధాంతమునకు ఆధారములు:-

* భగవద్గీత గ్రంథము పురుషోత్తమప్రాప్తి యోగము అధ్యాయము 16,17 వ శ్లోకములు.

* బైబిల్ గ్రంథము మత్తయి సువార్త 28 వ అధ్యాయము 19 వ వచనము.

* పవిత్ర ఖుర్-ఆన్ గ్రంథము 50 వ సుర (ఖాఫ్),21-22 ఆయతులు.

సత్యాన్వేషి కథ[మార్చు]

ప్రస్తుత కాలంలో దైవమార్గం పేరిట జరుగుతున్న మోసాలను ఎండగట్టే విధముగా, కళ్ళకు కట్టినట్లు, సమకాలీన సమాజానికి తెలియని ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను, సత్యాలను రాఘవ అనే సత్యాన్వేషి పాత్ర ద్వారా ఈ సత్యాన్వేషి కథ[16]లో వివరించే ప్రయత్నం చేశారు రచయిత. రాఘవ సత్యాన్వేషణలో భాగంగా, తాను ఎవరు? దేవుడు ఎవరు? దైవ జ్ఞానం అంటే ఏమిటి? నిజమైన గురువు ఎవరు? ఆశ్రమములు ఎందుకు స్థాపించారు? దైవజ్ఞానం తెలియజేయు ఆశ్రమము ఏది? అని తలెత్తిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఆధునిక సమాజంతో విసిగి, అడవికి చేరిన రాఘవకు ఆటవికుల ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. "వ్యాఘ్రశత్రువు" అనే వృక్షం నీడలో పులి నిలువలేదని, దాని మూలిక ద్వారా ఆటవికులు తమను పులుల నుండి కాపాడుకుంటారని తెలుస్తుంది. ఇంతవరకు మనకు తెలియని నాగులకట్ట, నాగులచవితి యొక్క ప్రాధాన్యత మరియు పాముకాటుకి విరుగుడు ఔషధంగా రావి,వేప ఆకులు ఏవిధంగా ఉపయోగపడతాయో తెలుస్తుంది.

అడవిలో తారసబడ్డ మహర్షి ఆదేశం మేరకు ఆనందాశ్రమం చేరతాడు రాఘవ. ఆనందాశ్రమం లోని గురువైన రాజయోగనందాస్వామి మరియు రాఘవకు మధ్య జరిగే సంభాషణలలో ఆసక్తికరమైన విషయాలు, ఎన్నో సైన్స్ కందని ఆధ్యాత్మిక రహస్యాలు పాఠకులకు తెలుస్తాయి. సన్యాసులు కాషాయ రంగు వస్త్రములు ధరించడం వెనుక గల కారణం, నిజమైన సన్యాసి ఎవరు?, పరమాత్మ విద్య-ప్రకృతి విద్యలకు గల తేడా, మోక్షం అంటే ఏమిటి? దాని కోసం మనం ఎందుకు ప్రయత్నించాలి? అనే రాఘవ ప్రశ్నలకు శాస్త్రబద్ధమైన సమాధానాలు దొరుకుతాయి. యోగుల పట్ల, యోగీశ్వరుల పట్ల అమర్యాదగా మాట్లాడి, దురుసుగా ప్రవర్తించిన వారికి క్షమించరాని పాపం వస్తుందని ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది. అంజనము అంటే ఏమిటి? దానిని ఎలా తయారుచేస్తారు మరియు అంజనము ఏ విషయములు తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు? అంజనము చూడటానికి గల నియమాలు ఏమిటి? అనే విషయాలు తెలుస్తాయి.

గజకర్ణ-గోకర్ణ,ఇంద్రజాల-మహేంద్రజాల,టక్కుటమారా విద్యలు[17] ఈగ్రంథం ద్వారా మనకు పరిచయం అవుతాయి. ఎన్నో మహత్యములు చేయు బాబాలకు కూడా ఆ మహత్యములు ఎలా జరుగుచున్నవో తెలియక రహస్యముగా మిగిలిపోయినవనీ వాటిని రచయిత ఈ కథ ద్వారా తెలియజేయడం గమనార్హం. ఈ విద్యలను నేర్చుకున్న బాబాలు,స్వాములు మొదలైన వారు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ఈగ్రంథం ద్వారా తెలుస్తుంది. అలాగే మాంత్రికులు తమ వశంలో ఉన్న దుష్టశక్తులు (పిశాచాల)తో ఏవిధమైన పనులు చేయించుకుంటారో తెలుస్తుంది. అదే విధంగా ఇద్దరు మాంత్రికుల మధ్య జరిగిన మోడి[18] విద్యను (మంత్రముల యుద్ధంను) 6 పటముల ద్వారా చూపించడమైనది. తద్వారా పాఠకులకు ప్రత్యక్షంగా ఆ మోడి చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అష్టగ్రహకూటమి అంటే ఏమిటి? అష్టగ్రహకూటమి ప్రభావం వలన జరుగు ప్రకృతి వైపరీత్యాలు మరియు ఆసమయంలో చెలరేగు ప్రకృతి వినాశక శక్తులు గురించి వివరించడం జరిగింది. సత్యాన్వేషి కథ ఎన్ని మలుపులు తిరిగినా అణువణువున దైవజ్ఞానం మరియు ప్రపంచానికి తెలియని రహస్యములు తెలియజేయబడ్డాయి.ఈ కథ రాజయోగనందస్వామి మరియు తపస్విబాబా మధ్య జరిగిన పోరాటంలా కనిపించినప్పటికి, ఇది కనిపించని పరమాత్మ మరియు మాయ (సాతాను/సైతాను) మధ్య జరుగుతున్న ఆటగా సత్యాన్వేషులకు అర్థం అవుతుంది. ఎటువంటి మాయా శక్తులు అయినా యోగశక్తి ముందు నిలువలేవనీ, అది సంపాదించుట కొరకు దైవ (ఆత్మ)జ్ఞానం అవసరమనీ, అది బ్రహ్మవిద్యలో వున్నదనీ తెలియబడుతుంది. ఈ కథలో జరుగు సన్నివేశములు కల్పితమైనా అందులోని సారాంశము మాత్రము నూటికి నూరు శాతం సత్యము అని గ్రంథకర్త పేర్కోనడం గమనించదగ్గ సూచన .

స్వర్గము ఇంద్రలోకమా!నరకము యమరాజ్యమా!![మార్చు]

స్వర్గ-నరకము[19] ల గురించి మానవాళికి ఉన్న అపోహలు ఈ గ్రంథం చదవడం ద్వారా తొలగిపోతాయి. లోకము అనే పదము ఏకము అనే పదము నుండి పుట్టినదనీ, లోకము అనగా దానిలో "అనేకమున్నాయి"అనే సరైన అర్ధము గ్రంథకర్త వివరించడం జరిగింది. స్వర్గలోకము,నరకలోకము అనే పేర్లు ఎలా వచ్చాయి? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎప్పుడు ఉంటాయనే ప్రశ్నలకు జవాబులు ఈగ్రంథం ద్వారా పాఠకులకు తెలియబడతాయి. భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ గ్రంథాలలో స్వర్గ నరకముల ప్రస్థావనను ఏవిధంగా అపోహ పడుతున్నారో ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది. గ్రంథకర్త ముస్లిం మరియు హిందూ మతగురువులతో స్వర్గ-నరకములను గురించి చర్చించిన సంబాషణలను గ్రంథస్థం చేయడమైనది. తద్వారా మతగురువులకు స్వర్గ-నరకముల పై వారికి గల అభిప్రాయాలు మరియు సందేహాలు వాటికి్ గ్రంథకర్త తెలియజేసిన జవాబులు పాఠకులకు తెలియబడతాయి. జీవుడు(మానవుడు) గత జన్మలలో చేసుకున్న పాపాలే తర్వాత జన్మలలో కష్టాలుగా అనగా నరక బాధలుగా జీవుడు(మానవుడు) అనుభవిస్తున్నాడని అదేవిధముగా గత జన్మలలో జీవుడు (మానవుడు) చేసుకున్న పుణ్యములే తర్వాత జన్మలలో సుఖములుగా అనగా స్వర్గసుఖములుగా జీవుడు(మానవుడు) ఈ లోకములోనే అనుభవిస్తున్నాడని వివరించడమైనది.

శరీరమే యముని రాజ్యమని,ఆత్మయే యమ ధర్మరాజుయని, చిత్రంగా-గుప్తంగా(రహస్యంగా)శరీరంలో ఉండే ఆత్మే చిత్ర గుప్తుడుగా వ్యవహరిస్తూ జీవుని పాప, పుణ్యాలను లెక్కించి కర్మపత్రంలో చేరుస్తుందనీ, శరీరం బయటనుండి కలుగు బాధలే యమకింకర బాధలని మనకు అర్ధమవుతుంది. శరీరమనే లోకములో యముని పాత్రను, ఇంద్రుని పాత్రను శరీరంకు అధిపతియైన ఆత్మే వహిస్తుందనే సంచలనాత్మక విషయమును గ్రంథకర్త ఉదాహరణతో వివరించడమైనది. క్షమించరాని పాపం,క్షమించరాని పుణ్యం అంటే ఏమిటి? వాటి వలన కలుగు ఫలితాలను ఈ గ్రంథంలో తెలియజేయడమైనది.దేవుని పేరిట ఇతర మతాల వారిని హింసించడం "పవిత్రయుద్ధం" కాదని, దాని ద్వారా స్వర్గం లభించదని, మనకున్న చెడుగుణములతో పోరాడి దేవుని జ్ఞానమును తెలుసుకోవడమే పవిత్రయుద్ధమని దాని ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుందనే ముఖ్యమైన (సారాంశమైన) విషయం గ్రంథకర్త తెలియజేయడమైనది.

తెలుగు భాష గురించి[మార్చు]

"మొత్తము దేశములో లిపియున్న భాషలలో తెలుగు గొప్పది.‘‘దేశభాషలలో తెలుగు లెస్స’’ తెలుగు భాషలోనున్న అక్షరములు మరి ఏ ఇతర భాషలోనూ లేవు. అందువలన ఏ శబ్దమునైన సులభముగా ఉన్నదున్నట్లు వ్రాయవచ్చును. దురదృష్టవశాత్తు దక్షిణ భారతదేశములో కేవలము ఒక్క రాష్ట్రములో మాత్రమున్న తెలుగు భాషయందు పూర్వపు యుగములలో కవులు, పండితులు లేనిదానివలన తెలుగు భాషయొక్క గొప్పతనము దేశములోని చాలా ప్రాంతముల వారికి తెలియకుండా పోయినది. కలియుగములో ఆరు (6) వందల సంవత్సరముల పూర్వము ఆంధ్ర దేశమును పాలించిన కృష్ణదేవరాయలు తెలుగు భాషను, తెలుగు భాషా కవులను పోషించిన దానివలన తెలుగు భాష యొక్క ప్రావీణ్యత కొంత బయటపడినది. అంతకు ముందు వ్యాసుడు సంస్కృతములో వ్రాసిన భారత భాగవత గ్రంథములను తెలుగులోనికి నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ అను ముగ్గురు కవులు వ్రాయడము వలన, తెలుగుభాషలో పాట, పద్య, గద్య, ద్విపద రూపములో వ్రాయుటకు అనుకూలముండుట వలన, మరి ఏ ఇతర భాషలలో ఇటువంటి అనుకూలము లేని దానివలన, తెలుగుభాష ఇతర ప్రాంతములవారికి కొందరికి తెలియడమేకాక, దేశభాషలలో తెలుగు గొప్ప భాషయని తెలిసిపోయినది. తెలుగు భాష యొక్క పదముల కూర్పులోని నైపుణ్యత, శబ్ద ఉచ్ఛారణలోని అందము ఇతర భాషలయందు వెదకినా కనిపించక పోవడము వలన, తెలుగు భాషను చూచిన ఎవ్వరైనా, ఇది దేశభాషలలోనే గొప్ప భాషయని చెప్పక తప్పదు".

ఇదంతయు తెలుగుభాష యొక్క గొప్పతనమునకు కనిపించు సత్యము కాగా, కనిపించని సత్యమొకటి ఉంది. అది తెలుగు భాష పుట్టుకకే కారణమైనదని చెప్పవచ్చును. దానిని వివరించి చెప్పుకొంటే తెలుగు భాష దేశభాషలలో గొప్పదని కనిపించు వివరముల ప్రకారము చెప్పగలిగితే, తెలుగు భాష ‘దేహి’ భాషలలోనే గొప్పదని కనిపించని వివరముల ప్రకారము చెప్పవచ్చును. దేశము కనిపించునది. దేహి కనిపించనిది. దేశములో మనుషుల చేత చెప్పబడు భాషలు ప్రపంచ విషయములను తెలియజేయునవిగా ఉన్నాయి. దేహములోని దేహిచేత చెప్పబడు భాష పరమాత్మ విషయము లను తెలియజేయునదిగా ఉంది. బయట దేశము మీద దృష్ఠికలిగి చెప్పునది దేశభాష అగును. లోపల దేహిమీద దృష్ఠికలిగి చెప్పునది దేహిభాష అగును. వివరముగా చెప్పితే దేశభాష అనగా అజ్ఞానముతో కూడుకొన్నదనీ, దేహి భాషయనగా జ్ఞానముతో కూడుకొన్నదనీ చెప్పవచ్చును. తెలుగుభాష లోని ప్రావీణ్యత ఇటు బయట దేశభాష ప్రకారమూ గలదు, అట్లే లోపలి దేహి భాష ప్రకారమూ గలదు. లోపలి ఆత్మయొక్క జ్ఞానమును చెప్పునపుడు ఆత్మజ్ఞానమునకు చాలా దగ్గరగా యున్నది ఒకే ఒక్క తెలుగుభాష. తెలుగు భాషలోని శబ్దములు, పద ఉచ్చరణలు ఆత్మజ్ఞానమునకు ఉన్నంత దగ్గరగా మరి ఏ ఇతర భాషలోనూ లేవు. అందువలన తెలుగు భాష దైవజ్ఞానమును దగ్గరగా చెప్పుట కొరకే తయారు చేయబడినదనీ, ఆత్మజ్ఞానమును తెలుపుటకు ప్రత్యేకముగా తయారు చేయబడిన భాష ఇదియేననీ చెప్ప వచ్చును.

ఈ కారణమున తెలుగు భాషను తెలిసినవారికే దైవజ్ఞానమును తెలుసుకొను అవకాశము ఎక్కువగా ఉన్నదని తెలియుచున్నది. ఆత్మ జ్ఞానమును తెలిసినవారు ఏ ప్రాంతమువారైనా, తెలుగు భాషను తెలిసిన తర్వాత తమ జ్ఞానమునకు తెలుగు భాషకు ఉన్న సంబంధమును చూచి, ఆత్మజ్ఞానము కొరకు ప్రత్యేకముగా తయారు చేయబడినది తెలుగుభాషయని తప్పక చెప్పుదురు. దేవుడు తన భావములను తెలుపుటకు ఎక్కువ అనుకూలముగా ఉండునట్లు తెలుగు భాషను ముందే తయారు చేసి వుంచాడనీ, భూమిమీద తన ధర్మములను మూడవ అవతారములో సంపూర్ణము చేయుటకు తెలుగుభాషను ఉపయోగించుకొనునని తెలియు చున్నది. దేవుడు భగవద్గీతలో చెప్పిన తన త్రైతసిద్ధాంతమును అనుసరించి, తన ధర్మములను జ్ఞానరూపములో పూర్తి వివరముగా తెలుపుటకు మూడు మార్లు భూమిమీదకు రావలసివున్నది. మూడవమారు వచ్చినపుడు ఏమాత్రము సంశయము లేకుండా, ప్రశ్న అనునది మిగలకుండా, శాస్త్రబద్ధముగా సంపూర్ణ సమాచారమును అందివ్వవలసివున్నది. అటువంట పుడు తన భావమును (దైవ భావమును) బాహ్యముగా తెలుపునది భాషయే. లోపలి భావమును బయటికి తెలుపునది భాష అయినపుడు, ఆ భాషను తన భావములకు దగ్గరగా ప్రజలు అర్థము చేసుకొనునట్లు తెలుగుభాషను తయారు చేసియుంచాడు. సంపూర్ణముగా దైవ భావములను ప్రకటించు భాష ఏదైతే ఉందో, ఆ భాషయందే తన మూడవ అవతారము ద్వారా ధర్మ ప్రకటన సంపూర్ణము చేసిపోవును.

దైవ ధర్మములను సంపూర్ణముగా వ్యక్తము చేయు భాష ఒకే ఒక తెలుగు భాష. అందువలన ఒక విధముగా ‘‘దేశభాషలలో తెలుగు లెస్స’’ అని కొందరనినా ఇపుడు మేము ‘‘దేహి భాషలలో తెలుగు గొప్ప’’ అని అంటున్నాము. భగవద్గీత భావమును మొదట హిందీ భాషలో శ్రీకృష్ణుడు వ్యక్తము చేయగా, వ్యాసుడు సంస్కృత భాషతో హిందీ లిపిలో వ్రాసియుంచాడు. దేవుని చివరి అవతారము భారతదేశములో దక్షిణ ప్రాంత భాష అయిన తెలుగు భాషలోనే తన ధర్మములను తెలియజేయుననుటకు ఎన్నో ఆధారములు గలవు. అవియే తెలుగుభాషకు దేవుని జ్ఞానమునకు దగ్గరగానున్న సంబంధములు.

తెలుగుభాష దైవజ్ఞానమునకు ఎంతో సంబంధపడి ఉన్నదని తెలియాలంటే, అంతో ఇంతో దైవజ్ఞానమున్న వారికే తెలియునని మన పెద్దలు చెప్పుచుందురు. తెలుగు భాష యొక్క లిపిలోని అక్షరములు మొత్తము 54 కాగా సున్న, అరసున్న, విసర్గములతో కలిపి మొత్తము 57 గా ఉన్నవి. 54 అక్షరములను అచ్చులు, హల్లులు అను భాగములుగా విభజించారు. అందులో అచ్చులు మొదటి భాగములోనివి. అచ్చులు మొత్తము 16 కాగా, హల్లులు మొత్తము 38 ఉన్నవి. అచ్చులలో మొదటినుండి ఉన్న పదహారు అక్షరములు ఇలా కలవు. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, బుూ, లు, లూ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ. అచ్చులతోనే తెలుగు భాష లిపిని నేర్వ వలసివున్నది. అయితే ప్రస్తుత కాలములో ‘‘అ’’ నుండి మొదలుపెట్టి నేర్పుచుండగా, పూర్వము ‘‘అ’’ నుండి నేర్పక, అచ్చులు కాని పదములను నేర్పెడి వారు. అరవై (60) సంవత్సరముల పూర్వము ప్రాథమిక పాఠశాలలో నేను చదువును నేర్చుకొన్నపుడు ఒ, న, మః, శి, వా, యః అని ఆరు అక్షరములను నేర్పి, తర్వాత అ ఆ అని అచ్చులను నేర్పెడివారు. వేయి సంవత్సరముల వెనక్కి పోయి చూస్తే తెలుగు భాషను నేర్పేముందు ఈ భాష దైవమునకు సంబంధించినది అన్నట్లు హిందు (ఇందూ) జ్ఞానము ప్రకారము దైవమునకు గుర్తుగానున్న ‘‘ఓం’’ అను శబ్ధమును నేర్పించెడివారు. తర్వాత శివమునకు నమస్కరిస్తున్నాను అను భావమును తెల్పుచు ‘‘ నమః శివాయ’’ అని అనెడి వారు. దానినంత కలిపి ‘‘ఓం నమః శివాయ’’ అని పూర్వము నేర్పించగా నేను చదువుకొన్నపుడు అది కాస్త మారిపోయి ‘‘ఓ, న, మః, శి, వా, యః అని ఆరు విడి అక్షరములుగా నేర్పెడివారు. ప్రస్తుత కాలములో పూర్వమున్నట్లు రెండు పదములుగా ఓం నమఃశివాయ అనిగానీ, అరవై సంవత్సరముల క్రితమున్నట్లు ఆరు అక్షరములుగా ఓ, న, మః, శి, వా, యః అనిగానీ లేకుండా పోయాయి. ఇప్పుడు పాఠశాలలో అ, ఆ, ఇ, ఈ అని అచ్చులను నేర్పడము జరుగుచున్నది.పూర్వము తెలుగు భాషకంటే ముందు దైవమునకు నమస్కరించి నట్లు తెలుపు ఓం నమః శివాయ అను పదములు ఉండగా, తర్వాత కాల క్రమములో దేవునికి నమస్కరించు భావము లేకుండ పోయి ఓం ఒ గా మారిపోగా మిగతావన్నీ విడి అక్షరములుగా ఒ, న, మః, శి, వా, యః అని చెప్పడము జరిగినది. ఇప్పుడు అర్థములేని ఆరు అక్షరములు పోయి అచ్చులతో మొదలుపెట్టి అ, ఆ, ఇ అని మొదలు పెట్టి చెప్పడము జరుగు చున్నది. తెలుగు భాషను అచ్చులతో మొదలుపెట్టి చెప్పినా, అది జ్ఞానము తోనే కూడిన అర్థముతో ఉన్నది. తెలుగు భాష దైవజ్ఞానము కొరకే దేవుడే నిర్మించిన భాష అని మనము ముందే చెప్పుకొన్నట్లు, అచ్చులతో మొదలు పెట్టి చెప్పినా అందులోని మొదటి మూడక్షరములలో త్రైత సిద్ధాంతము ఇమిడివుండి, తెలుగుభాష దైవభాష అని చెప్పుటకు ఆస్కారమైనది. అచ్చుల లోని మొదటి మూడు అక్షరములు అ, ఆ, ఇ అని కలవు. మొదటి మూడు అక్షరములను దైవ సిద్ధాంతమైన త్రైత సిద్ధాంతముతో పోల్చుకుంటే అ ` జీవాత్మ, ఆ ` ఆత్మ, ఇ ` పరమాత్మగా చెప్పవచ్చును. రెండవ అక్షరమైన ‘ఆ’ను ఆత్మగా చెప్పుకొంటే, మూడవ ‘ఇ’ పరమాత్మ, ఒకటవ ‘అ’ జీవాత్మగా మిగిలిపోవుచున్నది. ఇందు అనగా చంద్రుడని, చంద్రుడు దేవుని జ్ఞానమునకు గుర్తు అని చెప్పుకొన్నాము.

మతము గురించి[మార్చు]

 • "మతమనేదే మాయ.మతాచారాలన్నీ ఎవరికివారు తమ గుంపు గుర్తింపు కోసం పెట్టుకున్నారు.మతానికంటే జ్నానమే ప్రధానము గనుక జ్ఞానము ఏ మతములో ఉన్నా తీసుకునే స్వేచ్చ మతస్తుని కంటే జ్నానికీ జ్నానార్ధికే ఎక్కువ ఉంటుంది.మతములు,మత మార్పిడులు జ్నానికి లెక్కింపదగని చాలా చిన్నవిషయములు.ఇవేవీ జ్నానార్ధిని బంధించలేవు.జ్నానికి మతము లేదు.

ఎంత పెద్ద భక్తుడైనా,అతడు మతములో చిక్కుకొని ఇది నా మతము అంటున్నాడు.ఎప్పుడైతే మతము అనేది మనిషిలో ఉందో, అప్పుడు అతడు మాయలో ఉన్నట్లే.మతమనేది ఏ కోశములో ఉన్నా అతను గుణములలో పూర్తిగా చిక్కుకొని బయటపడలేడు.అన్ని మతముల వారు మతము అను ప్రాథమిక అజ్ఞానమునే జయించలేనప్పుడు, మాయను జయించనట్లే". (ధర్మశాస్త్రము ఏది?)

 • "మతము అనునది నేడు ప్రజలలో కొరకరాని కొయ్యగా ఏర్పడినది. ప్రపంచము మొత్తము మతము అను మత్తులో తూగుచూ, తమను తాము మరచిపోయి, నేను నా మతము అనుకొనుచూ, ప్రక్కవాడు వాస్తవముగా ఎవడు అని ఆలోచించని స్థితిలో మనిషి ఉండిపోయాడు. ఒకే మతములో ఇద్దరున్నా, వారిలో ఒకరికొకరు కొద్ది తేడాతో కనిపించినా, ఆ కొద్ది తేడాను ఆసరాగా చూపించుచూ, దానిని మతములోని చీలికగా చెప్పుచూ, ఒకరినొకరు హింసించుకొను పరిస్థితి ఏర్పడుచున్నది. ఎక్కడ చూచినా మతము ద్వారా హింస తప్ప మనిషికి ఏమీ మిగులలేదు. నేడు భూమిమీద మతము మానవులలో చిచ్చుపెట్టుచూ ఎవరికీ అర్థము కానిదై, అందరినీ తన మాయలో ముంచివేయుచున్నది. మతము అను మాయలో పడినవారు, తాము చేయుచున్నది మంచా చెడా అని ఆలోచించక విచక్షణ కోల్పోయివుందురు. అటువంటి వారి దృష్ఠిలో మతము తప్ప పాపపుణ్యములు ఏమాత్రమూ ఉండవు.రాజకీయపార్టీలున్నట్లు దేశములో మతములుండడము వలన మనిషి ఇష్టమున్నా ఇష్టము లేకున్నా ఏదో ఒక మతములోనే ఉంటున్నాడు. మనిషి పుట్టుక ఏదో ఒక మతములో ఉండుట వలన, మనిషికంటే ముందే మతము తగులుకొంటున్నది. భగవద్గీత హిందువుల గ్రంథమని, బైబిలు క్రైస్తవుల గ్రంథమని, ఖుర్ఆన్ ముస్లీమ్ల గ్రంథమని మూడు మతములవారు నిర్ణయించుకొన్నారు. వాస్తవానికి మూడు గ్రంథములు ఏ మతమునకూ సంబంధించినవి కావు. మూడు దైవ గ్రంథములు సమస్త మానవులకూ సంబంధించినవని మరువకూడదు.దేవుడు మతానికి అతీతుడు.అందువలన మతము వలనగానీ, మతాచరణల వలనగానీ దేవుడు తెలియబడడు. మాయ చేత (సాతాన్ చేత) పుట్టబడినది మతము మరియు మతాచరణలు. అందువలన మతమునుగానీ, మతాచరణలనుగానీ గొప్పగా చెప్పుకొను వాడు మాయకు దగ్గరగా, దేవునికి దూరముగా ఉండును.దేవుని జ్ఞానమును తెలిసినవాడు ఎవ్వడుగానీ మతమును ముఖ్యముగా తీసుకోడు. దేవుని జ్ఞానమును తెలియనివారే మతముమీద ఆసక్తి కల్గియుందురు.అందువలన ప్రతి మనిషీ తన మతమునూ, తన మత గ్రంథమునూ గౌెరవించినట్లే మిగతా మతములలోని గ్రంథములను కూడా దేవుడే ఇచ్చాడని తెలిసి వాటిలో కూడా ఏమున్నదో తెలిసినరోజు, మతముల మీదగల అపోహలు లేకుండా పోవును. దానివలన మత సామరస్యము ఏర్పడును. మత మార్పిడులతో పని లేకుండాపోవును. పరమతములో యున్న జ్ఞానము, ధర్మము తన మతములోయున్నదని తెలిసినరోజు మనిషి ఏ మతములోయున్నవాడు ఆ మతములోనే యుండగలడు. మతమును ఖతము చేసి,మతమును పథముగా మార్చుకొంటే, మోక్షగమ్యమును తొందరగా చేరగలవు. (మతమార్పిడి దైవద్రోహము)

మతాల చీలిక[మార్చు]

 • భగవద్గీతలో జ్ఞానయోగమను అధ్యాయమున 39వ శ్లోకమందు భగవంతుడు ‘‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్’’ అని అన్నాడు. దీనినిబట్టి శ్రద్ధగలవాడు దేవుడు చెప్పిన దానిని గ్రహించవచ్చునని తెలియుచున్నది. భగవద్గీత వాక్యమునకు అనకూలముగా ఖుర్ఆన్లో 3వ సూరా 7వ ఆయత్నందు ఇలా కలదు. ‘‘ నీ పై గ్రంథమును అవతరింపజేసినవాడు దేవుడే. ఇందులో సులభముగా అర్థమయ్యే ముహ్కమాత్ (స్థూలమైన) వచనాలు వున్నాయి. అవి గ్రంథానికి మూలం. మరికొన్ని సులభముగా అర్థముకాని ముతషాభిహాత్ (సూక్ష్మమైన అర్థమునిచ్చు) వాక్యములున్నాయి. హృదయాలలో వక్రతయున్న వారు (అజ్ఞానముతో నిండిన మెదడు గలవారు) సూక్ష్మమైన అర్థమునిచ్చు ముతషాభిహాత్ వాక్యముల వెంటపడి, వారి అజ్ఞాన భావములచేత ప్రజలను అజ్ఞానమార్గమైన వక్రమార్గమును పట్టిస్తారు. నిజానికి ఆ వాక్యముల వాస్తవ అర్థము దేవునికి తప్ప ఇతర మానవులకు ఎవరికీ తెలియదు. అయితే జ్ఞానము మీద శ్రద్ధయున్నవారు వాటి అర్థమును తెలియగలిగాము అంటారు. భక్తి శ్రద్ధగలవారు మాత్రమే దేవుడు చెప్పిన సూక్ష్మభావము గల హితబోధ వాక్యములను గ్రహించగలరు.’’

పై వాక్యములో భగవద్గీతలో చెప్పినట్లు శ్రద్ధ గలవారు దేవుని జ్ఞాన వాక్యమును దేనినయినా గ్రహించగలరని తెలియుచున్నది. అయితే అజ్ఞాన భావములు కలవారు, అర్థముకాని సూక్ష్మ భావములుగల వాక్యములకు, వారి మనో భావము ప్రకారము అజ్ఞానముతో కూడుకొన్న అర్థములను చెప్పి, ప్రజలను దేవుని మార్గమునుండి ప్రక్కమార్గమునకు మళ్ళించగలరు. అందువలన దేవుడు చెప్పిన వాక్యములను దేవుడు తప్ప తెలిసినవారు ఎవరూ లేరు. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతర మానవునికి ఎవనికీ తెలియదు కావున, జ్ఞానము మీద శ్రద్ధగలవారు, దేవుని జ్ఞానమును తెలియవలెనను గాఢమైన బుద్ధిగలవారు దేవుడు తెలియ జేసినప్పుడే ఆ విషయమును గ్రహించగలరు. మూడు ఆత్మల విషయములు దేవుడు తన గ్రంథములయిన మూడిరటిలో చెప్పియుండడము వలన వాటిని శ్రద్ధా, బుద్ధి యున్నవారు గ్రహించవచ్చును. శ్రద్ధా, బుద్ధి లేనివారు గ్రహించలేరని తెలియుచున్నది. ఇంతకాలము మూడు గ్రంథములలో చీకటిమయమై ఎవరికీ కనిపించక, ఎవరికీ తెలియకయున్న మూడు ఆత్మలు, పూర్తి శ్రద్ధలేని కారణమున ఎవరికీ తెలియకుండాపోయాయి అని చెప్పవచ్చును. వేలు, వందల సంవత్సరములు గడచినా, మూడు ఆత్మల విషయము తెలియకుండా ఉండడము వలన, చివరికి దేవుడే మనకు జ్ఞానము మీద శ్రద్ధను ఇచ్చి, మూడు ఆత్మల విషయము ఇప్పుడు తెలియజేశాడు అని అనుకొందాము. మూడు ఆత్మలు మూడు రాత్రులుగా, ఏమీ తెలియని చీకటిమయముగా భగవద్గీతలోయుండుట వలన భగవద్గీతను తౌరాతు (మూడు రాత్రులు) అని చెప్పడము జరిగినది. భగవద్గీత మాత్రమే తౌరాత్ గ్రంథమా అని ఆలోచిస్తే, గీతను అనుసరించి పుట్టిన మిగతా రెండు గ్రంథములు కూడా తౌరాతు గ్రంథములేనని చెప్పవచ్చును. ఎందుకనగా! మిగతా రెండు గ్రంథములు కూడా ముఖ్యముగా మూడు ఆత్మల విషయమును తెలియ జేయుచున్నవి. అందువలన బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములకు కూడా ఆ పేరు వర్తించగలదుగానీ, మొదటి గ్రంథమునకు మర్యాద ఇచ్చి, దానితో సమానమైన పేరు పెట్టుకోవడము మంచిదికాదని, మిగతా రెండు గ్రంథములకు తౌరాతు అని పేరు పెట్టలేదు. ద్వితీయ దైవ గ్రంథమును మనము నేడు బైబిలు అని చెప్పుచున్నా, భగవద్గీతకు దేవుడు ‘తౌరాతు’ గ్రంథమని పేరు పెట్టినట్లు, బైబిలు గ్రంథమునకు ‘ఇంజీలు’ అని పేరు పెట్టాడు. దేవుని భాషలో దాని అర్థమేమో నాకు తెలియదు గానీ, దైవజ్ఞానమునకు దగ్గరగా యున్న భాష అయిన తెలుగు భాషలో దైవజ్ఞానమునకు సంబంధించిన అర్థమేకలదు. జ్ఞానమునకు చిహ్నము, జ్ఞానమునకు అధిపతి అయిన చంద్రున్ని ఇందువు అని చెప్పవచ్చును. చంద్రకిరణములను ఇందుజాలు అని అనవచ్చును. ఇందువు నుండి పుట్టునవి కావున ‘జా’ అను శబ్ధమును చేర్చి ఇందుజాలు అని చెప్పడము జరుగుచున్నది. ఇందుజాలు అను పదమునకు దగ్గరగా యున్న శబ్దము ఇంజీలు అను శబ్ధము. ఇందూ అనకుండా చివరిలో ‘దూ’ను తీసివేసి ‘ఇం’ అని చెప్పినా చంద్రుడనియే అర్థము వచ్చును. అంతేకాక ‘జా’ అను శబ్దము ‘జీ’ అని పలికినా జీవించడము, పుట్టడము అని ‘జా’ కున్న అర్థమే వచ్చును. అందువలన ‘ఇందుజా’ అను పదమును ఇంజా అనియూ, ఇంజీ అనియు అర్థము చెడకుండా చెప్పవచ్చును. అందువలన ఇంజీలు అంటే చంద్రకిరణములు అని స్థూల అర్థము రాగా, దేవుని జ్ఞాన వాక్యములని సూక్ష్మమైన అర్థము వచ్చును. దేవుని జ్ఞాన వాక్యములతో కూడుకొన్న గ్రంథమును ఇంజీలు అని అనవచ్చును. అందువలన ద్వితీయ దైవ గ్రంథమయిన బైబిలును ఇంజీలు గ్రంథమని జ్ఞాని అయిన జిబ్రయేల్ గ్రహము చెప్పడమైనది. భగవద్గీత తౌరాతు గ్రంథమని పిలువబడగా, బైబిలు ఇంజీలు గ్రంథమని పిలువబడింది. ఈ విధముగా మూడు గ్రంథములు ఒకే వంశమునుండి పుట్టిన సోదరులవలె ఒకే జ్ఞానమును తెలుపుచున్నవి. ఈ విషయమును తెలియని మనుషులు మూడు గ్రంథములను ఆధారము చేసుకొని మూడు మతములను సృష్ఠించుకొన్నారు. ఇప్పుడు చెప్పండి దేవుడు మతములను సృష్ఠించాడా? దేవుడు తన జ్ఞానమును మూడు గ్రంథములలో నింపి పంపాడు. అయితే మనిషి వాటిని మతములుగా మలుచుకొన్నాడు. దేవుడు మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి మూడు ఆత్మలను తెలుసుకోమన్నాడు. కానీ మనిషి మూడు ఆత్మలను తెలుసుకోలేదు. దాదాపు ప్రపంచ వ్యాప్తముగా ముఫ్పై మతములను తయారు చేసుకొన్నాడు. దేవుడు మూడు గ్రంథములు ఇస్తే మనిషి మూడు గ్రంథములకు మూడు మతములను అంటగట్టాడు. (మత మార్పిడి దైవ ద్రోహము-మహా పాపము అను గ్రంథం నుంచి)

కులం గురించి[మార్చు]

పల్లెలలో మాదిగ వారితో పనిచేయించుకొని వారికి అన్నము పెట్టినా, నీరు పోసినా వారి పాత్రలను ప్రక్కనయుంచి వాటిలోనే పెట్టడము నేను స్వయముగా ఎన్నోచోట్ల చూచాను. నేను చిన్నప్పుడు, ఎండలో పనిచేయు మాదిగువవారు ఇంటిముందుకు వచ్చి దప్పికగాయున్నాము నీళ్ళు త్రాగాలని అడిగితే, మా ఇంటిలోని పెద్దలు ఒక పెద్ద చెంబుతో నీళ్ళు తీసుకొనిపోయి, వారి చేతులలోనికి చెంబును ఇవ్వకుండా, వారు చేతులు నోటిదగ్గర పెట్టుకొని వంగి నిలబడితే, చేతులలోనికి నీళ్ళు పోస్తే వారు త్రాగేవారు. అలా త్రాగడములో కొన్ని నీళ్ళు వేళ్ళ సందులలో క్రిందికి కారిపోయేవి. మాకు ఆ కార్యము వింతగా కనిపించేది. ఎందుకు అలా పోయాలి? చెంబు ఇస్తే నీళ్ళు క్రిందకుపోకుండా త్రాగేవారు కదాయని మా పెద్దలను అడిగితే, వారు మాదిగ వారు, వారు మన చెంబును ముట్టుకోరాదు అని చెప్పేవారు. అప్పుడు వారు అలా ఎందుకు చెప్పుచున్నారో అర్థము అయ్యేదికాదు. ఒక దినము మా తల్లి, తండ్రితో సహా ఒక ఊరిలోని బ్రాహ్మణుల ఇంటికి పోయాము. అప్పుడు వాకిలి దాటి లోపలికి పోతూనే వాకిలి ప్రక్కనే మేము క్రింద కూర్చున్నాము. ప్రక్కనే ఒక గూడు, అందులో చెంబు గ్లాసు, కొన్ని విస్తళ్ళు ఉన్నాయి. అది పల్లెటూరు కావున భోజన సమయమునకు హోటళ్ళు కూడా లేకుండుట వలన వారి ఇంటిలోనే భోజనము చేయవలసి వచ్చింది. అప్పుడు వారు ప్రక్క గూటిలోని చెంబులోనికి నీళ్ళుపోసి, గూటిలోని విస్తరి తీసుకోమని దానిలో అన్నము పెట్టడము జరిగింది. వారి పాత్రలో అన్నము తెచ్చి ఇంటిముందర కుక్కకు పెట్టినట్లు పెట్టిపోవడము, నీళ్ళు తెచ్చి పోసిపోవడమును గమనించితే మా ఇంటి ముందర నీళ్ళు అడిగిన మాదిగవాళ్ళకు నీళ్ళు పోసినట్లే, వీళ్ళు మాకు అన్నము పెట్టడము, నీళ్ళు పోయడము జరిగినదని అర్థమైనది. మా ఇంటి దగ్గర నీళ్ళు త్రాగిన వాళ్ళు మాకు అంటరానివారైతే, వీరి ఇంటివద్ద అన్నము తిన్న మేము వీరికి అంటరానివారముగా యున్నామనిపించింది, అనిపించడమే కాదు ప్రత్యక్షముగా కనిపించింది. నా వయస్సు తొమ్మిది లేక పది సంవత్సరములు ఉన్నప్పుడు జరిగిన ఆ రెండు సంఘటనలు నాకు బాగా జ్ఞాపకమున్నవి.ఎప్పుడు కులాంతర వివాహములు జరుగుతాయో అప్పుడు నీ కులము, నా కులము అనుమాట లేకుండా కులములు కలిసిపోతే తర్వాత దానంతకదే మనుషులందరూ కలిసిపోవడము జరుగుతుంది. అలాంటప్పుడు దేవుడు నాకు అందరూ సమానమే, నేను అందరినీ సమానముగా సృష్ఠించానను మాట అర్థమవు తుంది. అందువలన ఆ పనిలో భాగముగా నేను మొదట కులాంతర వివాహమును చేసుకొన్నాను. తర్వాత నా కుమారునికి కూడా కులాంతర వివాహము చేశాను. (ద్రావిడ బ్రాహ్మణ ).

ఇందువు-హిందువు[మార్చు]

భారతదేశమను పేరులేని కృతయుగములో ఇందూదేశమని పిలువబడుచున్నదని చెప్పు కొన్నాము. శ్రీలంక, రామేశ్వరము మొదలుకొని హిమాలయముల వరకు ఇందూదేశమని పిలువబడుటకు, ఆ దినము దేశములోని ప్రజలందరూ దైవజ్ఞానము కలిగియుండడమే కారణము. దైవ జ్ఞానముండుటచేత ఇది ‘‘జ్ఞానుల దేశము’’ అను అర్థము వచ్చునట్లు ప్రత్యేకించి ఇందూదేశమని పేరుపెట్టడము జరిగింది. ప్రపంచము మొత్తము మీద జ్ఞానులున్నదేశము, జ్ఞానశక్తియున్న దేశము, మనము నివసించు దేశము ఒక్కటే కావున మన దేశానికి ఇందూదేశమని పేరు రావడము జరిగింది. ఆనాడు ఇందూదేశముగాయున్న దేశమే నేడు భారతదేశముగా పేరు మార్చుకొన్నది. అలా భారతదేశమని పేరున్నా పూర్వపు వాసనచేత హిందూ దేశమని కూడా నేడు పిలువబడుచున్నది. హిందూ దేశమనీ, భారతదేశమనీ రెండు పేర్లున్న దేశమైనా, విదేశీయుల దృష్ఠిలో దీనికి మరొక పేరు ఉంది. ఆ పేరే ఇండియా. ప్రపంచములో మూడు పేర్లతో పిలువబడు దేశము మన దేశమేనని ఎవరూ మరువకూడదు.

శ్రీలంకకు అతి సమీపములోయున్న రామేశ్వరమునకు దగ్గరగా నివసించు మనువు అను వ్యక్తికి సూర్యుడు మొదట జ్ఞానము చెప్పడమైనది. ఆ విధముగా ఆదిలో ప్రథమముగా భూమిమీదికి జ్ఞానము వచ్చి చేరినది. అలా వచ్చిన జ్ఞానము స్వయముగా దేవుడే ఒక భూతము ద్వారా చెప్పించడము వలన, అదే జ్ఞానమునే సూర్యుడు విని చెప్పడము వలన, మన దేశములోనికి అన్ని దేశములకంటే ముందు దైవజ్ఞానము ప్రవేశించి నది. దక్షిణ భారతదేశమున ప్రవేశించిన జ్ఞానము కృతయుగములో భారతదేశమంతా వ్యాపించి ప్రతి మనిషి జ్ఞానసంపన్నుడై యుండేవాడు. ప్రతి మనిషి జ్ఞానసంపద కల్గియుండుటవలన కృతయుగము మొదటిలోనే మన దేశము (భారతదేశము) జ్ఞానుల దేశమని అర్థమొచ్చునట్లు ఇందూదేశమని పిలువబడెడిది. ఇందు అనగ చంద్రుడు అని అర్థము. చంద్రుడు జ్ఞానమునకు గుర్తుగాయుండుట వలన చంద్రుని పేరును కల్గియున్నట్లు ఇందూదేశమని ఆనాడు పేరు పెట్టడము జరిగింది. ఆనాడు మనుషుల నివాసమైన పట్టణములన్నియూ అర్థ చంద్రాకారముతోనే నిర్మించుకొన్నారు. గంగానది మొదలగు కొన్ని నదులు ఎన్నోచోట్ల అర్థచంద్రాకృతి ఆకారమును పోలినట్లు వంపు తిరిగియున్నవి. అలహాబాద్‌లో గంగానది అద్భుతముగా చంద్రవంక ఆకృతిలో వంపు తిరిగియున్నది. కాశీ మున్నగు నగరములు చంద్రవంక ఆకారములో నిర్మించబడినాయి. అంతేకాక భారత దేశమంతా జ్ఞానమయమై ఉండుట వలన చంద్రవంక పేరు గుర్తుండునట్లు ఇందూదేశమని ముఖ్యమైనవారు చెప్పగా, అందరూ వారిమాటను గౌరవించి ఈ దేశమును ఇందూదేశమనీ, ఇందువుల దేశమని అనెడివారు. ఈ విధముగా ప్రపంచములో ఏ దేశానికి లేని పేరు మన దేశానికి రావడము ఈ దేశములో పుట్టిన మనందరికీ గర్వకారణమే.

ఆనాటి ద్రావిడులు ఆర్యులు చేయు కుట్రలు కుతంత్రములను గ్రహించలేక, వారి దృష్ఠియంతయూ ఆత్మజ్ఞానము మీద లగ్నము చేసియుండిరి. ప్రపంచ జ్ఞానము మీద ఎక్కువగా దృష్ఠిలేని ద్రావిడులు ఆర్యులు తమమీద అసూయ కల్గియున్నారనిగానీ, తమను హేళనగా చూస్తున్నారనిగానీ, అనుకోకుండా తమ పనిని తాము చేసుకొంటూ పోయెడివారు. భూమిమీద ప్రప్రథమముగా జ్ఞానము తెలిసినది దక్షిణ దేశమున అయినందున, దేవుడు పంచిన జ్ఞానము దక్షిణ ప్రాంతమువారికి బాగా అంటుకొని అందరూ జ్ఞానులుగానే యుండెడివారు. మొదట దైవ జ్ఞానమును తెలిసిన వారికి ‘‘ద్రావిడు’’లు అని పేరు రావడము జరిగినది. అంతకు ముందు మన దేశమునకు ఇందూదేశమనిగానీ, దేశ ప్రజలను ద్రావిడులు అనిగానీ పిలిచెడివారులేరు. సృష్ఠి జరిగిన కొంత కాలమునకే ఇదంతా జరిగినది. అప్పుడు దేశమునకు ఒక పేరుండాలనిగానీ, తమకు ఒక పేరుండాలనిగానీ ధ్యాసలేని జీవితమును గడిపెడివారు. ఖాళీ పేపరు వలెనున్న అప్పటి ప్రజలకు సూర్యుడు మనువు ద్వారా జ్ఞానమును తెలియునట్లు చేశాడు. దైవజ్ఞానము తెలిసిన తర్వాత వారిలో ముఖ్యులైనవారు కొందరు ఆత్మప్రేరణచే తమ దేశమునకు పేరుపెట్టు కోవాలని అనుకొన్నారు. అప్పుడు వారు ఇందూదేశమని పేరు పెట్టుకోవడము జరిగినది. మనిషి లోపల క్రొత్త ఆలోచనలను, క్రొత్త విధానములను, క్రొత్త సిద్ధాంతములను అందించువాడు ఆత్మే అయినందున క్రొత్తగా వచ్చిన ‘‘ఇందూ’’ దేశమను పేరు ఆత్మ అందించినదేనని తెలియవలెను. ‘‘మత్తః స్మృతిర్‌ జ్ఞాన మపోహనంచ’’ అను భగవద్గీతా వాక్యము ప్రకారము నా వలననే జ్ఞానము, జ్ఞప్తి, ఊహ వస్తుందని ఉన్నట్లు దేశమునకు పేరు జ్ఞానరీత్యా ఇందూదేశమని రావడము జరిగినది.

ఇందు అనగా జ్ఞాని అని ముందే చెప్పుకొన్నాము. దైవజ్ఞానమునకు గానీ, ప్రపంచ జ్ఞానమునకుగానీ చంద్రుడు అధిపతియని జ్యోతిష్యశాస్త్రములో కూడా తెలియుచున్నది. ఇందూ అనగా జ్ఞాని అని అర్థము. ఇందువులు అనగా జ్ఞానులు అని అర్థము, అయితే జ్ఞానులు అను మాట ప్రపంచ జ్ఞానులా? పరమాత్మ జ్ఞానులా? అను ప్రశ్నను రేకెత్తించగలదు. అందువలన అటువంటి ప్రశ్నకు సమాధానముగా తాము పరమాత్మ జ్ఞానులమే, ప్రపంచజ్ఞానులము కాదు అన్నట్లు ప్రజలకు ప్రత్యేకమైన పేరును పెట్టడము జరిగినది. ఇందూదేశములో నివసించు వారందరూ ఇందువులే అయినా, మేము ఫలానా ఇందువులమే అన్నట్లు దేశ ప్రజలందరికీ తమ జ్ఞానమునకు సరితూగగల పేరును పెట్టడము జరిగినది. ఆనాడు ఉన్న ప్రజలు ఎటువంటి జ్ఞానులో అటువంటి జ్ఞానమును తెలుపు నిమిత్తము ‘‘ద్రావిడ’’ అను మూడక్షరముల పేరును ఎన్నుకొని దేశ ప్రజలందరినీ ద్రావిడులు అని అనడము జరిగింది.

ఆర్యులు ఇందూదేశములో త్రేతాయుగము మొదటిలో గానీ, లేక కొద్ది ముందుగా కృతయుగము చివరిలో గానీ ప్రవేశించారని తెలియుచున్నది. ఆర్యులు భారతదేశములో ప్రవేశించినప్పుడు ఆసీయులను పేరు కల్గి దానినే చెప్పుకొన్నవారు, కొంతకాలమునకు ద్రావిడుల కంటే గొప్పగా కనిపించునట్లు తమను తాము ఆర్యులుగా (గురువులుగా) ప్రకటించుకొన్నారు. త్రేతాయుగము మొదటిలో ఉత్తర భారతదేశమును ఆక్రమించుకొని వింధ్యపర్వతముల వరకే ఆగిపోయి, దక్షిణ దేశమును ద్రావిడ రాజ్యమనిన ఆర్యులు, త్రేతాయుగము యొక్క మధ్య కాలమునకే తమ పెత్తనమును దక్షిణ దేశములో కూడా వ్యాపింపజేశారు. దైవజ్ఞానములో ముందుండి ప్రపంచ జ్ఞానములో వెనుకబడిన ద్రావిడులు, కృతయుగములో జ్ఞానులుగా ప్రపంచ ప్రసిద్ధిగాంచి, త్రేతాయుగము మొదటి కాలములోనే తమలోని దైవజ్ఞానమును కోల్పోయారు. ఇటు దైవజ్ఞానమూ లేక, అటు ప్రపంచ జ్ఞానమూ లేక ఉభయభ్రష్టులుగాయున్న ద్రావిడులను చూచిన ఆర్యులు, అదే అదునుగా ఇందూదేశమను పేరును కొంతమార్పుచేసి, ఇందూ శబ్ధమును లేకుండా చేసి, హిందూ అను పేరును పెట్టి హిందూదేశమని చెప్పారు. తాము సింధూనది తీరము వెంటవచ్చామనీ, తమ వలననే సింధూనది ప్రాంతములోని నాగరికత భారతదేశము లోనికి వచ్చినదనీ, దానివలన హిందూదేశమని చెప్పుచున్నామనీ వివరణ కూడా ఇచ్చారు. అప్పటికే తాము జ్ఞానులమనీ, తమ జ్ఞానము వలననే భారతదేశమును ఇందూ దేశము అంటున్నారనీ, గట్టిగా ద్రావిడులు చెప్పలేకపోయారు. హిందూ అనుమాటను ఆ దినము ఖండిచకపోవడము వలన, ఇందూ శబ్ధము కాలగర్భములో కలిసిపోయి, చివరకు హిందూ శబ్ధము శాశ్వతముగా నిలిచి పోయింది. ఈ విధముగా జ్ఞానులదేశమైన ఇందూదేశము యొక్క పేరును మార్చి హిందూదేశమని చెప్పిన ఘనత ఆర్యులకే దక్కినది.

మొదట జ్ఞానుల దేశమను అర్థమునిచ్చు ఇందూదేశము అను పేరును తీసివేసి, అర్థములేని హిందూ పదమును పేరుగా పెట్టడము కేవలము అసూయతో చేసిన పనేగానీ వేరుగాదు. తర్వాత ఎవరో ఒకరు రాబోవు దినములలో చరిత్రను తిరగతోడి, తిరిగి ఇందూదేశమను పేరును పొందవచ్చునను ఉద్దేశముతో, మూడవ పేరును కూడా ఆర్యులే తేవడము జరిగింది. భారతదేశము అనుపేరును భరతుడను రాజు పాలించిన దేశముగా సాకు చూపించి, ఇందూదేశమునే భారతదేశమని కూడా చెప్పారు. ఈ దేశమును ఎందరో రాజులు పాలించగా, ఒక భరతుని పేరు మాత్రము ఎందుకు దేశానికి అంటుకొన్నదో? ఎవరిని అడిగినా సమాధానము చెప్పారు. ఈ విధముగా అర్థములేని హిందూ పదమునూ, ఆధారములేని భారత పదమును ఇందూదేశానికి తగిలించి, అసలైన అర్థముతో కూడుకొన్న ఇందూ పదమును లేకుండా చేయడములో ఆర్యులు కృతకృత్యులైనారు. అలా దేశము పేరు మారిపోవడముతో, తమ చరిత్ర ఏమిటో ద్రావిడులకు తెలియకుండా పోవునను ఉద్దేశముతోనే ఆర్యులు రెండు పేర్లను కల్పించి అసలు పేరును ముంచివేశారు. నేడు తమ చరిత్రను మరచిపోయిన, తమ జ్ఞానమును తెలియకుండాపోయిన, తమ ధర్మములను పూర్తిగా వదిలివేసిన ద్రావిడులు మిగిలియుండుట వలన వారు తమ దేశము పేరునుగానీ, తమ ధర్మములనుగానీ, తమ జ్ఞానమునుగానీ గుర్తించలేని స్థితిలో ఉండిపోయి, ఎవరు ఏమి చెప్పితే దానిని వినునట్లు ఉన్నారు.ఏమీ అర్ధం లేని హిందువులు అనే పేరుతో పిలువబడుతున్నారు. ( "ద్రావిడ బ్రాహ్మణ" అను రచన నుంచి సేకరణ)

ప్రబోధాశ్రమము[మార్చు]

ప్రబోధాశ్రమము (శ్రీ కృష్ణ మందిరము), చిన్నపొడమల గ్రామం, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది.

ఈ ఆశ్రమము ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారి చే ప్రారంభించబడి, వారు తెలియజేయు ఆత్మ జ్ఞానాన్ని మతాలకతీతంగా విశ్వవ్యాప్తంగా అందరికీ అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న సంస్థ. ఇక్కడ కులు మత వివక్ష వుండదు. దైవ జ్ఞానసముపార్జ అనే ఆసక్తి వుంటుంది తప్ప, వేరే ప్రపంచ ఆసక్తులు వుండవు.

ఈ ఆశ్రమము ద్వారానే త్రైతసిద్ధాంతము (మూడు ఆత్మల వివరము) తిరిగి వెలుగులోనికి వచ్చింది. యోగీశ్వరుల వారు 1978 సంవత్సరములో త్రైత సిద్ధాంతాన్ని ప్రపంచమునకు తెలియచేసారు. అనగా వారు త్రైత సిద్ధాంతము తెలియజేసి 38 వత్సరములు అయినవి. ఆనాటి నుంచే వీరి ప్రకారం త్రైత శకము ఆరంభము అయినది. ఆ విధముగా త్రైత శకము-39 ఇప్పుడు నడుస్తున్నది. హేవళంబి నామ సంవత్సర "యుగాది" నుంచి త్రైత శకము-39 నడుస్తున్నది.

శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి కాల జ్ఞానములో ప్రబోధాశ్రమము ప్రస్తావన ఉంది.

విమర్శ[మార్చు]

ప్రబోధానంద తన దేవుని ముద్ర అనే పుస్తకంలో ఖురాన్ పై చేసిన వ్యాఖ్యలపై ముస్లిముల నుండి విమర్శలు ఎదుర్కొన్నాడు. 2017 మే 19 వ తేదీన తాడిపత్రి పట్టణంలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ‘‘ప్రబోధానంద స్వామి రాసిన పుస్తకంలో ఖురాన, మహమ్మద్‌ ప్రవక్త గురించి, ఇస్లాం ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి. ఆ పుస్తకాన్ని నిలిపివేయాలి. భవిష్యత్తులో ఇస్లాం గురించి అవగాహనాలేమితో పుస్తకాలు రాయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని ముస్లిములు కోరారు.[20]

ప్రబోధానంద యోగీశ్వరులు ఇటీవల రచించిన "దేవునిముద్ర" అనే గ్రంథంలోని సమాచారమును కొంతమంది మతపెద్దలు అపార్థం చేసుకొన్నారంటూ వారి విమర్శను ఖండిస్తూ, మే 20న ప్రబోధాశ్రమము వారు తాడిపత్రి పట్టణ పోలీసులకు ఒక వినతిపత్రం అందచేసారు. "ప్రబోధానంద యోగీశ్వరుల వారు "దేవునిముద్ర" అనే గ్రంథములో- అందరికీ దేవుడు ఒక్కడేననీ, మూడు దైవ గ్రంథాల (భగవద్గీత, బైబిల్, ఖురాన్) సారము ఒక్కటేననీ, అన్ని మతాల వారు మూడు గ్రంథాలను చదివి సక్రమంగా అర్థం చేసుకోవాలనీ, ఖురాన్ సర్వ మానవాళికీ అందించబడ్డ దైవ గ్రంథమనీ తెలియచేసారే తప్ప ఆయన ఏ మతం పైనా, ఏ ప్రవక్త పైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు" అని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. "దేవునిముద్ర" గ్రంథాన్నీ పూర్తిగా చదివి అర్థం చేసుకొన్న ఎంతోమంది ముస్లింలు మరియు ఇతర మతస్థులు, ఎంతో గొప్పజ్ఞానాన్నియోగీశ్వరుల వారు తెలియ చేసారనీ, ప్రబోధానందయోగీశ్వరుల వారి గ్రంథాలను పూర్తిగా చదివి సక్రమంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా అన్ని మతాల వారిని వారు కోరారు.[21]

ప్రబోధానంద యోగీశ్వరుల రచనలు[మార్చు]

 1. త్రైత సిద్ధాంత భగవద్గీత.
 2. ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.
 3. ధర్మము-అధర్మము.
 4. ఇందుత్వమును కాపాడుదాం.
 5. యజ్ఞములు (నిజమా-అబద్ధమా).
 6. దయ్యాలు - భూతాల యదార్థసంఘటనలు.
 7. సత్యాన్వేషి కథ.
 8. మంత్రము-మహిమ (నిజమా-అబద్ధమా).
 9. శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా.
 10. గీతా పరిచయము.
 11. కలియుగము (ఎప్పటికీ యుగాంతము కాదు).
 12. జనన మరణ సిద్ధాంతము.
 13. మరణ రహస్యము.
 14. పునర్జన్మ రహస్యము.
 15. త్రైతాకార రహస్యము (త్రైతాకార బెర్ముడా).
 16. జ్యోతిష్య శాస్త్రము (గ్రంథం).
 17. కథల జ్ఞానము.
 18. సామెతల జ్ఞానము.
 19. పొడుపు కథల జ్ఞానము.
 20. తత్వముల జ్ఞానము.
 21. తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము.
 22. గీతం - గీత.
 23. దేవాలయ రహస్యములు.
 24. ఇందూ సాంప్రదాయములు.
 25. మన పండుగలు (ఎలా చేయాలో తెలుసా?).
 26. తల్లి - తండ్రి.
 27. గురు ప్రార్ధనా మంజరి.
 28. త్రైతారాధన.
 29. సమాధి (త్రైత సిద్ధాంతం).
 30. ప్రబోధ.
 31. సుబోధ.
 32. సిలువ దేవుడా ?
 33. మతాతీత దేవుని మార్గము.
 34. దేవుని గుర్తు 963 - మాయ గుర్తు 666.
 35. మతము-పథము.
 36. ప్రబోధానందం నాటికలు.
 37. ఇందువు క్రైస్తవుడా ? (ఇది మత మార్పిడి మీద బ్రహ్మాస్త్రం)
 38. నిగూఢ తత్వార్ధ బోధిని
 39. ఆత్మ లింగార్థము
 40. నాస్తికులు -ఆస్తికులు
 41. హేతువాదము-ప్రతివాదము.
 42. గుత్తా (త్రైత సిద్ధాంతము).
 43. ప్రబోధ తరంగాలు.
 44. త్రైత సిద్ధాంతము.
 45. ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత.
 46. అంతిమ దైవగ్రంథములో జ్ఞాన వాక్యములు.
 47. ద్రావిడ బ్రాహ్మణ.
 48. తీర్పు (త్రైత సిద్ధాంతము).
 49. కర్మ పత్రము.
 50. ప్రవక్తలు ఎవరు ?
 51. ధర్మశాస్త్రము ఏది?
 52. మతమార్పిడి దైవ ద్రోహము-మహా పాపము.
 53. త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక ఘంటు.
 54. స్వర్గము ఇంద్రలోకమా! నరకము యమరాజ్యమా!!
 55. జీహాద్ అంటే యుద్ధమా?
 56. మూడు గ్రంథములు ఇద్దరు గురువులు ఒక బోధకుడు .
 57. దేవుని జ్ఞానము కబ్జా అయ్యింది.
 58. అజ్ఞానములో ఉగ్రవాద బీజాలు.
 59. వార్తకుడు-వర్తకుడు.
 60. దేవుని చిహ్నము.
 61. ఏది నిజమైన జ్ఞానము?
 62. ప్రతిమ ✖ విగ్రహ; దైవము ✖ దయ్యము).
 63. మరణము తర్వాత జీవితము.
 64. ఏ మతములో ఎంత మతద్వేషము?
 65. హిందూ మతములో సిద్ధాంత కర్తలు.
 66. నీకు నా లేఖ.
 67. ఒక మాట మూడు గ్రంథములు.
 68. లు అంటే ఏమిటి ?.
 69. ఆదిత్య (త్రైత సిద్ధాంతము).
 70. చెట్టు ముందా! విత్తు ముందా?.
 71. ఒక్కడే ఇద్దరు.
 72. ఏసు చనిపోయాడా? చంపబడ్డాడా?
 73. సాయిబాబా దేవుడా! కాదా?
 74. దేవుని రాకకు ఇది సమయము కాదా?
 75. విశ్వ విద్యాలయము.
 76. కృష్ణ మూస.
 77. గీటు రాయి.
 78. మూడు దైవ గ్రంథములు మూడు ప్రథమ వాక్యములు.
 79. హేతువాద ప్రశ్నలు - సత్యవాద జవాబులు.
 80. భావము - భాష.
 81. దైవ గ్రంథములో సత్యాసత్య విచక్షణ.
 82. ప్రసిద్ధి బోధ.
 83. నాది లోచన - నీది ఆలోచన.
 84. దేవుని ముద్ర.
 85. ధర్మచక్రము.
 86. హిందూ మతములో కుల వివక్ష.
 87. ధ్యానము ప్రార్థన నమాజ్.
 88. ప్రాథమిక జ్ఞానము (హిందూ మతములో ఆధిపత్య క్రియ).
 89. అంతిమ దైవగ్రంథములో వజ్ర వాక్యములు.
 90. ఏది సత్యము - ఏది అసత్యము.
 91. ఒక వ్యక్తి రెండు కోణములు.
 92. బ్రహ్మ - రావణబ్రహ్మ - భగవాన్ రావణబ్రహ్మ.
 93. ద్వితీయ దైవ గ్రంథములో రత్న వాక్యములు.
 94. హిందూ ధర్మమునకు రక్షణ అవసరమా?.
 95. వేదములు మనిషికి అవసరమా?.
 96. ఉపనిషత్తులలో లోపాలు.
 97. ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము.

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "పవిత్ర దివ్య ఖురాన్"--2:87,88; 3:7; 6:91; 42:51;
 2. "పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత"-- జ్ఞానయోగము:7,8 శ్లోకములు
 3. "పరిశుద్ధ బైబిల్" -- యోహాన్ సువార్త 14:16,17 ; 16:7,8 ;
 4. "పవిత్ర దివ్య ఖురాన్"-- 15:29,30; 89:21,22;
 5. "పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత"--విశ్వరూపసందర్శన యోగము 48,53 శ్లోకములు;
 6. "పవిత్ర దివ్య ఖురాన్"--10:19;
 7. "పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత"--సాంఖ్యయోగము:47;కర్మయోగము:3శ్లోకము;
 8. "పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత"--సాంఖ్యయోగము:71,72;
 9. "పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత"--భక్తియోగము:7,10 శ్లోకములు
 10. "పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత"--అక్షరపరబ్రహ్మయోగము:28 శ్లోకము;
 11. "పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత"--జ్ఞాన యోగము:37,38,39 శ్లోకములు;
 12. "పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత"--ఆత్మసంయమయోగము:46 శ్లోకము;
 13. "పరిశుద్ధ బైబిల్: యోహాన్ ప్రకటనల గ్రంథం, 9వ ఆధ్యాయం;
 14. "పవిత్ర దివ్య ఖురాన్"--8:12-14; 9:5-7;
 15. ప్రబోధానంద యోగీశ్వరులు,త్రైత సిధ్ధాంతం,2012
 16. ప్రబోధానంద యోగీశ్వరులు,సత్యాన్వేషి కథ,2011;
 17. [1]
 18. ప్రబోధానంద యోగీశ్వరులు,"సత్యాన్వేషి కథ"- ఆకాశ మోడి, 2011, పేజీ నం.248;
 19. ప్రబోధానంద యోగీశ్వరులు,"స్వర్గము ఇంద్రలోకమా!నరకము యమరాజ్యమా!!";
 20. "'దేవుని ముద్ర'తో ఉద్రిక్తం!". 
 21. " ఏ గ్రంథంలోనూ కించపరిచే వ్యాఖ్యలు రాయలేదు"http://epaper.andhrajyothy.com/c/19209054