Jump to content

చర్చ:ప్రబోధానంద యోగీశ్వరులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మూలాలు?

[మార్చు]

ఈ వ్యాసం ప్రభోదానందస్వామికి చెందినది. అతని గురించి తెలియజేసే సరైన మూలాలు లేవు. ఈ వ్యాసంలో "ఆధ్యాత్మిక ప్రశ్నలు - జవాబులు", "ధర్మము - అధర్మము", "ఇందుత్వము ను కాపాడుదాం", "దయ్యాలు - భూతాల యదార్థసంఘటనలు", "తెలుగు భాష గురించి" "మతము గురించి", "మతాల చీలిక" విభాగాలలో అంశాలకు ఎటువంటి ఆధారాలు లేవు. ఆ అంశాలు ఈ వ్యక్తి వ్యాసంలో అనవసరమని భావిస్తున్నాను. కనుక ఆ విభాగాలను తొలగించాలి. ఈ వ్యాసంలో అతని పరిచయం, జీవిత విశేషాలు, ప్రభోధానంద ఆశ్రమం, త్రైత సిద్ధాంతం, వివాదాలు, పుస్తకాలు వంటి అంశాలు మాత్రమే ఉంటే బాగుంటుందని భావిస్తున్నాను. --కె.వెంకటరమణచర్చ 14:31, 26 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆమేరకు దిద్దడం జరిగింది. పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 14:21, 27 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
original research మూస తొలగించాను.--అర్జున (చర్చ) 00:16, 1 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

"వివాస్పద"

[మార్చు]

స్వామివారి గురించి మీరు మొట్ట మొదట రాసినది బాగా లేదు. స్వామి వారు "త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, ఇందు ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శతాధిక గ్రంథ కర్త శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు" అని రాయండి. ప్రతి గురువును వారియొక్క బిరుదులను గౌరవించడం నేర్చుకోండి. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే బాగుండదు. స్వామివారి గ్రంథాలు చదివి జ్ఞానం తెలుసుకున్నవాడు కొన్ని లక్షలమంది ఉన్నారు. మీరు ఏమీ తెలియకుండా ఎందుకు "వివాస్పద" అని రాస్తున్నారు. ఆ పదాన్ని వెంటనే తొలగించండి.

వాడుకరి:Venkata Avula గారు, తెలుగు వికీపీడియాలో అందరూ సమానమే. అందరికి ఏకవచన ప్రయోగమే ఉంటుంది. వికీ నియమాలు తెలుసుకున్న తరువాత వ్యాసాలలో మార్పులు చేయండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:00, 12 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Venkata Avula గారూ, ఈ వ్యాసంలోని "రాజకీయ వివాదాలు, ఆశ్రమం తరలింపు", "వివాదాలు" అనే విభాగాలు చూస్తే ప్రబోధానంద వివాదాస్పదులే అని తెలుస్తుంది. కాబట్టి ఆ పదాన్ని తిరిగి చేర్చాను. __చదువరి (చర్చరచనలు) 02:16, 13 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Venkataramanauv గారూ, వివాదాస్పద అనే పదాన్ని మీరు మళ్ళీ తొలగించారు. నేను దాన్ని మళ్ళీ చేర్చడం లేదు. కానీ, ప్రబోధానంద యోగీశ్వరులు వివాదాస్పద వ్యక్తి అని వ్యాసంలోని పాఠ్యం ద్వారా, అక్కడిచ్చిన మూలాల ద్వారా తెలుస్తోంది. మీరు ఆ మాట తీసెయ్యడం సమంజసంగా లేదు, పరిశీలించండి. మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తాను.__చదువరి (చర్చరచనలు) 04:42, 13 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Venkataramanauv గారూ, రెండు రోజులైంది. వివాదాస్పద అనే పదాన్ని ఎందుకు తొలగించారనే విషయమై మీ అభిప్రాయం ఇంకా ఇవ్వలేదు. మరొక్క రెండు రోజులు చూస్తాను. మీరు వివరణ ఇవ్వకపోతే, మీదగ్గర అందుకు వివరణ ఏమీ లేదని భావించి ఆ పదాన్ని నేను మళ్ళీ చేరుస్తాను. గమనించగలరు. __07:34, 15 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Venkataramanauv గారూ, మరో మూడు రోజులు, మొత్తం ఐదు రోజులైంది. వివాదాస్పద అనే పదాన్ని ఎందుకు తొలగించారనే విషయమై మీ వివరణ ఇంకా ఇవ్వలేదు. మరొక్క రెండు రోజులకు వారం అవుతుంది. ఈ లోగా మీరు వివరణ ఇవ్వకపోతే, ఆ పదాన్ని నేను మళ్ళీ చేరుస్తూ, మీరు ఇటీవల చేసిన మార్పును రద్దు చేస్తాను. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 05:55, 18 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Venkataramanauv గారూ, పది రోజులు దాటిపోయింది. కానీ మీరు స్పందించనే లేదు. అంచేత, మీరు చేసిన దిద్దుబాట్లను తిరిగి వెనక్కి తీసుకువెళ్ళాను. ఇక ఆ పాఠ్యంలో మార్పులేమైనా చెయ్యదలిస్తే ఈ చర్చాపేజీలో చర్చించిన తరువాతే చెయ్యండి. నేరుగా మార్పులు చెయ్యకండి. __— ఇక్కడి సంతకం లేని వ్యాఖ్య రాసినవారు: Chaduvari (చర్చరచనలు) __చదువరి (చర్చరచనలు) 06:52, 30 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

2023 ఆగస్టు 5 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన

[మార్చు]

సార్ ... నేను చేసిన మార్పులు ప్రచురితమయ్యేలా చూడగలరని విన్నపం.