త్రైత సిద్ధాంతము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచములో ఏ మత మూలగ్రంథమైనా మనిషి మోక్షమువైపు పోవు మార్గమును బోధించును. ఆ గ్రంథముల సారమంతయు త్రైత సిద్ధాంతముపైననే ఆధారపడియున్నది[1].అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతములు ఒక మతమునకు పరిమితముకాగా ఆ సిద్ధాంతములను అధిగమించిన త్రైత సిద్ధాంతము మతాతీత జ్ఞానమును, సర్వమానవాళికి అవసరమైన ఆధ్యాత్మిక సంపదను ప్రసాదించుచున్నది.[2] అటువంటి గొప్పదైన మరుగున పడ్డ త్రైత సిద్ధాంతమును గూర్చి తన గ్రంథములలో తెలియచేసారు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులువారు.[3]

త్రైతం[మార్చు]

త్రైత సిద్ధాంతము అనునది ఒక మతమునకు సంబంధించినది కాదు. త్రైతము అనగా మూడు. సృష్టి ఆది నుండి సర్వ జీవరాశులలో పరమాత్మ మూడు ఆత్మలుగా ఉన్నాడని, ఆ మూడు ఆత్మల వివరమును సిధ్ధాంత పరముగా వివరించునదే ఈ త్రైత సిధ్ధాంతం. నీవు అయిన జీవునికి పరమాత్మ అయిన దేవునికి మధ్యవర్తిగా ఉండి శరీరాన్ని ఆడించున్న శక్తి అయిన ఆత్మను గురించి తెలుసుకోవటమే ఆధ్యాత్మికం. పరమాత్మ అణువణువునా విశ్వమంతా అన్నింటి యందూ లోపలా మరియు బయట వ్యాపించి ఉన్నాడు అని, ఆత్మ శరీరము అంతా వ్యాపించి ఉన్నాడు అని, జీవాత్మ శరీరములో ఒక చోట భ్రూమధ్య స్థానములో సూది మోపునంత జాగాలో ఉన్నాడు అని, పరమాత్మ లేని వస్తువు కాని, జీవ రాశి కాని ఈ జగత్తులో లేదు అని ఈ త్రైత సిద్ధాంతము ద్వారా తెలియబడుతుంది.

పూర్వము పెద్దలచే, యుగముల పేర్లు ఈ త్రైత సిద్ధాంత జ్ఞానము ఆధారముగా పెట్టబడినవనీ, యోగము అన్న మాట ఈనాడు యుగము అని పిలవబడుతుంది అని, పూర్వము వీటిని కృత్ యోగము, త్రైతా యోగము, ద్వాపర యోగము, కలి యోగము అని పిలిచే వారని రాను రాను ఆ పేర్లు కృత యుగము, త్రేత యుగము, ద్వాపర యుగము, కలి యుగము లుగా స్థిరపడినవని తెలియుచున్నది[4]. కృత్ అన్నా, త్రేత అన్నా, ద్వాపర అన్నా, కలి అన్నా..... మూడవ ఆత్మయిన పరమాత్మని తెల్పినది ఈ గ్రంథము. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అను సిద్ధాంతములు ఒక మతమునకు సంబంధించినవి కాగా త్రైత సిధ్ధాంతం మాత్రం మతమునకు సంబంధము లేని పరమాత్మ జ్ఞానాన్ని తెల్పుతున్నదని వివరించింది. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అను సిద్ధాంతములు ఏర్పడుటకు గల కారణములను ఆ సిద్ధాంతముల లోని సారాంశమును "త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు" వారు వివరించారు.

త్రైత సిద్ధాంతమునకు ఆధారములు[మార్చు]

పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అను మూడు ఆత్మల విధానమే త్రైతమనీ, ఈ విధానమే భగవద్గీత, బైబిలు మరియు ఖురానులలో కలదని శాస్త్రబద్ధమైన వివరణతో నిరూపించబడింది.[5] త్రైత సిద్ధాంతమునకు ఆధారములు:-

* పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత గ్రంథములోని పురుషోత్తమప్రాప్తి యోగము అధ్యాయము లోని 16,17 వ శ్లోకములు.[6]

* పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని మత్తయి సువార్త లోని 28 వ అధ్యాయము 19 వ వచనము.[7], [8]

* పవిత్ర ఖుర్-ఆన్ గ్రంథములోని 50 వ సుర (ఖాఫ్),21-22 ఆయతులు.[9]

దేవుని చిహ్నము[మార్చు]

వైష్ణవులు నిలువునామములు, శైవులు మూడు అడ్డనామములు, ద్వైతులు బొట్టును ధరిస్తారు[10]. త్రైతులు (త్రైత సిద్ధాంతము అనుసరించేవారు) ధరించే బ్రహ్మ, కాల, కర్మ, చక్రముల ముద్రను వారు దైవ చిహ్నముగా పేర్కొంటారు. సర్వ జీవరాశుల (కుల, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా) నుదిటి భాగంలో సూక్ష్మంగా ఉన్న బ్రహ్మ, కాల, కర్మ, గుణ చక్రముల అమరికను, జీవునికి వాటికి గల సంబంధాన్ని [11]

Brahma, Kaala, Karma, Guna chakramulu

ఆచార్యప్రబోధానందయోగీశ్వరులువారు రచించిన "దేవునిచిహ్నము" అనుగ్రంధము ద్వారా, మూడు దైవగ్రంధముల భగవద్గీత, బైబిలు, ఖురాన్ సాక్షిగా "దేవునిచిహ్నము" బయటకు తెలుపబడింది.దేవుని యొక్క గుర్తును దేవుని చిహ్నము అని అనవచ్చును వారు చెప్పుతుంటారు. క్రింద ఇవ్వబడిన దేవుని చిహ్నం వివరణ శ్రీ ప్రబోధానంద గారి రచన అయిన " దేవుని చిహ్నం"[12] అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది.

దేవుని చిహ్నము దేవుని శక్తితో సమానమైన లేక దేవుని విలువతో సమానమైన గుర్తు. దేవుడు తన గుర్తును తానే చెప్పినప్పుడు మనుషులు తెలియగలరు గానీ, మనిషి స్వయముగా దేవున్ని గురించి గానీ, దేవుని గుర్తును గురించిగానీ చెప్పలేడు.
అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్ లో సురా 3 ఆయత్ 7 ప్రకారము :"దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియదని", ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీత రాజవిద్యా రాజగుహ్యా యోగము 2 వ శ్లోకము ప్రకారం "దేవుని జ్ఞానము రహస్యములలోకెల్ల రహస్యమైనదని", మధ్య దైవగ్రంథము బైబిలులోని యోహాన్ సువార్త మొదటి అధ్యాయము 5 వ వాక్యము ప్రకారము "ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదిగానీ చీకటి దానిని గ్రహించ కుండెను" అని చెప్పబడివున్నది.దేవుని జ్ఞానముగానీ, దేవుని గుర్తు గానీ ఏ మానవునికి తెలియదు. మూడు దైవగ్రంథముల సాక్షిగా మనిషికి దేవున్ని గురించి ఏమీతెలియదు. దేవుడు చెప్పినప్పుడు దేవుని బోధ ద్వారా మనిషి తెలియవలసి ఉంది. అయితే దేవుడు ఎప్పుడు చెప్పునో? ఎలా చెప్పునో? ఎవరికి తెలియదు. అందువలన దేవుడు స్వయముగా జ్ఞానమును చెప్పినప్పుడు మనిషి దానిని సులభముగా తెలియవలసి వుండినా, చెప్పేవానిమీద నమ్మకము లేనిదానివలన దేవుడు చెప్పినా, చెప్పేవాడు దేవుడని గానీ, చెప్పబడేదే అసలయిన జ్ఞానమనిగానీ మనిషి తెలియలేకపోవుచున్నాడు. దేవుని గురించి తెలుసుకొను శక్తిని మనిషికి దేవుడే ఇవ్వాలి. లేకపోతే మనిషి స్వయముగా దేవున్ని గురించి తెలియలేడు.

దేవుని జ్ఞానము మానవ జాతికి సంబంధించినది అయినందున దేవుని చిహ్నము కూడా మొత్తము మానవజాతికి సంబంధించినదిగా ఉండునుగానీ, ఒక మతమునకు సంబంధించి యుండదు. దేవుని చిహ్నము దైవగ్రంథములతో సంబంధపడియుండునుగానీ మతములతో సంబంధపడి యుండదు. ఇంటి వర్ణనను బట్టి ఇల్లును చిత్రించినట్లు దేవుని జ్ఞానమునుబట్టి దేవుని చిహ్నమును చిత్రించవచ్చును.దేవుని జ్ఞానముతో ఇమిడియున్న దేవుని చిహ్నము మతాలకు, మనుషుల జ్ఞానమునకు అతీతముగా ఉండును. దేవుని చిహ్నము దేవుని జ్ఞానముతో కూడియుండును. దేవుని చిహ్నమును గురించి మూడు దైవగ్రంథములయిన భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలో ఉండగా అ విషయము ఏ మతస్థునికి అర్థము కాకుండా పోయింది.
ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో :
అక్షర పరబ్రహ్మ యోగమున 24 నుండినుండి 28 వరకు గల శ్లోకములు దేవునిచిహ్నము ఆధారముతోనే చెప్పియున్నవి. ద్వితీయ దైవగ్రంథమయిన బైబిలులో:
యోహాను సువార్త 14వ అధ్యాయమందు ఆరవ వాక్యమున (4-14-6) "నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రివద్దకు రాలేడు", అనిదేవునిచిహ్నమునుగూర్చిచెప్పబడియున్నది.
ప్రకటనలగ్రంథములో 9వఅధ్యాయమున 4వవచనములో (9-4) : “నొసళ్లయందుదేవునిముద్రలేనిమనుష్యులకేతప్పభూమిపైనున్నగడ్డికైననూ, ఏమొక్కకైననూ, మరిఏవ్రుక్షమునకైననూహానికలుగజేయకూడదనివాటికిఆజ్ఞఇవ్వబడెను" అనికలదు.
ఈవాక్యమున దేవుని ముద్ర అని స్పష్టముగా చెప్పబడి ఉండడమే కాక అది ఒక స్థూలమైనదిగా వుంటూ నుదుటిమీద ధరించగలదిగా యున్నదని తెలియుచున్నది. “దేవుని ముద్ర” అను పదము వాడిన కారణంగా అది దేవునిశక్తితో సమానమైనదిగా వున్నదని తేలిపోవుచున్నది. కావున మతపరమైన లేక ప్రపంచపరమైన, వస్తువులను కాని చిహ్నములను కాని దేవుని ముద్ర అనకూడదు.
అంతిమదైవగ్రంథమైన ఖురాన్లో:
(5-2) "విశ్వసించిన ఓ ప్రజలారా! అలాహ్ చిహ్నాలనుగానీ, నిషిద్ధమాసమును గానీ అగౌరవ పరచకండి"అని ఉంది. అట్లే (22-32) "అల్లాహ్ చిహ్నాలను ఎవరయినా గౌరవిస్తున్నారంటే అది వారి హృదయాలలోని భక్తి భావన వల్లనే సుమా!" అనిదేవుని చిహ్నమును గురించి చెప్పియున్నారు.

ప్రస్తుత కాలములో భూమిమీద పన్నెండు మతములున్నవి. ఒక్కొక్క మతము ఒక గుర్తును గానీ, అంతకంటే ఎక్కువ రెండు లేక మూడు గుర్తులు కల్గివుండడము చూస్తూనే ఉన్నాము. శిలువ గుర్తును చూస్తూనే ఇది క్రైస్తవము అని చెప్పవచ్చును. అలాగే నిలువునామములనుగానీ, అడ్డనామములనుగానీ, 'ఓం'కారమునుగానీ చూస్తూనే ఇది హిందువుల గుర్తని చెప్పవచ్చును. అట్లే చంద్రవంక, నక్షత్రమును చూచినా ఇది ఇస్లాం మతము యొక్క గుర్తని ప్రజలు చెప్పుచుందురు. దేవుని చిహ్నము దైవగ్రంథములతో సంబంధపడి యుండును గానీ, మతములతో సంబంధపడి యుండదు.

దేవుని చిహ్నమును కొత్తగా చూచిన ఎవరికయినా దాని గురించి తెలుసుకోవాలను ఆసక్తి పుట్టుట తప్పక జరుగును. దేవుని చిహ్నమును లేక గుర్తును దేవుని ముద్ర అనవచ్చును. ముద్ర అనగా నిర్ణయించబడినదని అర్థము. రాజముద్రను రాజుయొక్క సైన్యము గౌరవించినట్లే, దేవుని చిహ్నమును చూచి దేవదూతలు, గ్రహములు, భూతములు గౌరవించును. రాజముద్ర ప్రజలు తెలియకున్న, రాజు పాలనలోని పాలకులందరికీ తెలిసినట్లు, దేవుని గుర్తు ప్రజలకు తెలియకపోయినా దేవుని పాలనలోని భూతములకు గ్రహములకు, దేవదూతలనబడు వారందరికీ తెలియును. మనకు తెలియనంతమాత్రమున ఇతరులెవరికీ తెలియదనుకోడము పొరపాటగును. మనకు తెలియని జ్ఞానరహస్యములెన్నో ఇతరులకు తెలిసియుండవచ్చును తెలియనప్పుడు తెలుసుకొనుట మానవుని కర్తవ్యము. ఒకసారి దేవుని చిహ్నమును గురించి తెలుసుకున్న వారు దేవుని చిహ్నమును తమ నుదుటిపై ధరిస్తారు. ఆవిధముగా దేవుని చిహ్నము ధరింపబడిన వారిని దేవుని జ్ఞానము తెలుసుకొను జ్ఞానులుగా దేవుని పాలకులు గుర్తిస్తారు. సూక్షమైన దేవుని జ్ఞానము బోధల రూపలో ఉండగా, దృశ్య రూపములో చూచుటకు సాధ్యమేనా?. సాధ్యమే!
భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము అను అధ్యాయములో 10,11 శ్లోకములలో ఈ విధముగా ఉన్నది చూడండి.
10: "జీవాత్మ గుణములుడై శరీరములో నివాసముండును. గుణముల మధ్యలో వుంటూ విషయ సుఖములను అనుభవించుచుండును. ఈ విధానమును మూఢులు తెలియలేరు. జ్ఞాననేత్రులు మాత్రము చూడగల్గుదురు".
11: "శరీరములోయున్న ఆత్మను, జీవాత్మను ప్రయత్నము చేయు యోగులు తెలియగలరు. మూడులైనవారు ఎంతప్రయత్నించిననూ శరీరములోని తతంగమును దైవయంత్రాంగమును చూడలేరు.
కావున, ఫూర్తి శ్రద్ధ గల్గిన మనిషి దేవుని జ్ఞానమును అర్థము చేసుకోగల్గును. దైవగ్రంథములలో ప్రమాణములుగా చెప్పినట్లు నిదర్శనమును దర్శనముగా చేసుకొనిన:

1.దేవుడుతనజ్ఞానములోమొదటతనసృష్టినిగురించిచెపాడు. భూమి(శరీరము) మరియు ఏడు ఆకాశములు(నాడీకేంద్రములు). భగవద్గీతయందుగలవిభూతియోగమనుఅధ్యాయమున6వశ్లోకములో " మహార్షయసప్త" అనుపదమునుతీసుకొనిచూస్తేమనశరీరములోగలఏడుఆకాశములవివరముతెలియగలదు.
ఖురాన్: సురా29 ఆయత్44: "ఆల్లాహ్ భూమిని, ఆకాశములను సత్యబద్దముగా సృష్ఠించాడు. ఆకాశములను భూమిని పరమార్థముతో సృష్ఠించాడని తెలిసితే ఇందులో గొప్ప నిదర్శనము దొరుకుతుంది". ఇప్పుడు తెలియబడు విషయమును గ్రహించలేకపోతే, అటువంటి వారు పరమార్థమును తెలియలేరు, నిదర్శనమునూ తెలియలేరు.

2.సృష్ఠితరువాతమూడుఆత్మల (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ) జ్ఞానము దేవుడు తెలిపాడు. మూడు ఆత్మల గురించి మూడు గ్రంథములలోనూ గలదు.
భగవద్గీత: పురుషోత్తమ ప్రాప్తియోగము 16, 17: క్షర (జీవాత్మ), ఆక్షర (ఆత్మ), ఫురుషోత్తమ (పరమాత్మ).
బైబిల్: మత్తయి 28-19: కుమారుడు (జీవాత్మ), తండ్రి (ఆత్మ), పరిశుద్ధాత్మ (పరమాత్మ).
ఖురాన్: 50-21: తోలబడేవాడు (జీవాత్మ), తోలేవాడు (అత్మ), సాక్ష్యమిచ్చేవాడు (పరమాత్మ).
3.తరువాతముఖ్యమైనజ్ఞానముమనుషులుచేసుకొనుపాపపుణ్యములనబడు“కర్మ”నుగురించితెలుసుకొనుజ్ఞానము. కర్మను గురించి మూడు దైవగ్రంథములలో ఎంతో వివరణ ఇచ్చారు. కర్మ మనిషి శరీరములోనే పర్యవేక్షకుని చేత వ్రాయబడుచున్నదని అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్లో చెప్పారు. కర్మలిఖితమును "కర్మ పత్రమని” చెప్పడమేకాక కర్మ ఒక దివ్యగ్రంథమందు నమోదు చేయబడుచున్నదని కూడా చెప్పారు. కర్మను అనుభవించక ఎవరూ తప్పించుకోలేరని చెప్పడమేకాక, దేవుడు ఒక్కడే దానిని క్షమించు క్షమాశీలుడని కూడా చెప్పారు. కర్మ మన శరీరములో ఎట్లున్నదీ, ఎక్కడున్నదీ, రహస్య జ్ఞానముగా ఖురాన్లోనూ, భగవద్గీతలోనూ చెప్పారు.
4. చివరిగాప్రతికర్మకు, ప్రతి పనికి ఒక గడువు ఉన్నదనీ, ప్రతి గడువు “కాలము”లో నిర్ణయింపబడి వున్నదని దేవుడు తన జ్ఞానములో చెప్పాడు.
ఈవిధముగాదేవునిజ్ఞానమునుముఖ్యమైన4 పాయలుగా(భాగములు) చెప్పాడు. మూడు దైవగ్రంథములలో ఈ నాలుగు జ్ఞానములే ముఖ్యముగా చెప్పబడినవి. ఈ నాలుగు భాగముల జ్ఞానమును దర్శనముగా చేసుకోగలిగితే అదే దేవుని చిహ్నమగును. దేవుని జ్ఞానమును ఎలా దృశ్యరూపమైన చిహ్నముగా చేసుకోవాలో ఇప్పుడు వివరించుకొందాము:

దేవుడు మొదట భూమిని, ఏడు ఆకాశములను సృష్థించాడు. దానిని దృశ్యరూపముగా చేసుకొన్నప్పుడు శరీరము భూమిగా, ఏడు ఆకాశములు శరీరములోగల శరీరమును నడుపు ఏడు నాడీకేంద్రములుగా చెప్పుకొన్నాము. ఏడవ నాడీకేంద్రము పైన దేవుని సింహాసనమున్నట్లు, దేవుడు అక్కడ ఉన్నట్లు ఖురాన్ గ్రంథములో చెప్పారు.
ఖురాన్ గ్రంథములో సురా67, ఆయత్ 3 లో (67-3)"ఆయన ఏడు ఆకాశములను ఒకదానిపై ఒకటి నిర్మించాడు. నీవు ఎటు చూచినా కరుణామయుని సృష్ఠి ప్రక్రియలో ఎటువంటి లోపము తెలియలేవు. కావాలంటే మరోసారి ద్రుష్ఠిని సారించి చూడు, నీకేమయినా లోపము కనిపిస్తుందేమో!".
దేవుడు నివసించు నివాసమును బ్రహ్మచక్రము అంటాము. బ్రహ్మచక్రము అనగా దేవుని చక్రమని అర్థము. దేవుని చక్రము రెండు భాగములుగా ఉంది. ఒక భాగము దేవుని పగలు, మరొక భాగము దేవుని రాత్రి. భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగమున 17వ శ్లోకమున “వేయియుగములు దేవునికి ఒక పగలు, అట్లే వేయియుగములు దేవునికి ఒక రాత్రి” అని చెప్పారు. దేవుని చక్రము ఒక చుట్టు తిరుగుటకు రెండువేల యుగుముల కాలము పట్టునని తెలియుచున్నది. దేవుని యొక్క పగలు, రాత్రిని గ్రహించగలిగితే ఎంతో ఉన్నతమైన జ్ఞానమును మనిషి తెలియగలడు.ఖురాన్ గ్రంథములో సురా 24, ఆయత్ 44 లో (24-44) "అల్లాహ్ రేయింబవళ్ళను మారుస్తూ ఉంటాడు. కళ్ళున్నవానికి ఇందులో గొప్ప గుణపాఠము కలదు".ఈవిధముగాఏడు ఆకాశములు మన శరీరములో ఎట్లున్నదీ తెలిసిపోయింది. తర్వాత ఏడు ఆకాశముల మీద దేవుని స్థానము ఎట్లున్నదీ గుర్తించగలిగాము.
అదే విధానముతో దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకారము మూడు ఆత్మల విధానము, కర్మవిధానము, కర్మయొక్క గడువు విధానమును దృశ్యరూపములో చూచుటకు ప్రయత్నిద్దాము. మొదట జీవాత్మ నివాసమును గురించి భగవద్గీత శ్లోకము ప్రకారము మరియు ఖురాన్ వాక్యము ప్రకారము చూచుటకు ప్రయత్నిద్దాము. ఏడు ఆకాశముల పైన పరమాత్మ ఉన్నట్లు అక్కడే ఏడు ఆకాశముల మీదనే జీవాత్మ కూడా ఉంది. జీవాత్మ పరమాత్మ స్థానముకంటే కొద్దిగా క్రింద నివాసముండును. దానినే దృశ్యరూపముగా చిత్రించుకొని క్రింది పటములో చూద్దాం.

ఈ చిత్రములో ఏడవ ఆకాశము మీదగల బ్రహ్మ చక్రములో రెండు భాగములయందు దేవుడు కలడు. ఏడు ఆకాశముల పొడవునా ఆకాశము మధ్యలో అనగా ఏడవ ఆకాశమునుండి ఒకటవ ఆకాశము వరకు ఆత్మ గలదు. ఏడవ స్థానములోనే అనగా బ్రహ్మచక్రము క్రింద మూడవ చక్రముగా యున్న గుణచక్రమందు జీవుడు (జీవాత్మ) నివాసమున్నాడు. ఏడవ స్థానములో గల నాలుగు చక్రములలో పైది బ్రహ్మచక్రముకాగా క్రిందిది గుణచక్రముగా ఉంది. గుణచక్రము మూడు భాగములుగా ఉంది. మూడు భాగములలో ఏడో ఆకాశములోనే అల్లాహ్ కంటే క్రింద గుణచక్రములో జీవాత్మ ఉండగా, ఏడు ఆకాశముల పొడవునా బ్రాహ్మణాడియందు ఆత్మ ఉంది. ఈ విధముగా మూడు ఆత్మల నివాసము తేలిపోయి దర్శనరూపములోనికి వచ్చింది.

ఇప్పుడు కర్మ గురించి చూస్తే ఇలా ఉంది. కర్మచక్రము 12 భాగములుగా ఉంది. అందులో 1,5,9 స్థానములలో పుణ్యము నిలువవుండును. అలాగే 3,7,11 స్థానములలో పాపము నిలువయుండును. మిగతా 2,4,6,8,10,12 స్థానములలో పాపపుణ్యములు రెండు గలవు. మనిషి చేసుకున్న పాపములు పుణ్యములు కర్మచక్రములో ఆయా స్థానములయందు ఆత్మ చేత నమోదగుచుండును. అలాగే ఆత్మ చేతనే అనుభవింప చేయబడుచుండును. అయితే కర్మ చక్రము కంటే క్రిందగల గుణచక్రముతో కర్మ చక్రమునకు సంబంధ ముండును. కర్మచక్రములోని కర్మ (పాపపుణ్యములు) క్రింది చక్రమయిన గుణచక్రము మీద ప్రసరించడము వలన అక్కడున్న జీవుడు దానిని అనుభవించును. ఇదే విషయమే ఖురాన్ గ్రంథములో సురా 2 ఆయత్ 134లో (2-134) "అది గతించిన ఒక సమూహము. వారు చేసుకొన్నది వారికే చెందుతుంది. మీరు చేసినది మీకు చెందుతుంది. ఇతరుల కర్మల గురించి మీరు ప్రశ్నింపబడరు". అని గలదు. దీనిని బట్టి పైన కర్మ చక్రములో ఏమి నమోదయివుంటే క్రింది చక్రములో గల జీవునికి అదే అనుభవమునకు వచ్చును. ఇతరుల కర్మతో జీవునికి సంబంధమే లేదు. దాని ప్రక్రియలో గుణచక్రములోని గుణములు జీవుని మీద ప్రయోగించబడును. గుణచక్రమును బాగా పరిశీలించిన ఈ విధముగా ఉంది.

Guna Chakram

గుణచక్రము మూడుభాగములుగా ఉంది. ఒక్కొక్క భాగమున వేరువేరు పేర్లుగల పన్నెండు గుణములు గలవు. ఒక్కొక్క భాగములో గల గుణములకు ఒక్కొక్క పేరున్నది. పై భాగములో గల గుణములను తామస భాగ గుణములని చెప్పుచుందురు. అట్లే మధ్యలోయున్న దానిని రాజస గుణ భాగము అని అంటాము. అట్లే మూడవ దానిని సాత్త్విక గుణభాగము అంటాము. మధ్యలో గుండ్రముగాయున్న భాగము బ్రాహ్మణాడిగా ఉంది. దానిని గుణరహిత భాగము (గుణములేని భాగము) అని అంటాము. ఈ మూడు గుణభాగములలోనూ గుణములు గలవు ఒక్కొక్క భాగములో 12 గుణములు ఉన్నాయి. అందులో ఆరు మంచి గుణములు, ఆరు చెడు గుణములు గలవు. చెడు గుణములు వరుసగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము అని అంటారు. మంచి గుణములను వరుసగా దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమ అని అంటారు. చెడు గుణములలో జీవుడు చేరితే పాపము వచ్చును.మంచి గుణములలో జీవుడు చేరితే పుణ్యము వచ్చును. జీవుడు తామస, రాజస, సాత్త్విక అను మూడు గుణ భాగములయందు తిరుగుచుండును. ఏ ఒక్క గుణభాగములో కూడా శాశ్వతముగా ఉండడు. అయితే ఎక్కువ కాలము ఏ భాగములో గడిపితే ఆ భాగము యొక్క పేరు వానికి వచ్చుచుండును. తామసములో ఎక్కువకాలముయున్న వానిని తామసుడనీ, రాజసములో ఎక్కువకాలమున్న వానిని రాజసుడనీ, సాత్త్వికములో ఎక్కువ కాలమున్న వానిని సాత్త్వికుడని అంటాము.

దేవుడు ఏడవ స్థానమున వుండి క్రిందికి దిగే కర్మను, పైకి ఎక్కే కర్మను చూస్తున్నాడు. దేవుడు సాక్షిగా మాత్రమున్నాడు. రెండవ ఆత్మ మాత్రము శరీరములో కార్యములన్నీ చేస్తోంది. ప్రతి విషయములో జీవున్ని కర్మ బద్ధున్ని చేసి కర్మను అనుసరించి నడుపుచున్నది. ఇదే విషయమే ఖురాన్ గ్రంథములో సురా 34 ఆయత్ 2లో (34-2) "భూమిలోనికి వెళ్ళేది, దానినుండి వెలువడేది, ఆకాశమునుండి దిగేది, అందులోనికి (ఆకాశములోనికి) ఎక్కిపోయేది అంతా ఆయనకు (దేవుని) తెలుసు. ఆయన అపార కరుణా ప్రదాత, క్షమాశీలి"అని ఉంది.
దేవుని జ్ఞానము ప్రకారమే కర్మ జీవుని మీదికి దిగేది, జీవుని నుండి కర్మచక్రములోనికి నమోదు అయ్యేది, కచ్చితముగా మనము దృశ్యరూపము చేసుకొన్నాము. కర్మ చక్రము పైన కాలచక్రము ఉంది. కాల చక్రములో ప్రతి దానికి కాల గడువు నిర్ణయించబడియుండును. కాల చక్రములో నిర్ణయించిన కాలము యొక్క గడువు ప్రకారము క్రింద కర్మ చక్రములోని కర్మ జరుగుచుండును. అందువలన ఎప్పుడు చనిపోవలసిన వాడు అప్పుడే చనిపోవును. జరుగవలసిన కార్యమేదయినాగానీ ఒక్క సెకండు కూడా తేడా లేకుండా జరుగును. అది కాలచక్రములోని కాలము యొక్క నిర్ణయమును ఎవరూ మార్చలేరు. కాలచక్రమును క్రింద దృశ్య రూపముగా చూచుకొందాము.

Kaala chakram

కాలచక్రము మొత్తము పన్నెండు భాగములుగా యున్నది. ఒక్కొక్క భాగము ఒక్కొక్క పేరుతో ఉంది. ప్రతి భాగమునందు రెండు గంటల కాలముండును. ఆ కాలచక్రము, కర్మ చక్రము, గుణచక్రము ఒకదానితో ఒకటి సంబంధపడియుండి తిరుగుట వలన, వేరు వేరు సమయములలో, వేరు కర్మలను, వేరువేరు అనుభవములుగా జీవుడు అనుభవించుచుండును. దేవుడు తన జ్ఞానము ప్రకారమే మనిషిని సృష్ఠించి, తన జ్ఞానము ప్రకారమే నడుచునట్లు చేశాడు. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. ఆయనకు తెలియకుండా ఏమీ జరుగవు. దేవుని జ్ఞాన పరమార్థమును, నిదర్శనమును పూర్తి దర్శనముగా చూచుకొంటే క్రింద చిత్రించిన విధముగా కలదు చూడండి.

మనిషి శరీరములో మనిషికి మూలమైన ఈ చక్రము ఉండుట వలన, భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమున మొదటి శ్లోకములోనే "ఊర్థ్వమూల"అని చెప్పియున్నారు. ఆ మాటకు పైన మూలమున్నదని అర్థము.
దేవుని గ్రంథములలో గల దేవుని జ్ఞానమును దృశ్యరూపము చేసుకొంటే అది దేవునికి సంబంధించిన ముద్రయగును. రాజు శాసనములకు గుర్తుగా రాజముద్ర ఉన్నట్లు, దేవుని ధర్మములకు గుర్తుగా దేవుని ముద్ర లేక దేవుని చిహ్నము కలదు. దేవుని చిహ్నము, దేవుని జ్ఞానమునకు ప్రతిరూపముగా ఉండుట వలన అందులో దైవశక్తి కలదని చెప్పవచ్చును. దైవశక్తి ఎక్కడవుండునో అక్కడ కర్మ కాలిపోవును. అగ్ని ఎక్కడుంటే అక్కడ మండే వస్తువులు ఏవి వున్నా అగ్నిచేత కాలిపోవునట్లు, దైవశక్తి ఉన్నచోట ఏ కర్మలున్నా జ్ఞానాగ్నికి అంటుకొని కాలిపోవును. ఈ నాలుగు జ్ఞానముల మినహా ఆధ్యాత్మిక జ్ఞానము లేదు. దేవుని జ్ఞానములో ఏది చెప్పినా ఈ నాలుగు అంశముల జ్ఞానమే ఉండును. ఆధ్యాత్మిక జ్ఞానములో పై నాలుగు జ్ఞానములే ముఖ్యమైనవగుట వలన, దేవుని ముద్రగా చూపబడిన చిత్రమునకు లేక ఆకారమునకు దైవశక్తియుండునని తెలియుచున్నది.
దీనికి ఆధారము భగవద్గీత గ్రంథములో జ్ఞానయోగమును అధ్యాయమున 37వ శ్లోకమున
“యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కురుతేర్జున!
జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా!! “
భావము: "కట్టెలు అగ్నిలో పడితే ఏ విధముగా కాలి బూడిద అయిపోతాయో, అదే విధముగా జ్ఞానము అను అగ్నిలో కర్మలను కట్టెలు కాలిపోవును". భగవద్గీతలో చెప్పిన దానిప్రకారము జ్ఞానాగ్ని ఎక్కడయున్నా అక్కడ గల కర్మ కట్టెలను కాల్చివేయును.

మోక్షం[మార్చు]

ఆత్మహత్య, ఆత్మాబిమానం, ఆత్మద్రోహం అను పదాలను నిత్యం ఉపయోగిస్తున్నప్పటికి ఆత్మ అంటే ఏమిటో ఇంత వరకు ఎవరికి తెలియబడలేదు. మూడు ఆత్మల వివరము తెలియనిదే భగవద్గీతకాని, బైబిలుకాని, ఖురానుగాని అర్దంకావు అన్నది వాస్తవము అని వీరి అభిప్రాయం[13]. జ్ఞానేంద్రియమైన కన్ను మరియు కర్మేంద్రియమైన చేయిలలో ఉన్న పరమాత్మ యొక్క మూడు ఆత్మల వివరము మనకు దేవుడు ఎదురుగా పెట్టి తెలియచేసాడని అవి అర్థము అయిన నాడే భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథాలలో గల పరమాత్మ జ్ఞానము శాస్త్రబద్ధముగా, హేతుబద్ధముగా అర్థము అవుతుందని త్రైత సిద్ధాంతము గూర్చి తెలుసుకొన్నవారికి అర్థం అవుతుంది[14]. త్రైతసిద్ధాంత ఆధారముగా జ్ఞానము గ్రహించినవారికి కర్మలు తొలగి, జన్మరాహిత్యము కలిగి వారు మోక్షము పొందుతారని తెలియబడుతుంది.

ప్రతి మానవుడు మోక్షము అనగానేమి? అని తెలుసుకోవలయును[15]. మోక్షమును గురించి తెలుసుకోలేకపోయిన మానవుడు ఆత్మను తెలుసుకొనటకు ఏమాత్రము ప్రయత్నించడు. ఎవరైనా చెప్పినప్పటికీ దానితో మనకేమి ప్రయోజనమున్నది? అని అంటాడు. మోక్షము యొక్క విలువ తెలుసుకోలేని మానవుని జీవితము వాసన లేని పువ్వుతో సమానము. మోక్షము యొక్క అర్థము తెలుసుకోలేని మానవుడు "పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా" అన్నట్లు ఉన్నను, లేకున్నను ఒక్కటే, మోక్షమును గురించి తెలుసుకోలేనివారి భక్తి, గమ్యము తెలియని ప్రయాణములాగ వుండును. కొందరికి మోక్షము గూర్చి తెల్పి, మోక్షము చేరిన జన్మించనవసరము లేదనినా, దాని విలువ తెలియని అజ్ఞానులు "అక్కడకుపోయి ఊరకనే యుంటే ప్రొద్దు ఏలాగ గడుచును? చచ్చి పుట్టుతూ ఉంటే కదా ప్రొద్దు పోయేది" అని అంటూ ఉంటారు.ఇంకనూ మోక్షము గూర్చి చెప్పేవారిని చూసి, "మీకు తిక్కపట్టి మోక్షము మోక్షము అంటున్నారు, అది మాకు అవసరము లేదు" అని మందలిస్తూ అంటూ ఉంటారు. మోక్షమును గురించి తెలుసుకోలేనివారు ఎవరూ పరమాత్మ గురించి తెలుసుకొనుటకు ఇష్టపడరు. అంతేకాక పరమాత్మ విషయములయందు ఇష్టముగా వుండు వారిని ఇష్టపడరు. కావున ప్రతి మానవుడు మొదట మోక్షము గూర్చి తెలుసుకోవలయును.

విమర్శ[మార్చు]

త్రైత సిద్ధాంతము భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలో వున్నదను ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారి ప్రతిపాదనను వ్యతిరేకించే వారు[16], ఒప్పుకొనేవారు[17] [18] మూడు మతాలలో ఉన్నారు. సాంఘిక మాధ్యమాలలో పలు సందర్భములలో త్రైత సిద్ధాంతమును గూర్చి చర్చలు జరిగినవి, జరుగుతున్నవి[19] [20] [21] [22].

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

 1. త్రైత సిద్ధాంత భగవద్గీత
 2. త్రైత సిద్ధాంతం
 3. దేవుని చిహ్నం
 4. హిందూమతములో సిద్ధాంత కర్తలు
 5. కలియుగము
 6. మతమార్పిడి దైవ ద్రోహం - మహా పాపం
 7. ప్రబోధ
 1. అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన వాక్యములు
 2. ఖురాన్ లో ఆణిముత్యాలు
 1. మతాలన్నిటికి ప్రాథమిక జ్ఞానం
 2. మత్తయి సువార్త మర్మాలు
 1. త్రైత సిద్ధాంత పరిశీలన
 2. త్రైత సిద్ధాంతం సూపర్ సైన్స్
 1. జ్యోతిష్య శాస్త్రం

మూలాలు[మార్చు]

 1. ప్రబోధానంద యోగీశ్వరులు, "త్రైత సిద్ధాంతము",2012,పేజీ నం.1;[1]
 2. ప్రబోధానంద యోగీశ్వరులు, "హిందూమతములో సిద్ధాంత కర్తలు";[2]
 3. దన్వంతరి,"త్రైత సిద్ధాంత పరిశీలన";
 4. ప్రబోధానంద యోగీశ్వరులు, "కలియుగము" పేజీ నం.31;[3]
 5. ప్రబోధానంద యోగీశ్వరులు,"త్రైత సిద్ధాంతం", 2012, పేజీ నం.8; [4]
 6. ప్రబోధానంద యోగీశ్వరులు,"త్రైత సిద్ధాంత భగవద్గీత",పిడిఫ్ పేజీ 388, పురుషోత్తమ ప్రాప్తి యోగము-పేజీ నం.11; [5]
 7. ప్రబోధానంద యోగీశ్వరులు, "మతమార్పిడి దైవ ద్రోహము- మహా పాపము",2013,పేజీనం.32;[6]
 8. బి.శ్రీను,"మత్తయి సువార్త మర్మాలు";
 9. ప్రబోధానంద యోగీశ్వరులు,"అంతిమ దైవగ్రంథములో జ్ఞాన వాక్యములు",2014, ...64. ప్రతీ ప్రాణీ తనను తోలే వాడూ, సాక్ష్యమిచ్చే వాడితోనే వస్తాడు, పేజీ నం.304; [7][permanent dead link]
 10. ప్రబోధానంద యోగీశ్వరులు,"త్రైత సిద్ధాంతం", 2012, పేజీ నం.46; [8]
 11. ప్రబోధానంద యోగీశ్వరులు, "కలియుగము" పేజీ నం.13;[9]
 12. ప్రబోధానంద యోగీశ్వరులు," దేవుని చిహ్నం",2015;[10]
 13. బి.యోహాన్,"మతాలన్నిటికి ప్రాథమిక జ్ఞానం,2015;
 14. ప్రబోధానంద యోగీశ్వరులు,"త్రైత సిద్ధాంతం", 2012, పేజీ నం.35; [11]
 15. ప్రబోధానంద యోగీశ్వరులు,"ప్రబోధ"- 3.మోక్షము, 1980, పేజీ నం.10; [12]
 16. [13]
 17. [14]
 18. [15]
 19. [16]
 20. [17]
 21. [18]
 22. [19]