చర్చ:త్రైత సిద్ధాంతము
ద్వైతము అద్వైతము లాగానే త్రైతము కూడా ఒక సిద్ధాంతము. ఈ పేజీని తొలగించకుండా ఆ సిద్ధాంత బోధనలు ఇంకా వివరంగా చేర్చితే బాగుంటుంది.--Nrahamthulla (చర్చ) 13:45, 26 అక్టోబరు 2014 (UTC)
- ఒహో అలాగా, నేను పుస్తకానికి విషయప్రాముఖ్యత లేదని అనుకున్నాను. అయితే పుస్తకంపై వ్యాసం తొలగించి త్రైతసిద్ధాంతంపై వ్యాసం సృష్టించాలి --వైజాసత్య (చర్చ) 18:37, 26 అక్టోబరు 2014 (UTC)
- అయ్యా సత్యాగారు Nrahamthulla గారు చెప్పినది సిద్ధాంత బోధనలు అంటే మొత్తము రచనల గూర్చి. త్రైత సిద్ధాంతము గూర్చి వివరణ ఈ గ్రంథములోనే వున్నది. ప్రతి గ్రంథములో ఆ సిద్ధాంత ఆధారముగానే సృష్టి లోని రహస్యములు ఎన్నో తెలుపబడినవి. ప్రతి గ్రంథము ఒక కొత్త విషయమును, 100% వాస్తవమును తెలుపుతుంది. అందుకే అన్ని విడివిడిగా వ్యాసాలుగా రాసాము. గమనించాలి.
- ఇందుశ్రీ ఉషశ్రీ (వాడుకరి చర్చ:ఇందుశ్రీ ఉషశ్రీ) 01:00 27 అక్టోబరు 2014 (IST)
- నేను త్రైతసిద్ధాంతం వ్యాసాన్ని మరింతగా అభివృద్ధి చేయటానికి సమాచారం కోసం వెతికాను, ఎక్కడా థర్డ్ పార్టీ సమాచారం లభించలేదు. త్రైత సిద్ధాంతమంటే en:Trinity నా? --వైజాసత్య (చర్చ) 02:18, 27 అక్టోబరు 2014 (UTC)
- సత్య గారూ,వికీ నియమాల ప్రకారం పుస్తకాలన్నిటినీ వికీ సోర్స్ లో చేర్చీ వాటి సారాంశాన్ని ప్రబోధానంద యోగీశ్వర్లు వ్యాసంలో క్లుప్తంగా వివరిస్తే సరిపోతుందనుకుంటున్నాను.--Nrahamthulla (చర్చ) 18:32, 29 అక్టోబరు 2014 (UTC)
- ఈ వ్యాసం వికీలో రాసినట్లుగా ఆధార సహిత వ్యాసంలా గాక ఏదో ఒక వ్యక్తికి కరపత్రిక లాగా ఉంది. "ఈ గ్రంథ రచయిత శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు యోగులకే ఈశ్వరుడు(అధిపతి) అనగా యోగీశ్వరులు అయినందువల్ల వారి శరీరము నుండి దివ్యాత్మ ప్రత్యేకమైన, శాస్త్రబద్ధమైన, ఎదురాడని జ్ఞానాన్ని అందిస్తున్నది. సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు ఎంతో రహస్యముగా వున్న సృష్టి రహస్యములను తెలియ చేయడము జరిగినది. " , ఏంటిది? ఈ వ్యక్తి భజనలు ఇక్కడ సరిపడవనుకుంటాను. వారు యోగీశ్వరులో , కపట యోగులో, యోగులకే అధిపతులో మనం బిరుదులివ్వనవసరం లేదు. నేను ఈ భజనలని తొలగిస్తున్నాను. ఒకవేళ తిరిగి ఉంచే పనైతే దయచేసి కారణం చెప్పగలరు. --వాడుకరి:దామోదర18:04, 9 సెప్టెంబరు 2016 (IST)
- ద్వైతము అద్వైతము లాగానే త్రైతము కూడా ఒక సిద్ధాంతము.ఈ వ్యాసం ఆ సిద్ధాంతమును వివరించే విధముగా రూపుదిద్దుకొనబోతున్నది. దీని కొరకు మరికొంత సమయము ఇవ్వగలరని కోరుతున్నాము.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 11:19, 3 అక్టోబరు 2016 (UTC)
- ఈ వ్యాసం త్రైత సిద్ధాంతం గురించి కాక, త్రైత సిద్ధాంతం అనే పుస్తకం గురించి రాసారు. సిద్ధాంతం గురించి వివరించేందుకు, వేరే వ్యాసం రాస్తే బాగుంటుంది, గమనించగలరు. అలాగే, మూలాలు అనే విభాగంలో వ్యాసంలోని విషయానికి సంబంధించిన మూలాలను మాత్రమే రాయాలి. ప్రస్తుతమున్న పాఠ్యం వికీ నియమాలకు అనుగుణంగా లేనందున తొలగించాను.__చదువరి (చర్చ • రచనలు) 12:58, 3 అక్టోబరు 2016 (UTC)
- వాడుకరి:దామోదరగారికి,చదువరిగారికి, సి. చంద్ర కాంత రావుగారికిద్వైతము అద్వైతము లాగానే త్రైతము కూడా ఒక సిద్ధాంతము.ఈ వ్యాసం ఆ సిద్ధాంతమును వివరించే విధముగా రూపుదిద్దుతున్నాను.మార్పు గమనించగలరు. దీని కొరకు మరికొంత సమయము ఇవ్వగలరని కోరుతున్నాము. దీనిని మొలక దశలో వున్న వ్యాసము గా గుర్తించి మరికొంత సమయము ఇచ్చి, తొలగింపు నోటిసు తొలగించవలసినదిగా కోరుతున్నాను. నేను వికీలో వ్యాసాలు రాయుటకు మీ అందరకు చాలా... జూనియర్ను, కాబట్టి మీ సూచనలు, సలహాలు ఇచ్చి ఈ రచనలో సహకరించగలరని ఆశిస్తున్నాను. ఈ వ్యాసం ఎటువంటి అభ్యంతరములు లేని వ్యాసముగా రూపు దిద్దుకొనుటలో మీ సూచనలు, సలహాలు నాకు అమూల్యం--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 14:11, 18 అక్టోబరు 2016 (UTC)
విషయ ప్రాధాన్యత, మూలాలు, మౌలిక పరిశోధన
[మార్చు]ఈ వ్యాసం మౌలిక పరిశోధన లాగా, ప్రచారం లాగా ఉంది. వ్యాసంలో తగిన మూలాలను ఇవ్వలేదు. దాదాపుగా ఇచ్చిన మూలాలన్నీ త్రైత సిద్ధాంతకర్త రాసినవే -అంటే స్వంత మూలాలు, ప్రాథమిక మూలాలునూ. ఆ మూలాలను తొలగించి, ఉచితమైన, ద్వితీయ స్థాయి (సెకండరీ) మూలాలను ఉదహరించాలి. (ప్రాథమిక మూలాలు మాత్రమే ఉండి సెకండరీ మూలాలు లేకపోతే సదరు విషయానికి వికీపీడియా అర్హత లేదు అని వికీపీడియా:విషయ ప్రాధాన్యత చెబుతోంది. ) ప్రస్తుత రూపంలో ఈ వ్యాసాన్ని ఒక ప్రచార వ్యాసంగానే పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని తొలగించాల్సి ఉంటుంది.
అయితే, ముందు తగు మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగుపరచే ప్రయత్నం చెయ్యాలనేది నా అభిప్రాయం. ఆ ఉద్దేశంతో తగు మూలాల కోసం జాలంలో వెతికితే అన్నీ వికీపీడియా, దాని మిర్రర్లు, త్రైత సిద్ధాంతం వారి వెబ్ సైటూ తప్ప సెకండరీ మూలాలు లభించలేదు. మూలాలు తెలిసిన వారు వాటిని చేర్చి దీన్ని మెరుగుపరచ గలరు.
గతంలో దాదాపుగా ఇదే కారణం చేత ఈ వ్యాసాన్ని తొలగించాలని ప్రతిపాదించారు. ఇద్దరు సభ్యులు తొలగింపును వ్యతిరేకించారుగానీ, వారు చెప్పిన కారణం అంత బలంగా లేదు (నాకు అనిపించలేదు). పైగా వాడుకరులు పెద్దగా చర్చలో పాల్గొనకపోవడాన కూడా తొలగింపు జరగలేదు. ఆ తరువాత వ్యాసాన్ని మెరుగుపరచే దిశగా ప్రయత్నం జరిగిందో లేదో తెలీదు. __చదువరి (చర్చ • రచనలు) 10:20, 12 ఆగస్టు 2017 (UTC)
చదువరి గారు నమస్తే. మీరు ఇచ్చిన సూచనలు నాకు మెయిల్ రాకపొవడంవల్ల గమనించలేకపోయాము. ఈరోజు గమనించి దానికి రిప్లై రాస్తున్నాము.
ఒక విషయము కొన్ని సంవత్సరముల క్రిందట ప్రాచుర్యములొ వుండి తిరిగి దాని పట్ల శ్రద్ధ సమాజానికి లేకపోవుట వల్ల మరుగున పడిపోవచ్చు. తిరిగి ఆ విషయాన్ని గుర్తించినవారు మరల తెలియచెసినప్పుదు సమాజానికి అది క్రొత్త విషయముగా అనిపించవచ్చు, కాని అది వాస్తవానికి మరుగున పడ్డ పాత విషయమే. అదే విధముగా త్రైత సిద్ధాంతము అన్నది మూడు దైవ గ్రంథాలలొ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలొ ప్రతిపాదించబడిన సిద్ధాంతము. ఈ మూడు గ్రంథాలు ఎన్నో భాషలల్లో, ఎన్నో పుస్తకాలు వున్నాయి. దాని వివరణ ప్రబోధానంద యోగీశ్వరుల వారు తమ రచనలలో విశదీకరించారు. అన్ని మతాల వారు ఎన్నో లక్షలమంది వీటిని చదివి జ్గ్నానవంతులు అవుతున్నారు. ఆ విషయము పరిశీలించిన పిదప ఈ వ్యాసం చేర్చడము జరిగినది. ఇంకా ఏ విధముగా ఈ వ్యాసానికి మార్పులు చేయాలో మీరు వివరీంచగలరు. --ఉషశ్రీ 07:17, 31 అక్టోబరు 2017 (UTC)