నాస్‌డాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాస్‌డాక్
రకంస్టాక్ ఎక్స్చేంజ్
ప్రాంతంవన్ లిబర్టీ ప్లాజా
165 బ్రాడ్‌వే, న్యూయార్క్, న్యూయార్క్ రాష్ట్రం, యు.ఎస్.ఎ.
స్థాపించినదిఫిబ్రవరి 4, 1971; 53 సంవత్సరాల క్రితం (1971-02-04)
యజమానిNasdaq, Inc.
ద్రవ్యమానం$ (అమెరికన్ డాలర్)
No. of listings3,295 (మార్చి 2018)[1]
Market capIncrease $7 ట్రిలియన్లు

నాస్‌డాక్ స్టాక్ మార్కెట్ (/ˈnæzˌdæk/) ఒక అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది న్యూయార్క్ లోనే ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తరువాత ప్రపంచంలో అతి పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్.[2] ఈ ఎక్స్చేంజ్ Nasdaq, Inc. అనే సంస్థ స్థాపించింది.[3] ఇదే సంస్థ నాస్‌డాక్ నార్డిక్ (పూర్వం ఓఎంఎక్స్ గా ప్రసిద్ధి), నాస్‌డాక్ బాల్టిక్ అనే స్టాక్‌మార్కెట్ నెట్‌వర్క్‌లను నడుపుతోంది.

చరిత్ర

[మార్చు]

1971–1999

[మార్చు]

నాస్‌డాక్ (NASDAQ) అనేది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటొమేటెడ్ కొటేషన్స్ (National Association of Securities Dealers Automated Quotations") కు సంక్షిప్త రూపం.[4] ఇది 1971లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ సంస్థచే ప్రారంభించబడింది.[5]ఈ సంస్థ నాస్‌డాక్ నుండి తన పెట్టుబడులను 2000-2001లో ఉపసంహరించుకుంది. నాస్‌డాక్ స్టాక్ మార్కెట్‌ను Nasdaq, Inc.అనే సంస్థ స్వంతదారుగా నిర్వహిస్తున్నది. ఈ సంస్థ షేర్లను 2002 జూలై 2 నుండి స్వంత స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ చేస్తున్నది.

1971, ఫిబ్రవరి 8లో ఈ స్టాక్ మార్కెట్ ప్రారంభమైనప్పుడు ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఎలెక్ట్రానిక్ స్టాక్ మార్కెట్.[5] మొదట్లో ఇది వాణిజ్యానికి కాక కేవలం "కొటేషన్ సిస్టమ్‌"కు మాత్రమే ఎలెక్ట్రానిక్ పద్ధతిని ఉపయోగించేది. .[6]

కాలం గడిచే కొద్దీ నాస్‌డాక్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ సిస్టమ్‌ను అవలంబించింది. ఇది అమెరికాలో ఆన్-లైన్ ట్రేడింగ్ ప్రారంభించిన మొదటి స్టాక్‌మార్కెట్‌గా పేరుగడించింది. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ మైక్రోసాఫ్ట్, ఆపిల్, సిస్కో, ఒరాకిల్, డెల్ వంటి కొత్తగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలను ఆకర్షించి వాటి ఆధునీకరణ కొరకు ఐ.పి.ఓకు సహకరించింది.

1992లో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌తో చేతులు కలిపి కాపిటల్ మార్కెట్ కొరకు మొదటి అంతర్జాతీయ బంధనాన్ని ఏర్పరచింది.[7]

నాస్‌డాక్ సూచీ 1990ల చివరలో పైకెగిసి తరువాత డాట్‌-కామ్‌ బుడగ పేలిన ఫలితంగా తీవ్రంగా పడిపోయింది.

2000–ప్రస్తుతం

[మార్చు]
స్టూడియో

2000, మార్చి 10వ తేదీన నాస్‌డాక్ సూచీ 5,132.52 ఉన్నత స్థాయికి చేరుకుని ఏప్రిల్ 17 నాటికి 3227 పాయింట్లకు పడిపోయి,[8] తరువాతి 30 నెలలలో 78 శాతానికి పడిపోయింది.[9]

2018 జనవరి 3వ తేదీన మార్కెట్‌ చరిత్రలో తొలిసారి నాస్‌డాక్‌ 7,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నిలిచింది. 2017 చివరలో ఇంట్రాడేలో ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ ముగింపు సమయానికి వెనకడుగు వేసింది. ప్రధానంగా టెక్నాలజీ ఇండెక్స్‌ 1.4 శాతం పురోగమించడంతో అధికంగా 103 పాయింట్లు (1.5 శాతం) జంప్‌చేసి 7,007 వద్ద ముగిసింది[10].

2006లో ఈ సంస్థ లైసెన్స్‌డ్ జాతీయ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ స్థాయికి చేరుకుంది.[11]

2007లో ఈ సంస్థ ఓఎంఎక్స్ సంస్థతో విలీనమై తన పేరును నాస్‌డాక్ ఓఎంఎక్స్ గ్రూప్‌గా మార్చుకుంది.[12]

ఈ స్టాక్‌ఎక్స్చేంజ్‌ జాబితాలో నమోదు కావాలంటే ఆ కంపెనీ యునైటెడ్ స్టేట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలి, కనీస ఆస్తులు, మూలధనం, పబ్లిక్ వాటాలు, షేర్ హోల్డర్లు ఉండాలి. ఈ సంస్థలో ప్రస్తుతం 3295 కంపెనీలు లిస్టింగులో ఉండగా వాటిలో 4 భారతీయ కంపెనీలు ఉన్నాయి.

2016 నవంబరులో అడెనా ఫ్రైడ్‌మాన్ ఈ సంస్థ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవి నుండి ఛీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పదోన్నతిని పొందించి. అమెరికాలోని ప్రధాన స్టాక్ ఎక్చేంజి నడుపుతున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది.[13] 2016లో ఈ సంస్థ కంపెనీల లిస్టింగు సంబంధిత లావాదేవీల ద్వారా 272 మిలియన్ డాలర్లు సంపాదించింది.[14]

భారతీయ కంపెనీలు

[మార్చు]

నాస్‌డాక్‌లో లిస్ట్ అవుతున్న భారతీయ కంపెనీల జాబితా[15]:

కంపెనీ పేరు సింబల్ మార్కెట్ క్యాపిటల్ ఐ.పి.ఓ.కు వెళ్లిన సంవత్సరం రంగం
మేక్ మై ట్రిప్ లిమిటెడ్ MMYT 3.3 బిలియన్ డాలర్లు 2010 పర్యాటక సేవలు
సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ SIFY 54.96 మిలియన్ డాలర్లు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్, డేటా ప్రాసెసింగ్
విడియోకాన్ డి2హెచ్ లిమిటెడ్ VDTH 261.68 మిలియన్ డాలర్లు టెలివిజన్ సేవలు
యాత్రా ఆన్‌లైన్ ఇన్‌కార్పొరేషన్ YTRA 299.65 మిలియన్ డాలర్లు పర్యాటక సేవలు

వార్షిక సగటు వృద్ధిరేటు

[మార్చు]

2015 జూన్ నాటికి నాస్‌డాక్ స్టాక్ మార్కెట్ అది 1971 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుండి 9.24 శాతం వార్షిక సగటు వృద్ధిరేటును సాధించింది. 2009 జూన్ నాటి ఆర్థిక మాంద్యం తరువాత ప్రతి యేటా 18.29 శాతం వృద్ధి చెందుతూ ఉంది.[16]

మూలాలు

[మార్చు]
 1. "నాస్‌డాక్ కంపెనీలు". Archived from the original on మార్చి 14, 2018. Retrieved మార్చి 14, 2018.
 2. "Monthly Reports". World-Exchanges.org. World Federation of Exchanges. Archived from the original on 2014-08-17. Retrieved 2018-03-11.
 3. Nasdaq. "Nasdaq – Business Solutions & Services". Archived from the original on అక్టోబరు 20, 2016. Retrieved మార్చి 31, 2022.
 4. "Frequently Asked Questions. NASDAQ.com. NASDAQ, n.d. Web. December 23, 2001". Archived from the original on 2010-04-29. Retrieved 2018-03-11.
 5. 5.0 5.1 Terrell, Ellen. "History of the American and Nasdaq Stock Exchanges". LOC.gov. Library of Congress Business Reference Services. Archived from the original on ఏప్రిల్ 14, 2013. Retrieved ఏప్రిల్ 27, 2013.
 6. "Nasdaq.com Frequently Asked Questions". Archived from the original on 2018-02-12. Retrieved October 23, 2016.
 7. Odekon, Mehmet (మార్చి 17, 2015). Booms and Busts: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis (in ఇంగ్లీష్). Routledge. ISBN 9781317475750. Archived from the original on ఆగస్టు 3, 2017. Retrieved మార్చి 11, 2018.
 8. "NASDAQ Composite daily index". Archived from the original on నవంబరు 22, 2010.
 9. Glassman, James K. (ఫిబ్రవరి 11, 2015). "3 Lessons for Investors From the Tech Bubble". Kiplinger's Personal Finance. Archived from the original on ఏప్రిల్ 15, 2017.
 10. "వహ్వా..7,000 దాటేసిన నాస్‌డాక్‌!". Archived from the original on 2018-02-07. Retrieved 2018-03-14.
 11. Walsh, Michelle. "Nasdaq Stock Market Becomes A National Securities Exchange; Changes Market Designations". Archived from the original on డిసెంబరు 17, 2013.
 12. Lucchetti, Aaron; MacDonald, Alistair (మే 26, 2007). "Nasdaq Lands OMX for $3.7 Billion; Are More Merger Deals on the Way?". Wall Street Journal (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0099-9660. Archived from the original on జూలై 31, 2017. Retrieved జూలై 21, 2017.
 13. "Nasdaq's New CEO Attributes Her Success to an 'Eclectic' Career Path". Fortune. నవంబరు 15, 2016. Archived from the original on నవంబరు 17, 2016. Retrieved నవంబరు 17, 2016.
 14. Osipovich, Alexander (అక్టోబరు 26, 2017). "Startup Exchange Cleared to Take on NYSE, Nasdaq for Stock Listings". Wall Street Journal. New York City, United States. Archived from the original on అక్టోబరు 26, 2017. Retrieved అక్టోబరు 26, 2017.
 15. నాస్‌డాక్ భారతీయ కంపెనీలు
 16. "Measuring Worth – Measures of worth, inflation rates, saving calculator, relative value, worth of a dollar, worth of a pound, purchasing power, gold prices, GDP, history of wages, average wage". measuringworth.com. Archived from the original on అక్టోబరు 4, 2015. Retrieved మార్చి 11, 2018.