నిజాం పాలనలో కార్మికోద్యమం
తెలంగాణ సాయుధ పోరాటం లో కార్మికోద్యమం ఒకటి. తెలంగాణలో పరిశ్రమలు చాలా తక్కువగా ఉండడంతో, కార్మికుల సంఖ్య కూడా తక్కువగానే ఉండేది.[1] 1939నాటికి మరికొన్ని పరిశ్రమలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ నిజాం రైల్వేకు కేంద్రస్థానమడం, తెలంగాణ జిల్లాల్లోనే బొగ్గుగనులు ఇతర పరిశ్రమలుండడంతో కార్మికుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది.
అయితే, నిజాం కాలంలో కార్మికోద్యమం లేదు. బ్రిటీష్ ఇండియాలో ఏర్పడిన కార్మిక సంఘాల శాఖలు నిజాం సంస్థానంలో ఏర్పడలేదు. కార్మిక సంఘాల విషయంలో నిజాం వ్యతిరేకంగా ఉండేవారు. అయినాకాని అక్కడక్కడ కొన్నికొన్ని సమ్మె పోరాటాలు జరుగుతుండేవి.
1928లో నిజాం రైల్వే ఉద్యోగులు, కార్మికులు సమ్మె చేయడం ప్రారంభించారు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సమ్మె. ఈ సమ్మెకు రైల్వే ఉద్యోగైన రాఘవేంద్రరావు, ఫతేవుల్లాఖాన్ నాయకత్వం వహించారు. ఈ సమ్మెతోనే కార్మికోద్యమం ప్రారంభమైంది. 1935లో మరొక సమ్మె జరిగింది. 1935-36 మధ్యకాలంలో సింగరేణి, కొత్తగూడెం బొగ్గుగనుల్లో కొన్నిరోజులపాటు సమ్మె జరిగింది. దాంతో ప్రభుత్వం కొన్ని కొరికలను అంగీకరించి సమ్మె విరమణ చేయించింది.
తెలంగాణ వ్యాప్తంగా, సంస్థాన వ్యాపితంగా నిర్మాణయుతమైన కార్మికోద్యమం లేకపోయిన స్థానిక నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెలు చేసి తమ కోరికలలో కొన్నీంటిని సాధించుకున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-51), మొదటి భాగము, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ప్రొలిటేరియన్ లైన్ ప్రచురణలు, హైదరాబాద్, ప్రథమ ముద్రణ, జూలై 1988, పుట.190