Jump to content

నిట్టూరు శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
నిట్టూరు శ్రీనివాసరావు
జననం(1903-08-24)1903 ఆగస్టు 24
మరణం2004 ఆగస్టు 12(2004-08-12) (వయసు 100)
విద్యాసంస్థబీఎస్సీ - మైసూర్ విశ్వవిద్యాలయం, బి ఎల్ - మద్రాస్ విశ్వవిద్యాలయం
జీవిత భాగస్వామిపద్మమ్మ

నిట్టూరు శ్రీనివాసరావు (24 ఆగష్టు 1903 - 12 ఆగష్టు 2004)[1] భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న గాంధేయవాది. అతను మైసూర్ రాష్ట్రం (ప్రస్తుతం కర్ణాటక) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ ఆఫ్ ఇండియాకు మొదటి చీఫ్ కూడా. అతను మైసూర్ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్‌గా కూడా ఎంపికయ్యాడు. మహాత్మా గాంధీ ఆత్మకథను కన్నడ భాషలోకి అనువదించిన మొదటి వ్యక్తి.[2][3]

జీవిత చరిత్ర

[మార్చు]

నిట్టూరు శ్రీనివాసరావు బెంగళూరులో మైసూర్ రాష్ట్రంలోని విద్యావంతులైన, మధ్యతరగతి స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి నిట్టూరు శామన్న, చిత్రదుర్గ జిల్లాలోని హొసదుర్గలో పాఠశాల ఉపాధ్యాయుడు. ఆ పాఠశాల హెడ్ మాస్టర్ గా కూడా విధులు నిర్వర్తించారు. అతని తల్లి సీతమ్మ, ఎం. ఎన్. కృష్ణారావు సోదరి. అతను అనేక దశాబ్దాల పాటూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. తర్వాత 1941లో కొన్ని నెలలపాటు మైసూర్‌లో తాత్కాలిక దివాన్‌గా పనిచేశారు.[4] నిట్టూరు శ్రీనివాసరావు కుటుంబం తుమకూరు జిల్లా (ప్రస్తుతం కర్ణాటకలో ఉంది) గుబ్బి తాలూకాలోని నిట్టూరు గ్రామానికి చెందినది. అందుకని అతని కుటుంబాన్ని దక్షిణ భారత శైలిలో వారి గ్రామం పేరుతో పిలుస్తారు. నిట్టూరు శ్రీనివాసరావు అక్క పుట్టమ్మ, సి. కె. నాగరాజ రావు తల్లి. ఇతను ఒక ప్రముఖ కన్నడ సాహిత్యవేత్త.

చదువు

[మార్చు]

నిట్టూరు శ్రీనివాసరావు తన ప్రాథమిక పాఠశాల విద్యను హోసదుర్గ, చల్లకెరె, షిమోగాలోని కన్నడ మాధ్యమ పాఠశాలల్లో చదివాడు. ఆ సమయంలో మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న బెంగుళూరులోని సెంట్రల్ కాలేజీలో చేరాడు. అతను బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌ లో పట్టభద్రుడయ్యాడు. బెంగుళూరులోని నేషనల్ హైస్కూల్‌లో సైన్స్, మ్యాథమెటిక్స్ టీచర్‌గా చేసాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు తిరిగి చదువు కొనసాగిస్తూ మద్రాసు లా కాలేజీలో చేరాడు. 1927లో బ్యాచిలర్ ఆఫ్ లా పట్టా పుచ్చుకున్నాడు.[1]

మహాత్మాగాంధీ ప్రభావం

[మార్చు]

1920 దశకం ప్రారంభంలో నిట్టూరు శ్రీనివాసరావు మహాత్మా గాంధీ సూత్రాలచే ప్రభావితమయ్యాడు. 1927లో గాంధీ బెంగుళూరు సందర్శించినప్పుడు, నిట్టూరు శ్రీనివాసరావు తన ఆత్మకథను కన్నడలోకి అనువదించడానికి అనుమతి తీసుకున్నాడు. అతను, అతని భార్య ఇబ్బరు కన్నడిగరు అనే బిరుదు పొందారు. స్వీయచరిత్రను అనువదించడం ప్రారంభించారు. అది కన్నడ వార్తాపత్రికలు.. విశ్వ కర్ణాటక, లోకమాతలో సీరియల్ రూపంలో ప్రచురించబడింది.[1] అతను ఆ అనువాదానికి సత్యశోధన అని పేరు పెట్టాడు. గాంధేయ సూత్రాలను ప్రచారం చేయడానికి, అతను కర్ణాటక గాంధీ మెమోరియల్ ట్రస్ట్, గాంధీ పీస్ ఫౌండేషన్‌కు అధ్యక్షుడయ్యాడు. ఖాదీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఖాదీ యూనిట్‌ను కూడా ప్రారంభించాడు.

స్వాతంత్ర్య ఉద్యమం

[మార్చు]

18 ఏళ్ల వయసులో నిట్టూరు శ్రీనివాసరావు భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1930, 1940 సంవత్సరాల మధ్య కాలంలో అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. అతను కాంగ్రెస్ మైసూర్ రాష్ట్ర యూనిట్ లో పనిచేశాడు. శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1932లో ధార్వాడ్‌లో కాంగ్రెస్ రాష్ట్ర శాఖ కార్యాలయాన్ని కూడా నడిపారు.[5] 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో, అతను కమలాదేవి ఛటోపాధ్యాయ, ఆర్. ఆర్. దివాకర్, యు. ఎస్. మాల్యా వంటి కాంగ్రెస్ నాయకులకు ఆశ్రయం కల్పించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Veena Bharathi. "The uncrowned visionary". Online Edition of The Deccan Herald, dated 2004-08-24. Archived from the original on 29 September 2007. Retrieved 3 September 2007.
  2. A Jayaram (13 August 2004). "A friend who will be missed by everyone". The Hindu. Chennai, India. Archived from the original on 23 December 2004. Retrieved 3 September 2007.
  3. Gopal K Kadekodi. "Obituary – Nittoor Srinivas Rau" (PDF). Online webpage of the Institute of Social and Economic Change, Bangalore. Archived from the original (PDF) on 9 అక్టోబరు 2007. Retrieved 3 September 2007.
  4. Mala Kumar. "As sharp as ever". Online Edition of The Hindu, dated 30 September 2002. Archived from the original on 19 November 2002. Retrieved 3 September 2007.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  5. Geetha Rao (15 August 2003). "I-Day, through eyes old and young". Online Edition of The Times of India, dated 15 August 2003. Retrieved 3 September 2007.