నితిన్ నబిన్
| నితిన్ నబిన్ సిన్హా नितिन नबीन सिन्हा | |||
| పదవీ కాలం 20 జనవరి 2026 – ప్రస్తుతం | |||
| ముందు | జె.పి.నడ్డా | ||
|---|---|---|---|
భారతీయ జనతా యువ మోర్చా బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు | |||
ఎమ్మెల్యే | |||
| పదవీ కాలం 2010 – ప్రస్తుతం | |||
| నియోజకవర్గం | బంకిపూర్ | ||
| పదవీ కాలం 2006 జనవరి 20 నుంచి – 2010 | |||
| ముందు | నవీన్ కిషోర్ సిన్హా | ||
| తరువాత | నియోజకవర్గం పునర్విభజన | ||
| నియోజకవర్గం | పాట్నా వెస్ట్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1980 మే 23 పాట్నా, బీహార్ భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | నాబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా మీరా సిన్హా | ||
| జీవిత భాగస్వామి | డా. దీపమాల శ్రీవాస్తవ | ||
నితిన్ నబిన్ సిన్హా (జననం 23 మే 1980) బీహార్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు బంకిపూర్ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[1] నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]నితిన్ నబిన్ తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నబిన్ కిషోర్ ప్రసాద్ మరణాంతరం 2006లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2006లో జరిగిన ఎన్నికల్లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన ఆ తరువాత బంకిపూర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
నితిన్ నబిన్ నాల్గొవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నితీష్ కుమార్ మంత్రివర్గంలో 9 ఫిబ్రవరి 2021 నుండి 9 ఆగష్టు 2022 వరకు రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.[4]
నితిన్ నబిన్‌ను 2025 డిసెంబర్ 14న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియమించింది.[5][6]
బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక కోసం 2026 జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేయగా, నితిన్ నబిన్ జనవరి 19న నామినేషన్ దాఖలు చేశాడు. ఈ పదవి కోసం ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.[7] 2026 జనవరి 20న జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.[8][9] నితిన్ నబిన్ 45 సంవత్సరాల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ News18 (10 November 2020). "Nitin Nabin (BJP) Election Result 2020 Live Updates: Nitin Nabin of BJP Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 26 August 2022. Retrieved 26 August 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India. "20-year master plan for roads, bridges soon: RCD minister" (in ఇంగ్లీష్). Archived from the original on 26 August 2022. Retrieved 26 August 2022.
- ↑ The Times of India (16 October 2020). "BJP's Nitin Nabin files his nomination papers". Archived from the original on 28 March 2023. Retrieved 28 March 2023.
- ↑ "పదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్.. 26మంది మంత్రులతో ప్రమాణం..!". TV9 Telugu. 20 November 2025. Archived from the original on 21 November 2025. Retrieved 21 November 2025.
- ↑ "భాజపా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్". Eenadu. 14 December 2025. Archived from the original on 16 December 2025. Retrieved 16 December 2025.
- ↑ "బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబీన్ ఎవరు?". BBC News తెలుగు. 15 December 2025. Archived from the original on 16 December 2025. Retrieved 16 December 2025.
- ↑ "బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం.. ఎవరీ నితిన్ నబిన్?". Samayam Telugu. Retrieved 2026-01-20.
- ↑ "నితిన్ నబీన్ నా బాస్.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు". Eenadu. 20 January 2026. Archived from the original on 20 January 2026. Retrieved 20 January 2026.
- ↑ "The PM's new 'boss': Nitin Nabin takes over as BJP president" (in Indian English). The Hindu. 20 January 2026. Archived from the original on 20 January 2026. Retrieved 20 January 2026.