నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు
స్వరూపం
నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు రంగస్థల నటుడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]శర్మ బ్రదర్స్ లో ఒకరైన వెంకటేశ్వర్లుపై తన అన్నగారి నాటక ప్రదర్శనల ప్రభావం ఎంతో ఉంది. 1971 లో తెనాలిలో కళాభారతి నాటక సంస్థను ప్రారంభించాడు. కళాభారతి ప్రదర్శించిన ప్రతిష్టాత్మకమైన జైభవానీ నాటకంలో చత్రపతి శివాజీ పాత్ర అద్భుతంగా పోషించాడు. నాటక ప్రదర్శన తరువాత శివాజీ పాత్రలో ఉన్న వెంకటేశ్వర్లు ప్రక్కన ఎంతోమంది నిలబడి ఫొటోలు తీయించుకునేవారు.
చిన్న వయస్సులోనే ప్రమాదవశాత్తు చనిపోయిన తన కుమారుని పేరున శ్రీరామ సంస్థను ఫైన్ ఆర్ట్స్ స్థాపించి, కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇండియన్ బ్యాంక్ లో సీనియర్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ లో ఉంటున్నాడు.
నటించిన నాటకాలు – పాత్రలు
[మార్చు]- జైభవానీ - శివాజీ
- కీర్తిశేషులు – వాణీనాధం
- తుఫాన్ – గోపి
- ఉలిపికట్టె
- మానవుడు-చిరంజీవి
మూలాలు
[మార్చు]- నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 268.