నిరుపమ సునేత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిరుపమ సునేత్రి
Nirupama Sunethri.jpg
జననంనిరుపమ సునేత్రి
సెప్టెంబరు 23, 1982
రంగారెడ్డి జిల్లా, ఆమనగల్
వృత్తివెంకటేశ్వర నాట్యమండలి, సురభి
ప్రసిద్ధితెలుగు రంగస్థల నటీమణి
మతంహిందూ మతము
తండ్రిరవివర్మ
తల్లిరేకందార్ పద్మజ

నిరుపమ సునేత్రి తెలుగు రంగస్థల నటి, దర్శకురాలు, పరిశోధక విద్యార్థి.

జననం[మార్చు]

1982, సెప్టెంబరు 23 వ తేదీన శ్రీమతి రేకందార్ పద్మజ, రవివర్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు గ్రామంలో జన్మించారు. బాలనటిగా రంగస్థల ప్రవేశం గావించి ఈనాటికీ పాత్రధారణ గావిస్తున్నారు. ఈమె వెంకటేశ్వర నాట్యమండలి, సురభిలో వివిధ నాటకాలలో నటిస్తున్నారు.[1]

విద్యాభ్యాసం[మార్చు]

భువనగిరి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాలలో బి.ఎ. (రాజనీతిశాస్త్రం, 2002-2005) చదివారు. హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో ఎం.ఎ (2005-2007), ఎం.ఫిల్ (సురభివారి రంగొద్దీపనం - ఒక అధ్యయనం, 2011) పూర్తిచేశారు. ప్రస్తుతం పిహెడ్.డి చేస్తున్నారు.

వివిధ నాటకాలలో పాత్రలు[మార్చు]

 • అనసూయలో (మునికాంత),
 • కృష్ణలీలలులో (గోపిక, మాయపూతన),
 • హరిశ్చంద్రలో (రంభ),
 • మాయాబజార్ లో (శశిరేఖ),
 • గంగావతరణంలో (మోహిని),
 • కురుక్షేత్రంలో (ఊర్వశి),
 • పాతాళ భైరవిలో (సఖి),
 • బొబ్బిలి యుద్ధంలో (చిన వెంకట్రావు),
 • బాల నాగమ్మలో (బాలనాగమ్మ, సంగు),
 • లవకుశలో (లవుడు, సీత),
 • కనకతారలో (తార, గ్రీష్ముడు),
 • ప్రహ్లాదలో (లక్ష్మి; రంభ, ప్రహ్లాదుడు)
 • విశ్వనాథ విజయంలో (విశ్వనాథుడు),
 • బ్రహ్మంగారి చరిత్రలో (గోవిందమ్మ, వనకన్య),
 • భీష్మలో (అంబాలిక),
 • చండీప్రియలో (సులక్షణుడు),
 • బస్తీ దేవతలో (యాదమ్మ),
 • ఆంటిగని
 • భక్త ప్రహ్లాద [2]లో నటించారు.

అవార్డులు[మార్చు]

 • నంది అవార్డు - ఉత్తమ ఆహార్యం (శాపగ్రస్తులు, 2006 నంది నాటకోత్సవం)
 • నంది అవార్డు - ఉత్తమ రంగొద్దీపనం (బాలనాగమ్మ, 2011 నంది అవార్డు)
 • నంది అవార్డు - ఉత్తమ రంగొద్దీపనం (శ్రీ కాళహస్తీశ్వర సాయిజ్యం, 2015 నంది అవార్డు)
బాలనాగమ్మ నాటకానికి ఉత్తమ రంగొద్దీపనానికి నంది అవార్డు స్వీకరిస్తున్న నిరుపమ

పురస్కారాలు[మార్చు]

జె.ఎల్. నరసింహారావు స్మారక యువ పురస్కారం[మార్చు]

తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖ ప్రతి ఏట ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు నాటకరంగంలోని యువ కళాకారులకు ఇచ్చే జె.ఎల్. నరసింహారావు స్మారక యువ పురస్కారంలో భాగంగా 2016 సంవత్సరానికి నిరుపమ సునేత్రికి ఇవ్వడం జరిగింది.[3]

ఫెలోషిప్ లు[మార్చు]

 • 2006లో జాతీయ మానవ వనరుల శాఖ వారినుండి జూనియర్ స్కాలర్ షిప్ అందుకున్నారు
 • 2016లో జాతీయ సాంస్కృతిక శాఖ నుండి జూనియర్ ఫెలోషిప్ అందుకున్నారు

మూలాలు[మార్చు]

 1. "సురభి నాటకం కృష్ణ లీలలు లో సునేత్రి". Archived from the original on 2015-12-03. Retrieved 2013-05-26.
 2. సురభి నాటకం భక్త ప్రహ్లాద లో సునేత్రి
 3. ప్రజాశక్తి. "కళాకారులు ప్రభుత్వాన్ని యాచించవద్దు". Archived from the original on 27 మార్చి 2019. Retrieved 11 August 2017.
 • నిరుపమ సునేత్రి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 53.