నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులు ఆఫ్రికా, ఆసియా, అమెరికా వంటి దేశాలలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో తక్కువ ఆదాయం కలిగిన ప్రజల్లో వచ్చే సాధారణమైన ఉష్ణమండల అంటువ్యాధులు. వైరస్ లు, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, హెల్మిన్త్ వంటి వివిధ రకాల వ్యాధికారక కారకాల వల్ల ఈ వ్యాధులు సంభవిస్తాయి. ఈ వ్యాధులు పెద్ద మూడు అంటు వ్యాధులైన ఎయిడ్స్, క్షయ, మలేరియా ల కంటే భిన్నంగా ఉంటాయి, వీటికి సాధారణంగా ఎక్కువ చికిత్స, పరీక్షలు అవసరం.[1] ఉప-సహారా ఆఫ్రికాలో ఈ వ్యాధుల ప్రభావం మలేరియా, క్షయవ్యాధితో పోల్చబడుతుంది.[2] ఈ వ్యాధులు ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు.[3]

కొన్ని సందర్భాల్లో వీటి చికిత్సలు చవకగా ఉంటాయి. ఉదాహరణకు, స్కిస్టోసోమియాసిస్ చికిత్స సంబంథించి ప్రతి సంవత్సరానికి ప్రతి బిడ్డకు 0.20. డాలర్లు ఖర్చు అవుతుంది.[4] 2010లో అంచనా వేసిన ప్రకారం నిర్లక్ష్యం చేయబడిన వ్యాధుల నియంత్రణకు వచ్చే ఐదు నుండి ఏడు సంవత్సరాలలో 2 బిలియన్ అమెరికన్ డాలర్లు, 3 బిలియన్ డాలర్ల నిధులు అవసరమని తేలింది.[5] కొన్ని ఔషధ కంపెనీలు అవసరమైనన్ని ఔషధ చికిత్సలను అందించడానికి సిద్ధంగా ఉడడంతోపాటు, అవి అందించిన మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఉదాహరణకు, మాస్ డైవర్మింగ్) అనేక దేశాలలో విజయవంతంగా నిర్వహించబడింది.[6] అభివృద్ధి చెందిన దేశాలలో ఈ వ్యాధుల నివారణ చర్యలు తరచుగా అందుబాటులో ఉంటాయి. కానీ పేద ప్రాంతాలలో అందుబాటులో లేవు.[7]

ఈ వ్యాధులు అభివృద్ధి చెందిన దేశాలలోని పేదలపై అత్యంత ప్రభావితం చేస్తాయి. రోజుకు రెండు డాలర్ల కన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తున్న 1.46 మిలియన్ల (2.8 మిలియన్ల పిల్లలతో సహా) కుటుంబాలు యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాయి.[8] ఇలాంటి దేశాలలో ఈ వ్యాధులు తరచుగా ఇతర ప్రజారోగ్య సమస్యల వల్ల బయటికి రావడంలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల, అభివృద్ధి చెందిన దేశ జనాభాలో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. పేదరికం, తగినంత గృహాలు లేకపోవడం దీనికి కారణం కావచ్చు.[9]

ప్రపంచ ఆరోగ్య సంస్థ 20 రకాల నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులను గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇతర సంస్థలు ఈ వ్యాధులను భిన్నంగా నిర్వచించాయి. 2017లో క్రోమోబ్లాస్టోమైకోసిస్ - డీప్ మైకోసెస్, గజ్జి, ఇతర ఎక్టోపరాసైట్స్, పాముకాటు ఎనోనోమేషన్ వంటివి జాబితాలో చేర్చబడ్డాయి.[10] 149 దేశాలలో ఈ వ్యాధులు సాధారణంగా ఉండడమేకాకుండా, 500 మిలియన్లకు పైగా పిల్లలతో సహా 1.4 బిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి.[11] వీటిద్వారా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రతి సంవత్సరం బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[12] 1990లో 204,000 మరణాలు, 2013లో 1,42,000 మరణాలు సంభవించాయి.[13] ఈ 20 వ్యాధులలో 2015 నాటికి డ్రాకున్క్యులియాసిస్ (గినియా-వార్మ్ డిసీజ్), 2020 నాటికి యావ్స్ అనే రెండు వ్యాధులను నిర్మూలన చేయాలని... 2020 నాటికి బ్లైండింగ్ ట్రాకోమా, హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్, లెప్రసీ, శోషరస ఫైలేరియాసిస్ అనే నాలుగు వ్యాధులను రూపు మాపాలని లక్ష్యంగా పెట్టుకుంది.[12]

వ్యాధుల జాబితా

[మార్చు]

ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు, అంటు వ్యాధి నిపుణులలో నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల వర్గీకరణపై చర్చ జరుగుతోంది. నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల పరిశోధకుడైన ఫీసీ... అస్కారియాసిస్, బురులి అల్సర్, చాగాస్ వ్యాధి, డ్రాకున్క్యులియాసిస్, హుక్వార్మ్ ఇన్ఫెక్షన్, హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్, లీష్మానియాసిస్, కుష్టు వ్యాధి, శోషరస ఫైలేరియాసిస్, ఒంకోసెర్సియాసిస్, ట్రిస్టోసోమియాసిస్ వంటి 13 రకాల వ్యాధులను నిర్లక్ష్యం చేసిన ఉష్ణమండల వ్యాధులుగా పేర్కొన్నాడు.[14] పైన చెప్పిన వాటిల్లో హుక్వార్మ్ మినహాయించి మిగిలినవన్ని నిర్లక్ష్యం చేసిన ఉష్ణమండల వ్యాధులే అని ఫెన్విక్ పేర్కొన్నాడు.[15]

ఈ వ్యాధులు నాలుగు వేర్వేరు తరగతుల వ్యాధికారక కారకాల నుండి సంభవిస్తాయి: (i) ప్రోటోజోవా (చాగాస్ వ్యాధి, మానవ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్, లీష్మానియాసెస్); (ii) బ్యాక్టీరియా (బురులి అల్సర్, కుష్టు వ్యాధి, ట్రాకోమా, యావ్స్); (iii) హెల్మిన్త్స్ లేదా మెటాజోవాన్ పురుగులు (సిస్టిసర్కోసిస్, డ్రాకున్క్యులియాసిస్, ఎచినోకోకోసిస్, ఫుడ్‌బోర్న్ ట్రెమాటోడియాస్, శోషరస ఫైలేరియాసిస్, ఒంకోసెర్సియాసిస్, స్కిస్టోసోమియాసిస్, మట్టి-వ్యాప్తి చెందే హెల్మిన్థియాసిస్); (iv) వైరస్ (డెంగ్యూ, చికున్‌గున్యా, రాబిస్).

ప్రపంచ ఆరోగ్య సంస్థ క్రింద ఉన్న ఇరవై వ్యాధులను నిర్లక్ష్యం చేసిన ఉష్ణమండల వ్యాధులుగా గుర్తించింది.[16]

 1. బురులి అల్సర్
 2. చాగస్ వ్యాధి
 3. డెంగ్యూ, చికున్‌గున్యా
 4. డ్రాకున్కులియాసిస్
 5. ఎచినోకోకోసిస్
 6. కోయకురుపు
 7. పచ్చకామెర్లు, విరేచనాలు, కడుపునొప్పి
 8. ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్
 9. లీష్మేనియాసిస్
 10. కుష్టు వ్యాధి
 11. శోషరస స్తన్యత
 12. ఒంకోసెర్సియాసిస్
 13. రాబీస్
 14. స్కిస్టోసోమియాసిస్
 15. మట్టి-వ్యాప్తి చెందే హెల్మిన్థియాసిస్
 16. సిస్టిసర్కోసిస్
 17. శుక్లపటలమునకు సోకిన అంటురోగము
 18. గజ్జి, ఇతర ఎక్టోపరాసైట్స్
 19. స్నేక్ బైట్ ఎన్నోమింగ్
 20. మైసెటోమా, డీప్ మైకోసెస్

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. Hotez PJ (November 2013). "NTDs V.2.0: "blue marble health"--neglected tropical disease control and elimination in a shifting health policy landscape". PLoS Neglected Tropical Diseases. 7 (11): e2570. doi:10.1371/journal.pntd.0002570. PMC 3836998. PMID 24278496.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link) open access publication - free to read
 2. Hotez PJ, Kamath A (August 2009). Cappello M (ed.). "Neglected tropical diseases in sub-saharan Africa: review of their prevalence, distribution, and disease burden". PLoS Neglected Tropical Diseases. 3 (8): e412. doi:10.1371/journal.pntd.0000412. PMC 2727001. PMID 19707588.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link) open access publication - free to read
 3. Mike Shanahan (31 జనవరి 2006). "Beat neglected diseases to fight HIV, TB and malaria". SciDev.Net. Archived from the original on 19 మే 2006.
 4. "Making the Case to Fight Schistosomiasis". National Public Radio. Archived from the original on 10 అక్టోబరు 2008. Retrieved 10 జనవరి 2020.
 5. Hotez PJ (జనవరి 2010). "A plan to defeat neglected tropical diseases". Scientific American. 302 (1): 90–4, 96. Bibcode:2010SciAm.302a..90H. doi:10.1038/scientificamerican0110-90. PMID 20063641. Archived from the original on 6 ఆగస్టు 2014.
 6. Reddy M, Gill SS, Kalkar SR, Wu W, Anderson PJ, Rochon PA (October 2007). "Oral drug therapy for multiple neglected tropical diseases: a systematic review". JAMA. 298 (16): 1911–24. doi:10.1001/jama.298.16.1911. PMID 17954542.
 7. Hotez P (1 నవంబరు 2009). "Neglected diseases amid wealth in the United States and Europe". Health Affairs. 28 (6): 1720–5. doi:10.1377/hlthaff.28.6.1720. PMID 19887412.
 8. "Research Publications | Poverty Solutions at The University of Michigan". www.npc.umich.edu (in ఇంగ్లీష్). Archived from the original on 23 జూలై 2017. Retrieved 10 జనవరి 2020.
 9. Hotez PJ (సెప్టెంబరు 2012). "Fighting neglected tropical diseases in the southern United States" (PDF). BMJ. 345: e6112. doi:10.1136/bmj.e6112. PMID 22977143. Archived from the original (PDF) on 10 మే 2017. Retrieved 10 జనవరి 2020.
 10. "World Health Organization". World Health Organization. Archived from the original on 22 ఫిబ్రవరి 2014. Retrieved 10 జనవరి 2020.
 11. "DNDi – Best Science for the Most Neglected". www.dndi.org. Archived from the original on 13 మార్చి 2018. Retrieved 10 జనవరి 2020.
 12. 12.0 12.1 "World Health Organization". World Health Organization. Archived from the original on 20 అక్టోబరు 2017. Retrieved 10 జనవరి 2020.
 13. "Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990-2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013". Lancet. 385 (9963): 117–71. January 2015. doi:10.1016/S0140-6736(14)61682-2. PMC 4340604. PMID 25530442.
 14. Feasey N, Wansbrough-Jones M, Mabey DC, Solomon AW (2010). "Neglected tropical diseases". British Medical Bulletin. 93 (1): 179–200. doi:10.1093/bmb/ldp046. PMID 20007668. Archived from the original on 14 ఫిబ్రవరి 2016. Retrieved 10 జనవరి 2020.
 15. Fenwick A (మార్చి 2012). "The global burden of neglected tropical diseases". Public Health. 126 (3): 233–236. doi:10.1016/j.puhe.2011.11.015. PMID 22325616.
 16. "Neglected tropical diseases". World Health Organization. Archived from the original on 22 ఫిబ్రవరి 2014. Retrieved 10 జనవరి 2020.