నీనా ప్రసాద్
స్వరూపం
నీనా ప్రసాద్ | |
---|---|
జననం | |
వృత్తి | నృత్య కళాకారిణి, నాట్య గురువు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మోహినియాట్టం |
జీవిత భాగస్వామి | అడ్వకేట్ సునీల్.సి.కురియన్ |
నీనా ప్రసాద్, కేరళకు చెందిన నృత్య కళాకారిణి, నాట్య గురువు.[1] మోహినియాట్టంలో ప్రావీణ్యం సంపాదించింది. [2] తిరువనంతపురంలో భర్తంజలి అకాడమీ ఆఫ్ ఇండియన్ డ్యాన్సెస్, చెన్నై సౌగండిక సెంటర్ ఫర్ మోహిన్యాట్టం సంస్థలను స్థాపించింది.[3][4][5]
జననం, విద్య
[మార్చు]నీనా ప్రసాద్ కేరళలోని త్రివేండ్రంలో జన్మించింది. భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టం,కథాకళిలో ప్రావీణ్యం సాధించింది. ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ చేసిన తరువాత, కలకత్తాలోని రవీంద్రభారతి విశ్వవిద్యాలయం నుండి "దక్షిణ భారతదేశ శాస్త్రీయ నృత్యాలలో లాస్య, తాండవ భావనలు-ఎ డిటైల్డ్ స్టడీ" అనే అంశంపై పిహెచ్‌డి పట్టా పొందింది. రీసెర్చ్ సెంటర్ ఫర్ క్రాస్ కల్చరల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, యూనివర్శిటీ ఆఫ్ సర్రే నుండి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా లభించింది.[6]
శిక్షణలు
[మార్చు]- మోహినియాట్టం - కళామండలం సుగంధి - 8 సంవత్సరాలు
- కళామండలం క్షేమావతి - 3 సంవత్సరాలు
- భరతనాట్యం - పద్మశ్రీ అడయార్ కె. లక్ష్మణ్ – 11 సంవత్సరాలు
- కూచిపూడి - పద్మభూషణ్ వెంపట్టి చిన సత్యం –12 సంవత్సరాలు
- కథాకళి - వెంబయం అప్పుకుట్టన్ పిళ్లై – 10 సంవత్సరాలు
అవార్డులు
[మార్చు]- మయిల్‌పీలి అవార్డు[7]
- నిర్త్య చూడామణి అవార్డు (2015)[8]
- కేరళ కల్మండలం అవార్డు 2017 (మోహినియాట్టం)[9]
మూలాలు
[మార్చు]- ↑ "'Dancers lack professional approach'". thehindu.com. Retrieved 1 May 2022.
- ↑ "Dancing Queen". thehindu.com. Retrieved 1 May 2022.
- ↑ "NEENA PRASAD". thehindu.com. Retrieved 1 May 2022.
- ↑ "Neena Prasad to perform classic Indian dance of Mohiniyattam in Dubai". thenational.ae. Retrieved 1 May 2022.
- ↑ "An inspiring milieu". thehindu.com. Retrieved 1 May 2022.
- ↑ "Fellowship from the AHRB Research Centre for Cross Cultural Music and Dance Performance, University of Surrey, UK". artindia.net. Archived from the original on 24 May 2016. Retrieved 1 May 2022.
- ↑ "Mayilpeeli award for Sugathakumari, Neena Prasad". thehindu.com. Retrieved 1 May 2022.
- ↑ "Nritya Choodamani". indian heritage.org. Retrieved 1 May 2022.
- ↑ "Kalamandalam awards announced | Kochi News - Times of India". The Times of India.