Jump to content

నీరజ్ ఘైవాన్

వికీపీడియా నుండి
నీరజ్ ఘైవాన్
నీరజ్ ఘైవాన్
జననం1980 (age 43–44)
వృత్తిదర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

నీరజ్ ఘైవాన్ తెలంగాణకు చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. ప్రధానంగా హిందీ సినిమాలలో పనిచేస్తున్నాడు. జాతీయ చలనచిత్ర అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతోపాటు అనేక అవార్డులను. ప్రశంసలను అందుకున్నాడు.

జననం, విద్య

[మార్చు]

నీరజ్ ఘైవాన్ 1980లో[1] తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో జన్మించాడు.[2] ఇతని కుటుంబం మహారాష్ట్ర నుండి వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డారు. తండ్రి రీసెర్చ్ సైంటిస్ట్, తల్లి గార్మెంట్ స్టోర్ యజమాని.[3] కేంద్రీయ విద్యాలయ శివరాంపల్లి (నేషనల్ పోలీస్ అకాడమీ) నుండి పాఠశాల విద్యను అభ్యసించి, 2002లో హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశాడు. ఆ తర్వాత పూణేలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ నుండి మార్కెటింగ్‌లో ఎంబిఏ చేశాడు.[4]

ఉద్యోగం

[మార్చు]

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, యుటివి న్యూ మీడియా, హిందుస్థాన్ టైమ్స్, టెక్ మహీంద్రా తదితర సంస్థలలో ఇంజనీర్‌గా పనిచేశాడు.

సినిమారంగం

[మార్చు]

సినిమాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి ఫ్యాషన్ ఫర్ సినిమా అనే వెబ్ పోర్టల్ కు సినీ విమర్శకుడిగా రాయడం ప్రారంభించాడు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ పరిచయంతో సినిమారంగానికి వచ్చాడు.[5] 2010లో ఆన్‌లైన్ వన్-నిమిషం ఫిల్మ్ ఫెస్టివల్ అయిన పిఎఫ్సీవన్ పోటీ విభాగానికి షార్ట్‌లిస్ట్ చేసిన ఇండిపెండెన్స్ అనే తన మొదటి లఘుచిత్రాన్ని రూపొందించాడు.[6]

2015లో మసాన్‌ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి ముందు గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ (2012), అగ్లీ (2013) సినిమాల నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు సహాయం చేశాడు. అదే సమయంలో షోర్, ఎపిఫనీ అనే రెండు లఘుచిత్రాలకు దర్శకత్వం వహించాడు.[3] మసాన్‌ సినిమా అనేక ప్రశంసలు అందుకోవడంతోపాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫిప్రెస్సీ బహుమతితోపాటు రెండు ఇతర బహుమతులను గెలుచుకుంది.[7] 2017 తీసిన జ్యూస్ లఘు చిత్రానికి నీరజ్ ఘైవాన్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్-ఫిక్షన్ కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. 2019లో కశ్యప్‌తో కలిసి నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సేక్రేడ్ గేమ్స్ రెండవ సీజన్‌కు, 2021లో అజీబ్ దాస్తాన్స్ నుండి గీలీ పుచ్చితో సహ-దర్శకత్వం వహించాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు దర్శకుడు రచయిత ఇతర వివరాలు మూలాలు
2013 లఘు చిత్రాలు Yes Yes విభాగం: షార్
ఎపిఫనీ Yes Yes షార్ట్ ఫిల్మ్
2015 మసాన్ Yes కాదు [8]
2017 రసం Yes Yes షార్ట్ ఫిల్మ్ [9]
2019 పవిత్ర గేమ్స్ Yes కాదు 8 ఎపిసోడ్‌లు [10]
2021 అజీబ్ దాస్తాన్స్ Yes Yes విభాగం: గీలీ పుచ్చి [11]

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు సినిమా విభాగం ఫలితం మూలాలు
2015 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మసాన్ కెమెరా డి'ఓర్ నామినేట్ [12][13]
అన్ సెర్టైన్ రిగార్డ్ అవార్డు నామినేట్
ఫిప్రెస్సీ బహుమతి విజేత
ప్రత్యేక బహుమతి విజేత
2016 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు విజేత [14]
2018 రసం ఉత్తమ షార్ట్ ఫిల్మ్ - ఫిక్షన్ విజేత [15]
2016 జాతీయ చలనచిత్ర అవార్డులు మసాన్ దర్శకుని ఉత్తమ తొలి చిత్రం విజేత [16]
2016 ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డులు ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు విజేత [17]
జీ సినీ అవార్డులు మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్ విజేత [18]

మూలాలు

[మార్చు]
  1. "Neeraj Ghaywan responds to Vivek Agnihotri's Dalit tweet; Twitter lines up in support of the Masaan director- Entertainment News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2018-01-04. Archived from the original on 30 August 2020. Retrieved 2023-07-27.
  2. "The last five years have not been easy: Neeraj Ghaywan". Hindstan Times. 12 July 2015. Archived from the original on 7 July 2015. Retrieved 2023-07-27.
  3. 3.0 3.1 "The 'Masaan'-man turned ad-man: How Neeraj Ghaywan found his calling" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2022. Retrieved 2023-07-27.
  4. www.ETBrandEquity.com. "Neeraj Ghaywan: The 'Masaan'-man turned ad-man - ET BrandEquity". ETBrandEquity.com (in ఇంగ్లీష్). Archived from the original on 12 November 2020. Retrieved 2023-07-27.
  5. "I'm overwhelmed, says 'Masaan' director Neeraj Ghaywan on his Cannes experience". First Post. 1 June 2015. Archived from the original on 5 August 2015. Retrieved 2023-07-27.
  6. "PFCOne 2010 Online One Minute Film Festival begins". 5 January 2010. Archived from the original on 24 September 2015. Retrieved 2023-07-27.
  7. Nisha Singh (May 20, 2020). "Can't believe I lived this moment: Director Neeraj Ghaywan recalls Masaan premiere at Cannes". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 16 November 2020. Retrieved 2023-07-27.
  8. Bapna, Amit (2 March 2016). "The 'Masaan'-man turned ad-man: How Neeraj Ghaywan found his calling". The Economic Times. Archived from the original on 21 April 2022. Retrieved 2023-07-27.
  9. "Juice review: Neeraj Ghaywan puts everyday misogyny in sharp focus. Watch video". Hindustan Times. 26 November 2017. Archived from the original on 18 August 2019. Retrieved 2023-07-27.
  10. "Neeraj Ghaywan Opens Up on Replacing Vikramaditya Motwane as Director on Sacred Games 2". News18. 30 July 2019. Archived from the original on 31 July 2019. Retrieved 2023-07-27.
  11. "'It's intersectional': Neeraj Ghaywan on caste-class conflict in Ajeeb Daastaans". Indian Express. 13 April 2021. Archived from the original on 30 November 2021. Retrieved 2023-07-27.
  12. "Cannes: 'Son of Saul,' 'Masaan' Take Fipresci Prizes". The Hollywood Reporter. 23 May 2015. Archived from the original on 24 May 2015. Retrieved 2023-07-27.
  13. "Cannes: 'Rams' Wins Un Certain Regard Prize". The Hollywood Reporter. 23 May 2015. Archived from the original on 24 May 2015. Retrieved 2023-07-27.
  14. "Filmfare Awards 2016: Complete List of Winners". NDTV India. 15 January 2015. Archived from the original on 17 March 2016. Retrieved 2023-07-27.
  15. "63rd Jio Filmfare Awards 2018: Complete winners' list". The Times of India. 21 January 2018. Archived from the original on 5 February 2018. Retrieved 2023-07-27.
  16. "63rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 7 April 2016. Retrieved 2023-07-27.
  17. Hungama, Bollywood (2015-12-23). "Winners of 11th Renault Sony Guild Awards : Bollywood News - Bollywood Hungama". Bollywood Hungama (in ఇంగ్లీష్). Archived from the original on 16 April 2021. Retrieved 2023-07-27.
  18. "Zee Cine Most Promising Director Award (ZCA) - Zee Cine Most Promising Director Award Winners". www.awardsandshows.com. Archived from the original on 16 April 2021. Retrieved 2023-07-27.

బాహ్య లింకులు

[మార్చు]