Jump to content

నీలం సంజీవరెడ్డి స్టేడియం

వికీపీడియా నుండి
నీలం సంజీవరెడ్డి స్టేడియం
జిల్లా కళాశాల స్టేడియం
మైదాన సమాచారం
ప్రదేశంఅనంతపురం, ఆంధ్రప్రదేశ్
స్థాపితం1964 (తొలి మ్యాచ్)
సామర్థ్యం (కెపాసిటీ)10,000
ఎండ్‌ల పేర్లు
n/a
జట్టు సమాచారం
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీమ్ (1964–1986)
2014 14 జూలై నాటికి
Source: Ground profile

నీలం సంజీవరెడ్డి స్టేడియం (జిల్లా కళాశాల స్టేడియం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం పట్టణంలో ఉన్న క్రికెట్ స్టేడియం.[1] మొదట్లో దీనిని జిల్లా కళాశాల స్టేడియం అని పిలిచేవారు, కొంతకాలం తరువాత దీనికి భారతదేశ ఆరవ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పేరు పెట్టారు.

ప్రారంభం

[మార్చు]

1964లో 10,000 సీట్ల సామర్థ్యంతో ఈ స్టేడియం ఏర్పాటయింది.

మ్యాచ్‌ల వివరాలు

[మార్చు]
  1. 1963/64 లో రంజీ ట్రోఫీ సందర్భంగా 1964లో ఈ స్టేడియంలో మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ - మద్రాస్ లకు చెందిన క్రికెట్ జట్లు పోటీపడ్డాయి.
  2. 1986/87 రంజీ ట్రోఫీలో ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా బొంబాయి ఆడింది. 1964 నుండి 1986 వరకు ఈ స్టేడియంలో మరో నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు జరిగాయి.[2]
  3. 2017, నవంబరు 5న సినీతారల క్రీసెంట్‌ క్రికెట్‌ పోటీ జరిగింది. ఇందులో సినీ పరిశ్రమకు చెందిన 30 మంది హీరోలు, 15 మంది హీరోయిన్స్‌ ఇందులో పాల్గొని క్రికెట్ ఆడారు.[3]

ఇతర కార్యక్రమాలు

[మార్చు]
  1. 2013, డిసెంబరు 23న జరిగిన నీలం శతజయంతి ముగింపు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉమ్మడి అంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.[4]
  2. 2017లో రాష్ట్ర ప్రభుత్వం తరపున 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని, జెండాను ఎగురవేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Ground profile: Neelam Sanjeeva Reddy Stadium". CricketArchive. Retrieved 20 July 2021.
  2. "First-class Matches played on Neelam Sanjeeva Reddy Stadium". CricketArchive. Retrieved 9 November 2011.
  3. ఆంధ్రజ్యోతి, అనంతపురం (3 November 2017). "సినీ తారల క్రికెట్‌ మ్యాచ్‌కు స్టేడియం ముస్తాబు". andhrajyothy. Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  4. "రాష్ట్రపతి అనంతపురం పర్యటన". TeluguOne News. Retrieved 20 July 2021.
  5. "ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తా". Samayam Telugu. Retrieved 20 July 2021.

బయటి లింకులు

[మార్చు]