నీలమణి రౌత్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీలమణి రౌత్రే
నీలమణి రౌత్రే


పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
ప్రధాన మంత్రి వి.పి.సింగ్

గవర్నరు హరిచరణ్ సింగ్ బార్
బి. డి. శర్మ

నియోజకవర్గం పూరీ

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్,
ఉత్కల్ కాంగ్రెస్,
భారతీయ లోక దళ్,
జనతా పార్టీ
జీవిత భాగస్వామి నళినీ దేవి రౌత్రే
సంతానం బిజయ్ శ్రీ రౌత్రే
పూర్వ విద్యార్థి రావెన్‌షా కళాశాలలో,
విద్యాసాగర్ కళాశాల,
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ, సామాజిక కార్యకర్త, రచయిత, పాత్రికేయుడు, న్యాయవాది
పురస్కారాలు ఒడిశా సాహిత్య అకాడమీ 1986

నీలమణి రౌత్రే, (1920 మే 24 - 2004 అక్టోబరు 4) భారతదేశం, ఒడిశా రాష్ట్రం, బాలాసోర్ జిల్లాలోని ముకుంద్‌పూర్‌లో జన్మించాడు.[2] తండ్రి దివంగత ఎస్. దివంగత చంద్ర శేఖర్ రౌత్రే, కటక్‌లోని రెవెన్‌షా కళాశాల, విద్యాసాగర్ కళాశాల (కలకత్తా విశ్వవిద్యాలయం),  బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదివాడు. రాజకీయ, సామాజిక కార్యకర్త, రచయిత, పాత్రికేయుడు, న్యాయవాది, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు.[3] అతని జీవిత భాగస్వామి నళినీదేవి రౌత్రే.

కలకత్తా ఒరియా సమాజ్ కార్యదర్శిగా పనిచేసాడు.అతను భారతీయ రాజకీయనాయకుడు.ఇతను 1977 నుండి 1980 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసాడు.అతను వి.పి. సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా, తరువాత అటవీ, పర్యావరణ మంత్రిగా పనిచేశాడు. అతను 2004 అక్టోబరు 4 న మరణించాడు.[4][5]

రాజకీయ జీవితం[మార్చు]

నీలమణి రౌత్రే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఒడిశా రాష్ట్ర సంస్థ వ్యవస్థాపకుడు.అతను 1967 నుండి 1970 వరకు భారత జాతీయ కాంగ్రెస్ ఒడిశా రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసాడు.తరువాత అతను ఉత్కల్ కాంగ్రెస్‌లో చేరి దాని అధ్యక్షుడయ్యాడు. తదనంతరం, అతను భారతీయ లోక్‌దళ్‌కు మారాడు.భారతీయ లోక్‌దళ్‌ ఒడిశా రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడయ్యాడు.అతను 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యాడు [6]

విశేషాలు[మార్చు]

అతని ఆత్మకథ స్మృతి ఓ అనుభూతి (1986) 1988 లో ఒడిశా సాహిత్య అకాడమీ పురస్కారం పొందంది.[7][8]

మూలాలు[మార్చు]

  1. "Members Bioprofile". Parliament of India, Lok Sabha. 1920-05-24. Retrieved 2019-07-08.
  2. https://odisha.gov.in/odisha-profile/eminent-personalities/sri-nilamani-routray
  3. "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2021-09-14.
  4. "The Hindu : Front Page : Nilamani Routray dead". web.archive.org. 2004-10-10. Archived from the original on 2004-10-10. Retrieved 2021-09-14.
  5. Nilamani Routray passes away, three-day state mourning in Odisha
  6. "Former Odisha Chief Minister Nilamani Routray passes away". Daily Excelsior. 5 October 2004. Archived from the original on 23 నవంబరు 2008. Retrieved 14 సెప్టెంబరు 2021.
  7. "Odisha Sahitya Academy Award winners" (PDF). 2019-07-08. Archived (PDF) from the original on 8 July 2019. Retrieved 8 July 2019.
  8. "Odisha Sahitya Akademi". Odisha Sahitya Akademi (in ఒడియా). Archived from the original on 13 June 2016. Retrieved 2019-07-08.

వెలుపలి లంకెలు[మార్చు]