నీలా జంగయ్య
Jump to navigation
Jump to search
నీలా జంగయ్య కవి, విమర్శకుడు, ఉపాధ్యాయుడు. వాసవీ సాహిత్యపరిషత్తును స్థాపించాడు. దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. నందనవనం అనే సాహితీ సంస్థకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
- రమ్యపథము - ఈ ఖండకావ్యసంపుటిలో 38 కవితలున్నాయి.
- జ్ఞానమందిరం - ఈ ఖండకావ్యసంపుటిలో కథాకావ్యం, శతకలక్షణాలున్న పద్యాలు, వచన కవిత, గీతాలు, వచనం,వృత్తాలు, ద్విపద మొదలైన వైవిధ్యభరిత కవిత్వం ఉంది.
- మధువనం - ఈ ఖండకావ్యసంపుటిలో చైతన్యదేవత, అడిగేదెవ్వరు?, ఎవరివే?, చెండాడుము, రా!, బాటసారి, అంతా ఒకటే, చెలిగనవే మొదలైన శీర్షికలు ఉన్నాయి.
- దర్శనము - ఈ ఖండకావ్యసంపుటిలో వచనం, గేయం, పద్యం మూడు రూపాలలో కవితలున్నాయి.
- కవితా సమాలోచనలు - వ్యాసాల సంపుటము.
- ఆవేదన - 1956లో వెలువడిన ఖండకావ్యసంపుటి.
- కాంతిపుంజాలు - విశ్వనాథ సత్యనారాయణ, దాశరథి, సి.నారాయణరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, కాళోజీ, వసంత వెంకటరావు, కొత్తపల్లి వీరభద్రరావు, ముకురాల రామారెడ్డి, దామోదరం సంజీవయ్య, కోదాటి నారాయణరావు, ఉమ్మెత్తల కేశవరావు, మండలి వెంకటకృష్ణారావు, కొణిజేటి రోశయ్య ప్రభృతులపై అల్లిన కవితల సంపుటి ఇది. దేవులపల్లి రామానుజరావుకు అంకితం ఇవ్వబడింది.
- రామలింగపద్యాలు - రమ్యగుణ శుభాంగ! రామలింగ! అనే మకుటంతో వెలువడిన పద్యాలు.
- మహాప్రపంచము[2] - శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రేరణతో వెలువడిన ఖండకావ్య సంపుటి ఇది.దీనిలో వచన కవితలు, గేయాలు, పద్యాలు ఉన్నాయి. 1959లో వెలువడింది. నీలా జంగయ్య దీనిని యాదగిరి లక్ష్మీనరసింహస్వామికి అంకితం చేశాడు.
- సంస్కారభూషణం - 40 ఖండికల సంపుటి ఇది.
- బాలగీతాంజలి - బాలలను ఉద్దేశించి వ్రాసిన 130 నీతి పద్యాలు. 1956లో రచింపబడింది. వినుర తెలుగుబాల! వినుతశీల! అనే మకుటంతో వెలువడింది.
- విప్లవస్వరాలు - ఈ ఖండకావ్యసంపుటిలో కన్యావిక్రయం అనే ఖండిక ముఖ్యమైనది.
- బుచ్చిలింగపద్యాలు - ఈ శతకములో లచ్చనంగ బతుకు బుచ్చిలింగ అనే మకుటంతో పద్యాలున్నాయి.
- సుమమాల - జి.శ్రీనివాసరెడ్డితో కలిసి 1956లో ఖండకావ్యసంపుటిని వెలువరించాడు.
- వైశ్యకులదీపిక - ఈ బుర్రకథలో గుప్తరాజుల చరిత్ర, మహాత్మాగాంధీ చరిత్ర, పొట్టి శ్రీరాములు చరిత్ర అభివర్ణిచబడింది. 1956లో వెలువడింది.
- రసవిపంచి - ఈ ఖండకావ్యసంపుటిలో గొప్ప, కవిత్వం, క్షుద్రరాజ్యం, భావకృతి,శరణ్యమ్, కళామృతం,జ్ఞానులు మొదలైన ఖండికలున్నాయి.
- బ్రతుకుబాటలో పాటలమూట - నీలా జంగయ్య వ్రాసిన గేయాల సంపుటి.
- సాహిత్యవైభవం - ఈ వ్యాససంపుటిలో 'మహాత్ముడు సత్యాన్వేషి' మొదలు 'ముక్తగీతాలు' వరకు ఉన్న వ్యాసాలలో రచయిత సాహిత్యజీవితంలోను, సామాజిక జీవితంలోను సంపాదించుకున్న అనుభవాల సారం వ్యక్తీకరించబడింది.
- శారదాంబపద్యాలు - చారుగుణ కదంబ శారదాంబ! అనే మకుటం కలిగిన శతకము.
- కలం కల - 34 ఖండికలున్న ఖండకావ్యసంపుటి.
- భద్రాద్రి మకుటనిర్వచనాలు - శతక రూపకమైన కృతి. కర్నాటి లింగయ్య దీనికి కృతిభర్త.
- చిద్విలాస ఈ శతకములో 375కు పైగా ఆటవెలదులు ఉన్నాయి.
- ఆణిముత్యాలు - ఈ ఖండకావ్యంలో ఆణిముత్యాలు, నరసింహ!, సందేశం,అన్నం-ఆకలి, గౌరవం డాల్డాకు, స్కూల్ దుకాణం, ఇది నిజం, చిలుకా, గ్రంథమందిరం, విప్లవం, అందుకే!, హితోక్తి, ఆలోచించు, మార్పు, ఛేదించు, సిద్ధార్తి సందేశం, మహాయుధం, ఒక్కనికే, ఇంకేం కావాలె?, న్యూట్రాన్ బాంబు, కొంటెతనం, హంసకథ, నక్కకథ, అంటతగినవాడు, మనిషి-కర్మసాక్షి, అతడు-ఆమె, రామరక్ష అనే 28 ఖండికలున్నాయి.
- కవితాచంద్రిక - ఖండకావ్యసంపుటి. కర్నాటి లింగయ్యకు అంకితం చేయబడింది.
- తెలుగులో తత్త్వకవులు -నీలా జంగయ్య ఈ విమర్శా గ్రంథంలో వేమన, వీరబ్రహ్మం, సిద్ధప్ప, అహ్మదొద్దీన్, గుజ్జల రామదాసు, పీర్ మొహినుద్దీన్ సాహెబ్, బోర అప్పలస్వామి, యడ్ల రామదాసు మొదలైన తత్త్వ కవుల నీతి,భక్తి,జ్ఞాన,వైరాగ్య తత్త్వాలను వివరించాడు.
- కవనకమలం - ఇది కూడా ఒక ఖండకావ్యసంపుటము.
- అగ్నిదీప్త - ఈ వెయ్యి పద్యాల మహా కావ్యములో కన్యకాపరమేశ్వరి చరిత్ర వర్ణించబడింది.
- రామశతకం - రామా! అనే మకుటంతో వెలువడిన శతకము.
- కాంతిచక్రం - ముప్పై ఖండికల కావ్యము.
- కవితారసోదయం - చల్లా సోమరాజారాం కు అంకితం ఇవ్వబడిన ఈ వ్యాససంపుటిలో భారత కల్పవృక్షం - వసుమతీ వసంతం, గురుప్రతీక - విద్యాగంధం, విశ్వంభర చదివింతరువాత, ముఖం చూసి బొట్టు పెట్టడం, అణాగ్రంథమాల ఉద్యమం, పద్యమే కవిత్వం, కవితా రసోదయం, దేశోద్ధరక గ్రంథమాల, పురోగామి-తిరోగామి, భారతీయుడు సృష్టించిన విమానం కథ, ప్రసిద్ధ నృసింహ క్షేత్రాలు, ఉండేల కవితాగాండీవం అనే 12 వ్యాసాలున్నాయి.
- పెళ్ళితోరణాలు - ఆప్తులు, బంధువులు, మిత్రుల ఇళ్లలో వివాహాలకు హాజరైనపుడు వధూవరులను ఆశీర్వదిస్తూ చదివిన పంచరత్న, నవరత్న పద్యాలనూ ఈ పుస్తకంలో సంపుటీకరించాడు.
- పదశారద - ఈ వ్యాససంపుటిలో సామెతలు, లోకోక్తులు, జానపద బాణీలు, తెలుగు వారి ఆటపాటలు, పదరూపాలు, తత్త్వచింతనా ధోరణులు, పల్లెపదాలు మొదలైనవాటిని స్పృశించాడు.
- చిత్కళా(1990)- గేయ కథా కావ్యం[3]
- విస్ఫులింగాలు
బిరుదము
[మార్చు]- కవిరత్న
మూలాలు
[మార్చు]- ↑ ఎం., కులశేఖరరావు (1989). శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక). హైదరాబాదు: నీలాజంగయ్య స్వర్ణోత్సవ సన్మాన సంఘం.
- ↑ నీలా, జంగయ్య (1959). మహాప్రపంచము. హైదరాబాదు: నీలా జంగయ్య.
- ↑ జంగయ్య, నీలా. చిత్కళ.