నీల్ అడ్కాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీల్ అడ్‌కాక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నీల్ అమ్విన్ ట్రెహార్నే అడ్‌కాక్
పుట్టిన తేదీ1931, మార్చి 8
మరణించిన తేదీ2013 జనవరి 6(2013-01-06) (వయసు 81)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1953 11 December - New Zealand తో
చివరి టెస్టు1962 16 February - New Zealand తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 26 99
చేసిన పరుగులు 146 451
బ్యాటింగు సగటు 5.40 5.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 24 41
వేసిన బంతులు 6,391 19,708
వికెట్లు 104 405
బౌలింగు సగటు 21.10 17.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 19
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 4
అత్యుత్తమ బౌలింగు 6/43 8/39
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 24/–
మూలం: Cricinfo, 2020 3 December

నీల్ అమ్విన్ ట్రెహార్నే అడ్‌కాక్ (1931, మార్చి 8 – 2013, జనవరి 6) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. 26 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.[1] ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. బంతిని లెంగ్త్ నుండి వేగంగా ఎత్తగలడు. టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గా ఉన్నాడు.

జీవితం[మార్చు]

అడ్‌కాక్ 1931 మార్చి 8న కేప్ టౌన్‌లోని సీ పాయింట్‌లో జన్మించాడు.

1953లో న్యూజీలాండ్‌పై స్వదేశంలో తొమ్మిది ఫస్ట్-క్లాస్ ఆటల తర్వాత తొలి టెస్టును ఆడాడు. రెండో టెస్టులో 87 పరుగులకు 8 వికెట్లతో సహా సిరీస్‌లో మొత్తం 24 వికెట్లు తీశాడు.[2]

1961లో ఐదుగురు విస్డెన్ క్రికెటర్లలో అడ్కాక్ ఒకడు. 1960లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టుల్లో 26 వికెట్లు, 14 సగటుతో మొత్తం 108 వికెట్లు తీసుకున్నాడు. దాంతో ఇంగ్లాండ్ పర్యటనలో 100కి పైగా వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. [3]

విరమణ[మార్చు]

క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత రేడియో వ్యాఖ్యాతగా మారాడు. ట్రావెల్ పరిశ్రమలో పనిచేశాడు. నీల్ అడ్‌కాక్‌కు భార్య మౌరీన్, మొదటి వివాహం నుండి డయానా (నీ డెవైన్) అడ్‌కాక్‌తో అతని పిల్లలు, కుమార్తె సుసాన్ డాన్స్, కుమారుడు అలాన్, ముగ్గురు మనవరాళ్ళు ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. Bernstein, Jenny (20 April 2011). "Fast-bowling great Neil Adcock dies – Yahoo! News South Africa". Za.news.yahoo.com. Archived from the original on 29 January 2013. Retrieved 2013-01-06.
  2. "Neil Adcock Profile – ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2022-11-28.
  3. Narayan, Manoj (2020-01-06). "Neil Adcock, South Africa's Pace Pioneer | Wisden Almanack". Wisden (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-11-28.

బాహ్య లింకులు[మార్చు]