Jump to content

నీల్ వాగ్నర్

వికీపీడియా నుండి
నీల్ వాగ్నెర్
2017లో ఎసెక్స్ తరఫున ఆడుతున్న వాగ్నెర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నీల్ వాగ్నెర్
పుట్టిన తేదీ (1986-03-13) 1986 మార్చి 13 (వయసు 38)[1]
ప్రిటోరియా, ట్రాన్స్‌వాల్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 256)2012 జూలై 25 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2023 మార్చి 9 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005/06–2007/08నార్దర్స్న్
2006/07–2007/08Titans
2008/09–2017/18Otago
2014నార్తాంప్టన్‌షైర్
2016లాంకషైర్
2017–2018ఎసెక్స్
2018/19–presentNorthern Districts
2023సోమర్సెట్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 63 202 116 80
చేసిన పరుగులు 842 3,515 634 198
బ్యాటింగు సగటు 14.27 16.81 12.19 9.00
100లు/50లు 0/1 0/10 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 66* 72 45* 16*
వేసిన బంతులు 13,581 41,483 5,641 1,592
వికెట్లు 258 814 176 89
బౌలింగు సగటు 27.50 27.15 28.62 25.79
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 9 36 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2 0 0
అత్యుత్తమ బౌలింగు 7/39 7/39 5/34 4/33
క్యాచ్‌లు/స్టంపింగులు 17/– 64/– 21/– 11/–
మూలం: ESPNcricinfo, 29 September 2023

నీల్ వాగ్నెర్ (జననం 1986, మార్చి 13) దక్షిణాఫ్రికాలో జన్మించిన న్యూజీలాండ్ టెస్ట్ క్రికెటర్. న్యూజీలాండ్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ జట్ల కోసం ఆడుతున్నాడు. 2007/08 వరకు నార్తర్న్స్, 2008 - 2018 మధ్యకాలంలో ఒటాగో కోసం ఆడాడు. వాగ్నెర్ 2019–2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన న్యూజీలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

ప్రపంచ రికార్డు

[మార్చు]

2011, ఏప్రిల్ 6న, స్టీవర్ట్ రోడ్స్, జో ఆస్టిన్-స్మెల్లీ, జీతన్ పటేల్, ఇలి తుగాగాలను అవుట్ చేసినప్పుడు వాగ్నర్ వెల్లింగ్టన్‌పై నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. ఆ తర్వాత అదే ఓవర్‌లోని ఆరో బంతికి మార్క్ గిల్లెస్పీ వికెట్ తీశాడు. ఒక 6-బంతిలో ఐదు వికెట్లు, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఇది సాధించడం ఇదే మొదటిసారి. ఇన్నింగ్స్‌లో బౌలింగ్ గణాంకాలు 6/36, ఆ సమయంలో ఇతని వ్యక్తిగత అత్యుత్తమంగా ఉన్నాయి.[2][3][4]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

వెస్టిండీస్, దక్షిణాఫ్రికాపై తన టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత, వాగ్నెర్ 2013లో ఇంగ్లాండ్‌తో స్వదేశంలో, విదేశాలలో జరిగిన సిరీస్‌లో న్యూజీలాండ్ జట్టుకు నమ్మకమైన 3వ సీమర్‌గా స్థిరపడ్డాడు. 5 టెస్టుల్లో 19 వికెట్లు తీశాడు. 2015లో ఇంగ్లాండ్‌తో న్యూజీలాండ్ ఆడిన 2 టెస్టుల్లో దేనిలోనూ ఎంపిక కాలేదు.

2015 చివరలో న్యూజీలాండ్ కోసం శ్రీలంక పర్యటన సందర్భంగా వాగ్నర్ తిరిగి జట్టులోకి వచ్చాడు.[5]

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టుకు ఎంపికయ్యాడు.[6] వాగ్నర్ బాగా బౌలింగ్ చేసి, మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో సహా 7 వికెట్లు పడగొట్టాడు. అప్పటినుండి, వాగ్నర్ న్యూజీలాండ్ టెస్ట్ జట్టులో రెగ్యులర్ స్టార్టర్‌గా మారాడు.

2016లో న్యూజీలాండ్ జింబాబ్వే పర్యటనలో వాగ్నర్ తన చక్కటి ఫామ్‌ను కొనసాగించాడు, అక్కడ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. మొదటి టెస్ట్‌లో ఐదు వికెట్ల హాల్‌తో సహా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 11 వికెట్లు తీశాడు.[7] ఆ తర్వాత న్యూజీలాండ్ వాగ్నర్ స్వస్థలమైన దక్షిణాఫ్రికాలో పర్యటించింది.[8] రెండో టెస్టులో, న్యూజీలాండ్‌ను చిత్తుగా ఓడించగా, వాగ్నర్ మళ్ళీ తన నాలుగో ఐదు వికెట్ల బ్యాగ్‌ని తీసుకుని దాడికి నాయకత్వం వహించాడు.[9]

2017 ఏప్రిల్ లో, 2017 ఐర్లాండ్ ట్రై-నేషన్ సిరీస్ కోసం న్యూజీలాండ్ వన్డే ఇంటర్నేషనల్జట్టులో ఎంపికయ్యాడు.[10]

2017 డిసెంబరు 1న, టిమ్ సౌథీ గాయపడటంతో వాగ్నర్ ట్రెంట్ బౌల్ట్‌కు ఓపెనింగ్ పార్టనర్ అయ్యాడు. 7/39తో అత్యుత్తమ గణాంకాలు చేశాడు. ఇది న్యూజీలాండ్ రికార్డు.[11]

2018 మేలో, న్యూజీలాండ్ క్రికెట్ ద్వారా 2018–19 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌ను పొందిన ఇరవై మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[12] 2018 నవంబరులో, పాకిస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో, తన 150వ టెస్ట్ వికెట్‌ను తీసుకున్నాడు.[13] 2019 డిసెంబరులో, ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో, వాగ్నర్ తన 200వ టెస్ట్ వికెట్‌ని తీశాడు. 2019/20 హోమ్ సీజన్‌ను ఐసీసీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ 2 టెస్ట్ బౌలర్‌గా ముగించాడు.[14]

2020 డిసెంబరులో, వెస్టిండీస్‌తో జరిగిన రెండవ మ్యాచ్‌లో, వాగ్నర్ తన 50వ టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు.[15]

2021 మే లో, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్, భారత్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం న్యూజీలాండ్ జట్టులో వాగ్నర్ ఎంపికయ్యాడు.[16] మొత్తం మూడు టెస్టుల్లో ఆడాడు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో న్యూజీలాండ్ విజయంలో మూడు సహా 10 వికెట్లతో పర్యటనను ముగించాడు.

మూలాలు

[మార్చు]
  1. Lynch, Steven (2014). The Wisden Guide to International Cricket 2014: The Definitive Player-by-Player Guide (in ఇంగ్లీష్). A&C Black. p. 193. ISBN 978-1-4081-9473-7. Retrieved 16 January 2020.
  2. "Otago v Wellington at Queenstown, Apr 4–6, 2011 | Cricket Scorecard". ESPNcricinfo. Retrieved 13 March 2013.
  3. "Fulton to lead New Zealand Emerging Players". ESPNcricinfo. 12 June 2009. Retrieved 26 March 2010.
  4. World record wicket haul – five in six balls – Neil Wagner యూట్యూబ్లో
  5. "When workhorse Wagner brought down the barn door". ESPNcricinfo. 14 December 2015. Retrieved 30 August 2016.
  6. "Wagner called in as cover for injured Southee". ESPNcricinfo. Retrieved 30 August 2016.
  7. "Zimbabwe on the back foot before a ball bowled". ESPNcricinfo. 28 July 2016. Retrieved 30 August 2016.
  8. "Homecoming for 'fully converted Kiwi' Neil Wagner". ESPNcricinfo. 27 August 2016. Retrieved 30 August 2016.
  9. "New Zealand tour of South Africa, 2nd Test: South Africa v New Zealand at Centurion, Aug 27–31, 2016". ESPNcricinfo. Retrieved 30 August 2016.
  10. "Latham to lead NZ in Ireland, uncapped Rance in squad". ESPNcricinfo. Retrieved 6 April 2017.
  11. "NZ 85/2 (37.0 ov, LRPL Taylor 12*, JA Raval 29*, ST Gabriel 0/22) - Live | Match Summary | ESPNCricinfo". ESPNcricinfo. Retrieved 2017-12-01.
  12. "Todd Astle bags his first New Zealand contract". ESPN Cricinfo. Retrieved 15 May 2018.
  13. "Tea Report: Neil Wagner completes 150 wickets after Pakistan take lead". Cricket Country. 17 November 2018. Retrieved 17 November 2018.
  14. "Relentless Wagner races to 200 Test wickets". Cricket Australia. Retrieved 28 December 2019.
  15. "Tom Latham leads as New Zealand focus on climbing up Test Championship table". ESPN Cricinfo. Retrieved 10 December 2020.
  16. "India vs New Zealand WTC final : India vs New Zealand World Test Championship final: Squads, schedule, venue, telecast - All you need to know". www.timesnownews.com. Retrieved 2021-05-15.

బాహ్య లింకులు

[మార్చు]